తెలంగాణా ప్రజల మీద ఆంద్రావారికి అనుమానాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ , కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి మీద బోల్డన్నీ అనుమానాలున్నాయి అరే ! తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించి రెందు రోజులు కాక ముందే చెల్లెలు రాములమ్మను అర్ద రాత్రేళా సస్పెండ్ చేసిండా ! అంటే ఏమిటి ? ఆడబిడ్డను అడగకుండా బయటకు పంపిండు కదా! ఆడబిడ్డనే అర్దరాత్రి బయటకు పంపినోడు , అగర్బ శత్రువులు లా చూసే వారిని ,అదేనండి ఆంద్రోలను బయటకు పంపకుండా ఉంటాడా ? అదిగో ఆ డౌట్ తోటే ఆంద్రోళ్లంతా ఆందోళన చేస్తున్రు . లేకుంటే విదేశాలు పోయి బ్రతికేటొరికి తెలంగాణా లో బ్రతకడానికి భయమెందుకు ?
పాపం రాములక్క ! ఏమన్నది ! జై తెలంగాణాయే అన్నది కాని , జై సమైఖ్యాంద్ర అనలేదు కదా. వేళా కలవకుంట్ల చంద్ర శేఖర్ గారి పొటోలు తీసి వేసి ఇందిరమ్మ పొటోలు తన ఆఫిసుకాడ పెట్టిందనుకో . అందుకు రీజన్ అడిగి నోటీస్ ఇవ్వాలే కానీ , చెప్పా చెయ్యకుండా అర్ద రాత్రి గెంటుతావా పార్టీ లోంచి . ఆడబిడ్డకు ఎంత అవమానం ,
ఎంత అవమానo . అయ్యో ,రాములక్కా , నీ కెంత కష్టం వచ్చిందే !. తెలంగాణా కోసం అన్న అడుగు జాడల్లో నడచిన దానికి నీకు దొరికిన దొరికిన బహుమానం అవమానమేనా అక్కా !
అసలు నాకు ఉన్న చిన్న అనుమానం ఏమిటంటే , అంత అవమానంగా , అక్కను బయటకు పంపితే , ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకని ?తెలంగాణా కోసం అక్క చేసిన త్యాగం అదే నండి, సినిమా బందూక్ వదిలేసి వచ్చి , బయట బందులలో పాల్గొని రియల్ గా జైలుకు వెళ్ళింది కదా ! ఆ విశ్వాసం అన్నకు లేకపోయినా , తమ్ముళ్ళకు ఉండొద్దా ? పాపం మనసాగబట్టక చివరకు కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిఅన్న కూతురు ఒచ్చి ఓదార్చిందట . అందుకే చెప్పేది ,అన్న అయినా ,తమ్ముడు అయినా వాళ్ళంతా మగాల్లే కాబట్టి వారికి ఆడవారి కష్టాలు తెలియవు మరి ! ఇకనైనా రాములక్కా , మగవాళ్ళ ను నమ్ముకోకుండా ఆడవాళ్ళని నమ్ముకుంటే మంచిది .
No comments:
Post a Comment