Showing posts with label దెయ్యం కారు. Show all posts
Showing posts with label దెయ్యం కారు. Show all posts

Sunday, September 25, 2016

హఠాతుగా ప్రత్యక్షమైన దెయ్యం కారు! ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగల విజ్ఞానులు ఎవరు?

                   
                                                                           
                               

                                 ఆస్ట్రేలియాలో ని ఒక రోడ్డుమీద గొప్ప విచిత్రం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ తన ఎదురుగా వెళుతున్న కారు గమనాన్ని వీడియో షూట్ చేస్తున్నాడు. ఒక మలుపు దగ్గర హఠాతుగా తన కారు ముందు ఉన్న కారు ఆగింది. కారణం ఏమిటంటే సదరు  కారు ముందు వెళుతున్న వ్యాన్ ను బూడిద రంగు ఆస్ట్రా కారు ఒకటి హఠాతుగా ఢీకొనడమే కాక 180 డిగ్రీ లలో తిరిగిపోయింది. ఆ తర్వాత ముందున్న కారు చిన్నగా టర్నింగ్  తీసుకుని ఆ ఢీకొట్టిన కారు పక్కనుంచి వెళ్లడం తో ఈ  వీడియో ఉన్న కారు కూడా కదలి వెళ్లి పోయింది. ఇది మాములు విషయమే కదా? ఇందులో విశేషం ఏమిటంటారా? అయితే చూడండి .

     మీరనుకున్నట్లే అది మామూలు విషయమే అని వీడియో తీస్తున్న మిత్రుడు కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్లి వీడియో పరిశీలిస్తున్నప్పుడు ఆ విచిత్రం తెలిసింది.  సదరు మలుపు దగ్గర  ముందు నుంచి టర్న్ అవుతున్న కారు , వ్యాన్,  మరియు  ఎదురుగా వస్తున్నా అన్ని కారులు కనిపిస్తున్నాయి. కానీ వ్యాన్ ను డి కొట్టిన కారు మాత్రం అందులో కనిపించలేదు. అది హఠాతుగా ప్రత్యక్షమై వ్యాన్ ను డి కొట్టి ఆగాక మాత్రమే కనిపించింది. అందులోనుంచి ఎవరో దిగారు కూడా . మరి అప్పటి వరకు రోడ్డు మీద కానీ , ఆ పరిసరాలలో కానీ లేని కారు హఠాతుగా ఎలా ప్రత్యక్షమైంది ? అది ట్రాఫిక్ లో వ్యాన్ ను ఢీకొట్టబట్టి ఆగింది కానీ నిర్మానుష ప్రాంతం లో అయితే దానిని గుర్తించే అవకాశం  లేదు.

                    అటువంటి కారు ను తెలుగు సినిమాలు చూసే  మనం  "దెయ్యం కారు " అంటామేమో కానీ , సదరు వీడియో తీసిన వ్యక్తికీ ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు అనుకుంటా , అందులో  చూపించే అడ్వాంస్డ్ సైన్స్ లాగా  "టెలిఫోర్టేషన్  " విధానం ద్వారా ప్రత్యక్షమైన కారు అంటున్నాడు . అంటే మనం దృశ్య , శ్రవణాలను ఎలాగైతే ఒక చోట నుండి మరొక చోటుకి ప్రసారం చేస్తున్నామో  , అలాగే వస్తువులను కూడా   ఒక చోటు నుండి మరొక చోటుకి క్షణాల్లో లేక నిమిషాల్లో  పంపే ప్రక్రియ అన్న మాట . ఇదేలాగో వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకొండి. లేదూ , నేనే చెప్పమంటే నాకు వీలున్నప్పుడు వివరంగా చదివి ఇదే బ్లాగులో చెపుతాను . అందాక ఈ విచిత్రాన్ని క్రింది వీడియోలో చూచి అశ్చర్య పడుడి !..