మొన్నటి దాక తెలంగాణా వాళ్ళు చేసిన ఉద్యమానికి మెచ్చి అధిష్టాన దేవత,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సందర్బంగా వారు చెప్పిన మాట ఏమిటంటే ,పదేళ్ళ పాటు హైద్రాబాద్ ఉమ్మడి రాజ్యదానిగా ఉంటుందని. దీని కోసం ఏర్పాటు ప్రక్రియ ఆరు నెల్లలో ముగిస్తాం అని. అంతే ! సీ మాంద్రుల పక్కల్లో బాంబు పేలినట్లై, ఒక్క పెట్టున సీమాంద్రులు సమైఖ్యాంద్ర కొరకు ఉద్యమించేసరికి, "మీరేదైనా సమస్యలు ఉంటే ఆంటోని గారికి చెప్పండి, మీ సమస్యను ఖచ్చితంగా తీరుస్తాం, కాకపోతే ఒక కండిషన్ ఏమిటంటే, మీరేదైనా అడగండి,సమైక్యాంద్ర తప్పా"’ అని నొక్కి చెప్పే సరికి సీమాంద్రులకు సిట్యూషన్ అర్దమై "అయితే మాకు హైద్రబాద్ ని U.T. గా చూడాలనుంది" అని వరం కోరుకున్నారు. దీనికి కేంద్రం వారు హాపిగ ఒ.యస్ అనడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా వాదులకు ఆ దిశగ సంకేతాలు ఇచ్చేస్తున్నారు కూడా!
ఒకరు, ఒకటి ఆశించినపుడు,వేరొకటి త్యాగం చేయక తప్పదు. అసలు ఇంత తొందరగా తెలంగాణ ప్రకటన చెయ్యడం వెనుక, తెలంగాణా ప్రజల కోరిక తీర్చడం కంటే ,దేశం లోనే ఎంతో అభిరుద్ది చెందినది గా బావిస్తున్న హైద్రబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గ చెయ్యాలన్న ఆత్రుతే ఎక్కువుగా ఉన్నట్లుంది. దీనితో ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడినట్లవుతుంది.
(1). అరవైయేండ్ల సమస్య అని చెప్పబడుతున్న "తెలంగాణా" ఇచ్చినట్లవుతుంది.
(2). సీమాంద్రుల ప్రత్యమ్నాయ కోరిక ప్రకారం వారి భయాలకు పుల్స్టాప్ పెడుతూ, కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుంది. భవిష్యత్ లో దేశ రెండవ రాజదానిగా చెయ్యడానికి ఎటువంటి అడ్డంకులు అంటే ప్రత్యేకంగా ఏ ప్రాంత ప్రజలకు పాకేజీలు ఇవ్వ వలసిన పని ఉండదు.
(౩). రెండు రాష్ట్రాలలో అధికార కాంగ్రెస్ తిరిగి అదికారం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
కాకపోతే ఈ ఏర్పాటు వల్ల తీవ్రంగా నష్ట పోయేది తెలంగాణా ప్రాంతమే. ఎందుకంటే హైద్రాబాద్ లేని తెలంగాణ తల లేని మొండేం లాంటిది. కాని సీమాంద్రుల కోరికకి వ్యతిరేకంగా తెలంగాణా పొందినపుడు, ఆ మాత్రం త్యాగం చెయ్యడం తప్పనిసరి అని తెలంగాణా వాదులను వొప్పించడం కేంద్రానికి పెద్ద సమస్య కాక పోవచ్చు.ఇప్పటిదాక జరిపిన ఉద్యమాలతోనే, విసిగి వేసారి ఉన్న తెలంగాణా యోదులు చివరకు గత్యంత్రం లేని పరిస్తితుల్లో హైద్రాబాద్ నిU.T. చెయ్యడానికి ఒప్పుకోవచ్చు. ఆ విదంగ రెంటికి చెడ్డ రేవడి మాదిరి తెలంగాణా ప్రజలు మరొక మారు రాజకీయ నాటకాలకు మోసపోబోతున్నారు అని అనిపిస్తుంది.
కాబట్టి ఈ నాటకాలకు ఫుల్స్టాఫ్ పెట్టాలంటే, ఇరుప్రాంత మేదావులు బేషజాలకు పోకుండా ,అసత్య ప్రచారాలను కట్టిపెట్టి ,వాస్తవ పరిస్తితులను సమీక్షీంచి, మొత్తమీద తెలుగు ప్రాంత అధికారాలను, వనరులను తెలుగు ప్రజలకు మాత్రమే చెందేలా, ఒక వివేక మైన నిర్ణయానికి రావల్సిందిగా రాబోయే తరాల వారి తరపున అమాయకంగా అర్దిస్తున్నాం.