హిందూ పురాణాల ప్రకారం కాలాన్ని 14 మన్వంతరాలు గా విభజించారు. అందులో ప్రస్తుతం 7 వ మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరం నడుస్తుందని చెపుతారు. కొంతమంది పండితుల లెక్కల ప్రకారం వైవస్వత మన్వంతరం పోయి 8వది అయిన సూర్య సావర్ణిక మన్వంతరం రావడానికి ఇంకా కొన్నీ వేల యేండ్లు పడుతుందని చెపుతూ ,సంకల్పంలో వైవస్వత మన్వంతరాన్నే ప్రస్తావిస్తున్నారు. కాని నాకైతే ఒక గట్టి నమకం ఏమిటంటే వైవస్వత మన్వంతరం వెళ్లి పోయి ఆల్రడీ సూర్య సావర్ణిక మన్వంతరం వచ్చేసిందని. ఇలా అనిపించడానికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచం లోని కొన్ని దేశాలతో పాటు భారత దేశం లోని ప్రజలు తమ నిత్య అవసరాలకు అవసరమైన విద్యుత్ శక్తిని ఆ ప్రత్యక్ష బగవానుడు అయిన సూర్య భగవానుడి నుండి పోందుతుండటడమే. అంతే కాకఇప్పిడిప్పుడే ఇండియాలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు , గుజరాత్ లో నరెంద్రమోడి గారు సోలార్ పవర్ ద్వారా సాదిస్తున్న అనేక విజయాలు చూసి , ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తాము సౌర శక్తి ఉత్పాదన దిశగా అడుగులు వెయ్యడం ప్రారంబించాయి.
గుజరాత్ లో నరేంద్ర మోడి గారి విజన్ లో ప్రత్యేకం గా చెప్పుకో తగ్గది "కెనాల్ టాప్ సోలార్ ప్లాంట్" . ఈ తరహ ఆలోచన తో కూడిన సౌర విద్యుత్ శక్తి ప్లాంట్ నిర్మించడం ప్రపంచం లో ఇదే మొదటిది. ఇది ఎలా నిర్మిస్తున్నారు అంటే , సాదారణంగా పంట పోలాలకు నీళ్ళను అందించే కాలువల మీద సోలార్ పలకలను బిగిస్తారు. అలా ఎరపరచిన సోలార్ పలకలు సూర్య కిరణాలను గ్రహించి వాటిని విద్యుత్ శక్తి గా మార్చి దగ్గరలో ఉన్న ఎలక్టికల్ గ్రిడ్ లకు సరపరా చేస్తే అక్కడ నుంచి ప్రజల అవసరాలకు సరపరా చేయబడుతుంది. దీని వలన రెండు లాబాలు ఉన్నాయి. (1). సౌర విద్యుత్ శక్తి ఉత్పాదనకు ముఖ్య ఆటంకం భూమి కొరత. దీని కోసం పంట పొలాలను లేక ఖరీదైన భూములను సేకరించడం ప్రభుత్వానికి ఇబ్బంది . దానిని కెనాల్ టాప్ విదానం అదిగమిస్తుంది. కాలువల పైన కాబట్టి అదనంగా భూమి సేకరించకుండనే కాళీగా ఉన్న కాలువల పై బాగాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి చాల ఖర్చు తగ్గుతుంది. (2). కాలువల పైన సౌర విద్యుత్ పలకలు ఉండబట్టి కాలువలలో ప్రవహించే నీరు ఆవిరి కావడమనేది ఉండదు. కావున బోల్డంతా నీరు అదా అవుతుంది. ఈ కారణం చేతనే గుజరాత్ ప్రభుత్వం యొక్క దూర దృష్టి ప్రపంచ దేశాల మన్నన పొందుతుంది .
అంతే కాకుండా కేంద్ర సర్కార్ వారు సైతం రూప్ టాప్ అంటే ఇండ్ల మీద సైతం సౌర పలకలు అమర్చుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి ఇంటి అవసరాలకే కాక, మిగులు విద్యుత్ ని విద్యుత్ సంస్తలు కొనుగోలు చేసే వీలుగా రెగులేషన్ లు పాస్ చెయ్యడం జరిగింది. దీని వలన లబ్ది దారులకు పరికరాల కొనుగోలులో ప్రత్యక్షంగా 50% రాయితీ లభించడమే కాక , అనుమతులు పొందడం సరళ తరం అయింది. వీటన్నింటికి కారణం ఈ రంగంలో ముందడడుగు వేసి ఇండియాలో విజయం సాదించిన గుజరాత్ ప్రభుత్వం దాని రద సారది నరేంద్ర మోడి గారి స్పూర్తి అని చెప్పక తప్పదు. మన ఆంద్ర ప్రదేశ్ కూడా ఈ దిశగా క్రుషి చేస్తే అనూహ్య అభివృద్దిని సాదించడం ఖాయం. ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం నడుస్తుంది " సూర్య శక్తి మన్వంతరం " అంటే అదే సూర్య సావర్ణిక మన్వ తరం, అవునా కాదా!
గుజరాత్ లోని కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టు విశేషాల కోసం ఈ క్రింది విడియో ను చూడండి
No comments:
Post a Comment