Showing posts with label తెలంగాణావిడాకులు. Show all posts
Showing posts with label తెలంగాణావిడాకులు. Show all posts

Friday, August 2, 2013

విడాకులు అయితే ఇచ్చేశాం , కాని పదేండ్లు కలసి ఉండక తప్పదు !


                                                               

అంద్రా  తెలంగాణా వీలీనాన్ని, పజల్ ఆలీ కమీషన్ మొదలు రాజకీయ వాదులు దాక , చాలా మంది బార్యా బర్తల సంబందం గానే పరిగణించారు . ఒక తెలివి గల అబ్బాయికి ,అమాయకురాలైన అమ్మాయికి మద్య జరిగిన పెండ్లి లాంటిది వీలీన ప్రక్రియ, అని కూడా  అన్నారట ! అలాగే కొన్నాళ్ళు కలసి ఉన్నాక పొసగటం లేదని బావిస్తే , తిరిగి ఎవరి దారిన వారు అంటే, తెలంగాణా వారు విడిపోవచ్చు అని కూడా  అన్నారట ! కాని పాపం అమాయకులు అయిన తెలంగాణా వారు , తెలివి గలవారైనా ఆంద్రా వారు కీచులాడుకుంటు , కాట్లాడుకుంటు ఎలాగో ఇన్నాళ్ళు ఓపికగా కాపురం చేస్తూ వచ్చారు .

    మరి యాబై యేండ్ల పై చిలుకు కాపురం లో అమ్మాయి ఇంటినే (హైదరాబాద్ ),తన ఇల్లుగా బావించి అబ్బాయి ఇంట్లో సొమ్ము కూడా  తెచ్చి , అమ్మాయి ఇంటిని హైటెక్ ఇంటిగా మార్చాడు . కాని ఆ  వంకతో అమ్మాయి తరపు వారిని, అబ్బాయి తరపు వారు కొంచం చిన్నచూపు చూస్తున్నారని , ఇక  మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే, అని అమ్మాయి తరపు వారు గొడవ చేస్తే , విడాకులు మంజూరు చేసే పెద్ద మనిషి  అందరి అభిప్రాయాలు అడిగితే , ఆ... అరవై యేండ్లు కలసి ఉన్న వారిని విడదీస్తారంటలే....  , అనుకుని తమ వాళ్ళని ఎవరిని అడగకుండా , అబ్బాయి తరపు పెద్ద మనుషులు మీ ఇష్టం అనే సరికి , ఆ  పెద్ద మనిషి కాస్తా విడాకులు మంజూరుకు o.k.  అన్నాడు. అంతే ! అబ్బాయి తరపు వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .

    అమ్మాయి ఇల్లు తమదనుకుని ఇన్నాళ్ళూ "హైటెక్ " గా అభిరుద్ది చేస్తే , ఏదో పది ఏండ్లు ఇక్కడే  ఉండి ,  తర్వాత మీ ఇంటికి వెళ్ళ మంటా రేమిటి ? ఇదెక్కడి తీర్పు ! అని అబ్బాయి తరపు వారు పెద్ద గొడవ చేస్తుంటే ,పెద్ద మనుషులు తాము చేసిన తప్పిదం గుర్తు వచ్చి , తేలు కుట్టిన దొంగలా ఏమనలేక , ఆ  విడాకులు ఇచ్చిన పెద్దమనిషి ఇలా చేస్తాడు అని ఊహించలేదని , ఇప్పుడు మీరేమి చేసినా మేమేమి మాట్లాడం అని , ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసరికి , రెచ్చిపోయిన అబ్బాయి తరపు వారు ఆ విడాకులు మంజూరు చేసిన పెద్ద మనిషిని బండ బూతులు తిడుతూ , ఆ హైటెక్ ఇంటిని వదలుకునే ప్రసక్తి లేదని కారాలు , మిరియాలు నూరుతున్నారు .. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా , సీమాంద్రల విడాకుల వ్యవహారం .

  నాకు ఒక డౌట్  ఏమిటంటే ,ఒక సారీ విడాకులు ఇచ్చాక , మళ్లీ  పదేండ్లు ఒకే ఇంటిలో వేర్వేరు కాపురాలు చేసుకొమ్మని తీర్పు చెప్పటం వివేకమైనదేనా ? ఈ  పదేండ్లలో ఆ మాజీ బార్య బర్తలు మద్య వివాదాలు రావా? వస్తే ఆ ఇంటి పరిస్తితి ఏమిటి ? మళ్లీ  ఆయనొచ్చే  మొదలేయి, !అన్నట్లు ఉండదా? సామరస్యంగా కాక కోట్లాడి  విడిపోయే వారిని ,మళ్ళి  ఏదో ఒక సాకుతో ఒక చోట ఉంచడం అంత తెలివి గల పని కాదేమో ! ఆలోచించండి.