Friday, August 9, 2013

ఇంటి కుక్క , ఇంటి కుక్క ... అన్న చందానా ....

నేను ఇందాక ఒక బ్లాగులో రాయలసీమ యాసలో "బేట్రాయి సామి దేవుడా " అన్న మకుటంతో ఉన్న జానపద పాట చూసాను . చాలా బాగుంది .దశవతార వర్ణన వారి మాండలికంలో చక్కగా కూర్చారు . నేను కవిని కాను . ఆ సంగతి నాకు తెలుసు . కాని కదిరి నరసింహుడి ఉద్దేశించి పాడిన ఆ జానపదం చూసాక నాక్కూడా ఎదో ఒకటి ఆ స్వామీ ని అడగాలనిపించి ఇలా అడిగాను (రాసాను ).బాగున్నా ,బాగోకున్నా లైట్ తీసుకోండి  నేను ఇంతకు ముందు "కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"? అని  ఒక టపా పెట్టాను . ఇంట్రస్ట్ ఉంటే లింక్  చూడండి
 http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_10.html


బేగి రా సామి దేవుడా -మమ్ము కాపాడ 
బేగి రా సామి దేవుడా
కల్కీ అవతారుడా !కదరి నరసింహుడా 
జల్దీగా వస్తువని నమ్మి నేనుంటిరా                         I బే I 

సరాజ్యం వచ్చెనని -అంతా మనదేనని 
అయిద్రబాద్ కొస్తిమి 
అరవై యేండ్లు గడచినాక ,నీది గాదు 
జాగాoటే నేనేడ  బోదురో !                              I బే I 


వెనుక ముందు కానక  _ఒక్క చోట కూడ బెట్టి 
నడమంత్రపు నగరి చేస్తే ,
నట్ట నడుమ లొల్లి ఎంది  ,బిస్తర్తో  
బిచాణా లేప మంటురేందిరో                                       I బే I 


తన్నులు తన్నిన నవాబుని      తాత అనబట్టే   ,
తమ్ముడైన నన్ను, కాదు పొమ్మన బట్టే ,
తెలుగోడు ,తెలుగోడు ఒకటి కాదన బట్టే  
తెలుగు తెల్యనోడిని బాయి  బాయి  అనబట్టే                   I బే I 

ఇంగ్లిషోడి  కాలంలో కల్సి బ్రతకలెకపొయే ,
తెలుగోడి పాలనలో తంపులతో విడిపోతే ,
ఎప్పటికైనా మన బతుకింతేనా ,ఇంటి కుక్క ,
ఇంటి కుక్క ... అన్న చందానా ....                         I బే I     



















No comments:

Post a Comment