Showing posts with label "పుట్టిన రోజు కానుక. Show all posts
Showing posts with label "పుట్టిన రోజు కానుక. Show all posts

Friday, October 4, 2013

నిన్నటి దాకా ’అమ్మా”అమ్మా’అన్న వారే ఈ రోజు ’అమ్మ నా బూతులు’ తిడుతున్నారు!



                                                                  

  రాజకీయాలు మనిషిని అందలం ఎక్కించనూగలవూ, అదః పాతాళానికి తొక్కి పారెయ్యనూ గలవూ! రాష్ట్రం లోని సీమాంద్రా కాంగ్రెస్ వారి పరిస్తితి ఎంత దయనీయంగా తయారయ్యింది అంటే నిన్నటి దాక ఎవరి పేరు చెప్పి తమ పార్టీ ఉన్నతి గురించి గొప్పలు చెప్పారో ఇప్పుడు వారినే బూతులు తిట్టకపోతే తమ నియోజక వర్గాల్లో తిరగలేని పరిస్తితి.

  సోనియా గాందీ గారికి తెలుగు వారంటే ప్రత్యేకమైన అభిమానం ఏమి లేకపోవచ్చు. ఒక విదంగా చూస్తే, ఆమెకు ఎందుకో పి.వి. నరసింహారావు గారంటే కోపం ఉందనేది ఆయన చనిపోయినప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు తేట తెల్లం చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఎంత గొప్పవారైన సరే ఆమె ముందు "జీ మాతా" అనాల్సిందే అనుకుంటా!. ఇక్కడి ప్రజలుకు నెహ్రూ గారి కుటుంబం పట్ల ఉండే ఆరాదనా బావాన్ని, క్రమంగా రాజశేఖర్ రెడ్డి గారు తన వైపు తిప్పుకుని తిరుగు లేని నాయకుడిగా ఎదగడం, ఎన్నికల  సమయాలలో కేంద్రాన్ని లెఖ్ఖ చెయ్యకుండా తన స్వంత ఆలోచనా విదానంతో ఎక్కువ యం.పి. సీట్లను గెలవడం ఇవ్వన్నీ పైకి ఏమనలేక పోయినా కేంద్రం లోని ఆమె మద్దతు దారులకు కంటగింపుగా ఉండేది . అదీ గాక దక్షిణ బారతం లో ఆంద్రప్రదేశ్ అధిక యం.పి. సీట్లు కలిగిన రాష్ట్రం కావడం వలన ఈ రాష్ట్ర నాయకులు కేంద్రం లో ప్రభావం చూపగలిగిన స్తితిలో ఉండడం కుచ్చిత రాజకీయాలకు మారుపేరైన చిదంబరం లాటి తమిళ తంబి లకు కంటగింపుగా ఉండేదీ కాబోలు. అందుకే బలమైన తెలుగు రాష్ట్రం కంటే బలహినమైన రెండు రాష్ట్రాలుగా ఉండడమే కేంద్ర పెత్తనానికి మంచిదనే బావన కలిగి ఉండవచ్చు.

 అలాంటి కేంద్ర పెద్దలకు కె.సి.ఆర్ తెలంగాణా ఉద్యమం కొత్త ఆలోచనలు రేపి ఉందవచ్చు. కె.సి.ఆర్ ని సోనియా గాంది దగ్గరకు పంపి ఆమె జన్మ దినం నాడు తెలంగాణా ప్రకటన చేసేటట్లు ప్లాన్ చేసి ఉంటాడు చిదంబరం. ఒకసారి మాట ఇస్తే దానిని కాదనే  గుణం సోనియా లాంటి వారికిఉండదు. అదీ జన్మదినం కానుకగ ఇస్తే దానికి తిరుగే ఉందదు. అది తెలిసిన తమిళ తంబి కె.సి.ఆర్ ని ఉపయోగించి సపలుడయ్యాడు. కానీ ఈ విషయం లో సీమాంద్రా కాంగ్రెస్ వారికి అనుమనం రాకుండా "నిరాహార దీక్ష" డ్రామా ఆడించి కె.సి.ఆర్. ని ఖమ్మలో అరెస్ట్ చేయించి ఎదో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లు హల్ చల్ చేసి డిసెంబర్ తొమ్మిదిన "తెలంగాణా ప్రకటణ" చేయించాడు తమిళ తంబి. ఆ తర్వాత ఎగసిన నిరసనలతో తాత్కాలికంగా వెనక్కు తగ్గినప్పటికి, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి "పుట్టిన రోజు కానుక" ను గుర్తు చేసి ఆగ మేఘాల మీద నిబందనలు అన్నీ తుంగలో తొక్కి, తెలంగాణా ప్రక్రియలు పూర్తీ చేస్తున్నారు. అమ్మ నిర్ణయమే తప్పా అన్య విషయం తెలియని,అన్నిటికి తలాడించే ప్రదాణ మంత్రి గారికి సీమాంద్రా నాయకుల వేడుకోళ్ళు చెవికెక్కవు  గాక ఎక్కవు . అందుకే జనవరి లోపు తెలంగాణ ఏర్పడ బోతుంది.

  దీని వెనుక ఉన్న అసలు మతలబ్ తెలియక తెలంగాణా ఏర్పాటు ఆపుతాం అని బీరాలు పలికిన సీమాంద్రా వీరులు ఇప్పుడు బిక్క ముఖాలు వేసుకుని,ప్రజలు సోనియా గాందీ గారిని తిడుతూంటే "అవునూ నిజమే" అని తాము తిట్లకు లంఖించుకున్నారు. ఇక జగన్ ఏమన్న సింహం లా గాండ్రిస్తూ తమకేమన్న దారి చూపుతాడెంఒ అనుకుంటే పదహారు నెలల జెయిల్ జీవితంతో "కరుణా మయుడు" లా మారి పోయి ఏమిటి ఈ దుస్తితి అని బేలగా మాట్లాడుతున్న ఆయనను చూసి సీమాంద్రా కాంగ్రెస్ వారికి ఆశలు అడి యాశలు అయ్యాయి. ఈ సమయం లో ఒక .యన్.టి.ఆర్ లా గర్జించి ప్రజలను ఒక్క తాటి మీద తేగల నాయకుడు కనపడక, ఏమి చెయ్యాలో తెలియక దిక్కుమాలిన బిడ్డలు  లాగా బేల చూపులు చూస్తున్నారు. ఇక పోతే బొత్సా లాంటి వారేమో ఇక ఎలాగు రాష్త్రం విడి పోతుంది కాబట్టి, ఇక సీమాంద్రలో కాంగ్రెస్ అధికారం లోకి రావడం అసంభవం కాబట్తి, మిగిలిన ఈ నాలుగు నెలలు అయినా "ముఖ్యమంత్రి" గా వెలగబెట్టె మహదవకాశం కోసం "డబల్ గేమ్" లు ఆడాలని చూస్తుంటే , ఈ రోజు ప్రజలు ఆయన ఇంటి ముట్టడికి చేస్తున్న హంగామా చూసి నోరు మూసుకుని ముఖ్యమంత్రి గారి మీటింగ్ కు హాజరై అందరి నిర్ణయమే తన నిర్ణయమని కామ్ గా బిత్తర చూపులు చూస్తూ కూర్చున్నాడు.ఇక బాబు గారైతే తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎవరిని ఏమనలేక రాష్త్ర రాజకీయాలు కంటే కేంద్ర రాజకీయాలే బెస్ట్ అని. రాష్ట్ర విబజన సాకుతో  డిల్లీ లో తన ఇమేజ్ పెంచుకునె కార్యక్రమాలు  చేపట్టి,  యన్.డి.యే కన్వినర్ పోస్ట్ కొట్టెదామని ప్లాన్ చేస్తున్నారు.  అదీ పరిస్తితి. ఒక స్త్రీ స్వార్ద నిర్ణయం తెలుగు గడ్డని ముక్కలు చెయ్యడమే కాక, జాతిని నిలువునా చీల్చింది. ఇది మంచికా, చెడుకా అనేది కాలం చెప్పవలసిన జవాబు.