మొన్న డిల్లీలో గాంగ్ రేప్ తర్వాత అందరం ఆవేశ పడి పోయి, రేపిస్టులకు మరణ శిక్షే సరి అయినదని డిమాండ్ చెస్తున్నాం. నేను కూడ అదే అవేశం లో అదే కరెక్ట్ అనుకున్నాను. కాని నెమ్మదిగా, కూల్ మైంద్ తో అలోచిస్తే, ఈ డిమాండ్ తప్పని, ఒక వేళా అలాంటి శిక్షలే చట్టం లో పొందుపరుస్తే, దాని వలన ఆడపిల్లలు కు మేలు కంటే కీడే అదికమని అనిపిస్తుంది.
ఎలాగంటారా, ఇప్పట్టి వరకు రేప్ కీ గరిష్టంగా శిక్ష పది యేండ్లు మాత్రమె. కాబట్టి రేపిస్టుకు తాను చట్ట పరంగా శిక్షించబడినా ప్రాణం తీయరనె బరోసా ఉంటుంది కాబట్టి బాదితురాలికి ప్రాణ హాని తలపెట్టడు. అదే ఉరి శిక్ష అయితే ఎలాగు తాను చావడం ఖాయం కాబట్టి, కేసులో కీలక సాక్షి బాదితురాలే కాబట్టి, అమెను చంపితే కేసులో సాక్ష్యం లేకుండా చెయొచ్చు అనే బావనకు రావచ్చు. ఆమె బ్రతికున్నా, చచ్చినా ఒకటే శిక్ష కాబట్టి, ఆమెను చంపితేనే కొంతవరకు కేసు నుండి లేక ఉరి శిక్ష నుండి తప్పించుకోవచ్చు అని బావించే ప్రమాద ముంది. దీని వలన ప్రతి రేప్ బాదితురాలి ప్రాణానికి రిస్క్ ఏర్పడుతుంది. కాబట్టి మనమ్ అవేశం తో కాక విజ్ణతతో, వాస్తవిక ద్రుష్టితో అలోచించాలి.
మొన్నటి వరకు మన దేశమ్ లొ ఉరిశిక్ష ని రద్దు చెయ్యాలని పరి వర్తన వాదులు వాదించారు. కాని డిల్లీ ఘటన చూశాక మానవ మ్రుగాలకు ఉరిశిక్షే కరెక్ట్ అంటున్న జాతి యావత్తు ను చూసి ఏమనలెక పోతున్నారు. ఒక పక్క ఆడపిల్లలు గలమెత్తి అందోళన చెస్తుంటే, ప్రబుత్వానికి గుండే జారి పొతుంది,ఇదెక్కడ మహా ఉద్యమంగా మారి తమ అదికారానికే ఎసరు వస్తుందో అని. కాని మ్రుగాల్లకు మాత్రం ఏ మాత్రం జంకు గొంకు లేదు అనిపిస్తుంది. అసలు డీల్లీ ఘటన తర్వాత, అత్యచారాలు ఎక్కువ పెరిగాయో, లేక పత్రికల వాళ్ళు శ్రద్దగా ప్రతి అత్యాచారాన్ని ప్రచురిస్తున్నారో తెలియదు కాని అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే సామాన్య ఆడపిల్లలకు వారి తల్లి తండ్రులకు భయం వేస్తుంది. నేను మొన్న ఒక చోట కొంత మంది పెద్దల మాటలు అలకించాను. ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించే బదులు తొందరగా పెళ్ళి చేసి, తమ బాద్యతలు తీర్చుకుంటే మేలు అని.
పై మాటలు విన్న నాకు ఒక్క సారిగా చరిత్ర గుర్తుకు వచ్చింది.వెనుకటి రోజుల్లో మన వాళ్ళు ముస్లింల దండయాత్రలు సందర్బంగా పెళ్లికాని ఆడపిల్లల్ను చెరపట్టే వారని వారిని కాపాడుకోవడం కోసం వారికి బాల్య వివాహలు చెసే వారని చదువుకున్నాం.తిరిగి ఆడపిల్లల మీద అత్యాచారాలు నిరోదించలేక పోతె, తల్లి తండ్రులు ఆడపిల్లల్ని కాలేజిలకు పంపే బదులు పెళ్ళి చెయ్యడానికే మొగ్గు చూపొచ్చు. ఇది చూడటానికి కొంత విచిత్రంగా అనిపించినా ఆదునిక వస్త్రదారనే అత్యాచారాలకు ప్రదాన కారణమని పెద్దలు బావిస్తే జరుగబోయే పరిణామం ఇదే. పరువుగల తల్లి తండ్రులు పరువుగా తమ పిల్లల్ని ఒక పరువుగలవాడి చేతిలో పెట్టి తమ దర్మాన్ని నెర వేర్చాలనుకుంటారు. పరువు అనేది ట్రాష్ అనే గొప్ప సంస్కారం(?) నూటికి తొంబయిమందికి ఉండక పోవచ్చు. అటువంటి వారు దేన్నైన ఈజీగా తీసుకోవచ్చు. కాని బలయ్యెది సామాన్య, సాంప్రదాయ వాదులైన తల్లి తండ్రులున్న ఆడపిల్లలే. కాబట్టి తక్షణం ఈ సమస్యను సీరియస్ తీసుకోకపోతే ఇదొక సామాజిక రుగ్మత గా మారె ప్రమాదముంది.
ఉరి శిక్షకు బదులు, కొంతమంది సూచిస్తున్నట్లు, రసాయానాలతో, రేపిస్ట్" మగ అహంకారాన్ని" తొలగిస్తె మంచిదనుకుంటా! ఈ దిశగా సామాజిక వాదులు ఆలోచన చెయ్యాలని కోరుతున్నాను.నేను ఇదివరకటి టపాలో చెప్పినట్ట్లు, దీని మీద ఒక సమగ్ర అద్యయనం చేసేటందుకు నిర్థిష్ట కాల పరిమితితో కూడిన ఒక కమిటీ ని వేస్తె మంచిది. జుడిషియల్ కమిషన్ వలన లాభమ్ లేదు. సామాజిక వాదులు, స్త్రీ వాదులు, న్యాయ నిపుణులు, పోలిస్ అధికారులతో కూడిన ఒక విస్త్రుత కమిటీ నీ వేయాలి. అప్పుడే ఏమన్నా పలితం ఉండవచ్చు.