అంద్రా తెలంగాణా వీలీనాన్ని, పజల్ ఆలీ కమీషన్ మొదలు రాజకీయ వాదులు దాక , చాలా మంది బార్యా బర్తల సంబందం గానే పరిగణించారు . ఒక తెలివి గల అబ్బాయికి ,అమాయకురాలైన అమ్మాయికి మద్య జరిగిన పెండ్లి లాంటిది వీలీన ప్రక్రియ, అని కూడా అన్నారట ! అలాగే కొన్నాళ్ళు కలసి ఉన్నాక పొసగటం లేదని బావిస్తే , తిరిగి ఎవరి దారిన వారు అంటే, తెలంగాణా వారు విడిపోవచ్చు అని కూడా అన్నారట ! కాని పాపం అమాయకులు అయిన తెలంగాణా వారు , తెలివి గలవారైనా ఆంద్రా వారు కీచులాడుకుంటు , కాట్లాడుకుంటు ఎలాగో ఇన్నాళ్ళు ఓపికగా కాపురం చేస్తూ వచ్చారు .
మరి యాబై యేండ్ల పై చిలుకు కాపురం లో అమ్మాయి ఇంటినే (హైదరాబాద్ ),తన ఇల్లుగా బావించి అబ్బాయి ఇంట్లో సొమ్ము కూడా తెచ్చి , అమ్మాయి ఇంటిని హైటెక్ ఇంటిగా మార్చాడు . కాని ఆ వంకతో అమ్మాయి తరపు వారిని, అబ్బాయి తరపు వారు కొంచం చిన్నచూపు చూస్తున్నారని , ఇక మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే, అని అమ్మాయి తరపు వారు గొడవ చేస్తే , విడాకులు మంజూరు చేసే పెద్ద మనిషి అందరి అభిప్రాయాలు అడిగితే , ఆ... అరవై యేండ్లు కలసి ఉన్న వారిని విడదీస్తారంటలే.... , అనుకుని తమ వాళ్ళని ఎవరిని అడగకుండా , అబ్బాయి తరపు పెద్ద మనుషులు మీ ఇష్టం అనే సరికి , ఆ పెద్ద మనిషి కాస్తా విడాకులు మంజూరుకు o.k. అన్నాడు. అంతే ! అబ్బాయి తరపు వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .
అమ్మాయి ఇల్లు తమదనుకుని ఇన్నాళ్ళూ "హైటెక్ " గా అభిరుద్ది చేస్తే , ఏదో పది ఏండ్లు ఇక్కడే ఉండి , తర్వాత మీ ఇంటికి వెళ్ళ మంటా రేమిటి ? ఇదెక్కడి తీర్పు ! అని అబ్బాయి తరపు వారు పెద్ద గొడవ చేస్తుంటే ,పెద్ద మనుషులు తాము చేసిన తప్పిదం గుర్తు వచ్చి , తేలు కుట్టిన దొంగలా ఏమనలేక , ఆ విడాకులు ఇచ్చిన పెద్దమనిషి ఇలా చేస్తాడు అని ఊహించలేదని , ఇప్పుడు మీరేమి చేసినా మేమేమి మాట్లాడం అని , ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసరికి , రెచ్చిపోయిన అబ్బాయి తరపు వారు ఆ విడాకులు మంజూరు చేసిన పెద్ద మనిషిని బండ బూతులు తిడుతూ , ఆ హైటెక్ ఇంటిని వదలుకునే ప్రసక్తి లేదని కారాలు , మిరియాలు నూరుతున్నారు .. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా , సీమాంద్రల విడాకుల వ్యవహారం .
నాకు ఒక డౌట్ ఏమిటంటే ,ఒక సారీ విడాకులు ఇచ్చాక , మళ్లీ పదేండ్లు ఒకే ఇంటిలో వేర్వేరు కాపురాలు చేసుకొమ్మని తీర్పు చెప్పటం వివేకమైనదేనా ? ఈ పదేండ్లలో ఆ మాజీ బార్య బర్తలు మద్య వివాదాలు రావా? వస్తే ఆ ఇంటి పరిస్తితి ఏమిటి ? మళ్లీ ఆయనొచ్చే మొదలేయి, !అన్నట్లు ఉండదా? సామరస్యంగా కాక కోట్లాడి విడిపోయే వారిని ,మళ్ళి ఏదో ఒక సాకుతో ఒక చోట ఉంచడం అంత తెలివి గల పని కాదేమో ! ఆలోచించండి.
mari emi cheyali podaniki vere kompa lede -kattukovli o kompa andaka tappadu ga- sonth illu ide anukoni papaulo kalu vesian Andhruda -meluko-vere kompa kooda standby ga vunchkovali anndi neethi - mee vyasam bagundi jawahar lal garu appudu anna matalu emitee ante -konnallaki ee naughty boy wiil become innocent and this innoscent girl wil become smart anii teleisinda swame
ReplyDeletejawahar lal garu appudu anna matalu emitee ante -konnallaki ee naughty boy wiil become innocent and this innoscent girl wil become smart anii teleisinda swame............
Deleteమీరు దేని ఆదారంగా పై మాటలు నెహ్రూ అన్నారు,అని అంటున్నారో తెలియదు. నెహ్రూ గారు అన్నది మాత్రం పొసగకపోతే విడాకులు తీసుకోవచ్చు అనే. దానికి ఆదారంగా ఈ రెపెరెన్స్ చూడండి.http://www.theweekendleader.com/Culture/1664/righting-a-wrong.html. Thank you for your response