Saturday, August 10, 2013

తీర్పు చెప్పినాక ,సమస్య గురించి అడిగే "తిక్కల పంచాయతి " ఎక్కడైనా ఉందా ?



  ఎక్కడో ఎందుకు ! ఇప్పుడు రాష్ట్రాన్ని ఆందోళన పదం వైపు నడిపిస్తుంది ఆ తిక్కల నిర్ణయాలే . తెలంగాణా  విషయం అరవై ఏండ్ల నాటిదట . ఆమె తాత గారు ,అత్తగారూ ,భర్త గారు ఎవరూ ఆ సమస్యని తేల్చ లేక పోయారు .ఆమె గారు కూడా  గత పదమూడేళ్ళుగా ఎన్నికల్లప్పుడు మాత్రమే రంగం మీదకొచ్చే తెలంగాణా సమస్యను సీరియస్ గా పట్టించుకోలేదు.నాలుగేళ్ల క్రితం అందరి అభ్ప్రాయం అడిగితే ,ఆ..  అరవై యేండ్ల గా ఇవ్వనిది , రోజు ఇచ్చి చస్తారా అని ,డ్రామా అంగీకారాలు తెలిపారు . ఇప్పుడెందుకో అధిష్టాన దేవతకి ఆ సమస్యను తీర్చాలనుకుందట . తీర్చాలనుకున్నపుడు అందులోని కష్ట నష్టాలు , ఇరువైపులా ప్రజలు బావోద్వేగాలు  అన్ని పరిగణనలోకి తీసుకుని, ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు వాళ్ళ ఎవరికీ నష్టం జరగదని అభిప్రాయానికి వస్తే ,అప్పుడు ఏర్పాటు నిర్ణయం ప్రకటించాలి .ఒక సారి ప్రకటించాక ఇక సమస్యలు తెలుసుకునేదంటో  ఏమి ఉండదు. అదీ పద్దతి .
  అంతే కాని ,తెలంగాణా విభజన నిర్ణయం ప్రకటించి ,మల్లీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుఖోండని "ఆంటోనీ " గారి కమిటీ వెయ్యడమేమిటీ ? తిక్కల నిర్ణయం కాకపోతే ! ఇప్పటికైన పార్టీలు ముసుగు తొలిగించి తమ మనసులోని అసలు మాట చెపుతారని గ్యారంటీ ఉందా ? లేదు . మరి ఎందుకు పనికి మాలిన కమిటీలు . ఏదైనా ఒక్క విషయం స్పష్టం . రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ నిర్ణయం . దానిలో ప్రజా అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలనుకుంటే , పార్తీలను కాదు డైరెక్ట్గా ప్రజలను అడగండి ,రాష్ట్ర విభజన అంగీకారమా ,కాదా ? అని . మెజార్టీ ప్రజల అభ్ప్రాయానికి కట్టుబడండి . దీనికి రెఫరెండం అవసరమైన వెనుకాడవద్దు . కాదూ , రాజ్యాంగ ప్రకారం చేదామనుకుంటే ,అసెంబ్లి తీర్మానం ,పార్లమెంటులో బిల్లు పెట్టి మీ కోరిక నెరవేర్చుకొండి అప్పుడు ఎవరు అవునన్నా ,కాదన్నా చెయ్యగలిగేది ఏమి ఉండదు . అంతే కాని తిక్కల పంచాయితి పెట్టి ప్రజలను ఎందుకు బలి చేస్తారు .  

1 comment:

  1. చాలా చక్కగా వ్రాసారు. కానీ రాజకీయ పార్టీలు "ముసుగులు వేసుకోటానికి" కారణం, ఇది మూడో రకం ఉద్యమం అవ్వటమే. రాజుగారి భార్య పతివ్రత అని అనవలసిన పరిస్తితిని ఉద్యమం చేసే నాయకులు తెప్పించారు. అసలుభావాలు లోన ఏవున్నా బయటకి చెప్పలేకపోటమే ఈ మూడవ ఉద్యమం గొప్పతనం.

    ఇంతకీ మూడవ తరహా ఉదయం అంటే చెప్పలేదు కదూ,
    ఒకటో రకం ఉద్యమం టెర్రరిజం-ఇది భయపెట్టి సాధిస్తుంది.
    రెండో రకం గాంధేయ వాదం-ఇది అవతల వారికి మానవత గుర్తు తెచ్చి సాధిస్తుంది.
    మూడో రకం ఉద్యమం-ఇది లేటెస్టు. అవతల వారిని అవమానించటం ద్వారా. వారి మాటలని వినకుండా, చర్చించే వాతావరణమే లేకుండా ఇబ్బంది కర పరిస్తితి లోనికి నెట్టటం ద్వారా , బూతులని విరివిగా వాడి వీళ్ళతో మనకెందుకులే అయినా ఈ గోల మనకెలా అనుకునేట్లు చేసి ఫలితాన్ని సాధిస్తుంది.

    పైన రెండురకాల ఉద్యమాలలో చర్చలు ఉంటాయి కానీ, ఈ ముడవరకం ఉద్యమంలో చర్చలు ఉండవు. అందుకనే ఈ రాజకీయ నాయకులకి ముసుగులు, బ్లాగుల్లో అజ్ఞాత వ్యాఖ్యలు.

    ReplyDelete