Monday, January 6, 2014

P.V నరసింహా రావుగారి మరణం ని గుర్తుకు తెచ్చిన "ఉదయి కిరణ్ " ఉదంతం!.

                                                          
                                                      

ఈ  దేశంలో ఆ రంగం ఈరంగం అని కాక అన్ని రంగాలు కొంతమంది గుత్తాదిపత్యం లోనే ఉన్నయి. ఆ గుత్తాదిపతుల ను కాదంటే ఎలాంటి పరిస్తితి దాపురస్తుందో మొన్న బలవన్మరణానికి గురయిన ఉదయి కిరణ్ ఉదంతమే చక్కని ఉదాహరణ. అయినా మన పిచ్చి కానీ పవర్ ఉన్న ఒక విదేశి కోడలును దిక్కరించినందుకే సాక్షాత్తు ఈ  దేశ    మాజీ ప్రదాని గారి శవంని  కుక్కలు కు అప్ప చెప్పిన   దౌర్బాగ్యపు రాజకీయ జాతి ఉన్న దేశం లో ఆప్ట్రాల్ ఒక చలన చిత్ర నటుడు ఎంత?

       ఉదయి కిరణ్ చేసింది ఒకటే తప్పు. చలన చిత్ర రంగం ని ఏలుతున్నా రారాజుల కుటుంబం తో సంబందం కలుపుకుందామను కోవడం. అదెందుకు బెడిసి కొట్టిందో తెలియదు. కాని అది ఉదయి కిరణ్ కెరీర్ నే దారుణంగా దెబ్బ తీసింది. సినిమా మెగా దేవుడుకు పనికి రాని  వారెవరైనా సరే వారికి అన్ని రకాల అవకాశాలు కోల్పోవాల్సిందే. దీని గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టాన దేవుళ్ళు అంతరంగం ఎరిగి మసలుకునే వారు సినిమా రంగం నిండా ఉన్నారు. ఆ విదంగా ఉదయి కిరణ్ సినిమా రంగం నుండి వెలివేయబడ్డాడు . అదే అతని జీవితం ని నిరాశమయంగా మార్చి వేసింది. క్రమంగా దెప్రెషన్ లోకి వెళ్ళిన ఆత ను చివరకు బలవన్మరణానికి గురిఅయ్యాడు. ఇది చాలా విషాదకరం.

   సినిమా రంగం అంత చంచల మైనది మరొకటి లేదు అనటం లో అతి శయోక్తి లేదు. ఆ రంగం లో  మూడు హిట్ లు కొడితే సూపర్ స్టార్ కి ఎదిగినోడు , రెండు వరుస ప్లాప్ లు ఎదురైతే అదో పాతాళానికి లెవెల్ కి నెట్టి వేయబడతాడు. . అందుకే దానంత అబద్రతా రంగం మరొకటి లేదు. ఉదయి కిరణ్ స్వబావం ఆ రంగానికి సరిపోయేది కాదేమో అనిపిస్తుంది. "హిట్టయితే నా మాయా , పట్ అయితే దేవుడి మాయా" అనుకునే వాడే ఈ  చంచలన రంగం లో జీవించగలడు. ముఖ్యంగా గాడ్ పాదర్ ల అండ లేనిదే నిల దొక్కుకోవడం కష్టం. ఎందుకంటే ఆ గాడ్ పాదర్ల మర్కట వారసత్వం పది కాలాల పాటు చలన చిత్ర రంగంలో వర్దిల్లాలి అంటే అంతకంటే ముక్కు , ముఖం బాగున్న వాడు , నటనా కౌశల్యం ఉన్నవారు హీరోలుగా ప్రమోట్ కావడానికి వీలు లేదు. ఇవేవి తెలియని ఉదయికిరణ్ అమాయకంగా అందరిని నమ్మి ఆహుతైపోయాడు.

      పాపం ,అతని దౌర్బాగ్యం ఏమిటంటే , ఆతను డిప్రెషన్ కి గురి అయిన వేళ తోడుగా నేనున్నాను అని ఓదార్పు నివ్వగలిగిన కుటుంభ సబ్యులు కూడా లేకపోవడం. ఈ  విషయం అతని అంత్య క్రియల విషయం లో అతని తండ్రి , బార్యా ప్రదర్శిస్తున్న ప్రవర్తన తెలియ చేస్తుంది. మీడియాలో వస్తున్న విమర్శలకు తట్టుకోలేక పిలిం చాంబర్ వారు పట్టించుకుని అతని అంత్య క్రియలకు పూనుకోవడం కొంత ఊరట. ఏది ఏమైనా ఉదయకి రణ్ లాంటి సున్నిత మనస్కులకు చలన చిత్ర రంగం ఒక పెద్ద ఊభి  లాంటిది అని ఈ  ఉదంతం తెలియ చేస్తుంది. అంతే కాదు కుటుంబం లో నయినా సరే సబ్యుల మద్య ప్రేమాభిమానాలు లేక పోతే ఏకాకి జీవితమే తప్పా ,మిగిలేది ఏమి ఉండదు అని అనిపిస్తుంది.

No comments:

Post a Comment