అయిందేదో అయిపొయింది . మంచో , చెడో ,తను ఎంత పోరాడినా తను అనుకున్నది కానప్పుడు ఏది జరిగినా ఆ దైవ నిర్ణయం అనుకుని ముందుకు సాగడమే జ్ఞానుల లక్షణం . తెలంగాణా కోసం కోట్లాది ప్రజలు కోరుకున్నారు అనేది వాస్తవo . శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ రానంతవరకూ తెలంగాణా సిమాంద్ర ప్రాంతం కంటే చాలా వెనుకబడి ఉందనే తెలంగాణాలోని అత్యదిక శాతం ప్రజలు అనుకున్నారు . అందుకే తెలoగాణా వేరు పడితే తప్పా అభివృద్ధి సాదిoచలెము అన్న తెలంగాణా నాయకుల మాటను సమర్దిoచారు. దానికి తోడూ రాష్ట్రంలోని ఎ రాజకీయ పార్టి (C.P.M తప్పా ) తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదు . కాబట్టే రాష్ట్ర విభజన సాధ్య పడింది . ఇప్పటికి సిమాoద్రా లోని సామాన్య ప్రజలలో విభజన అంటే ప్రజల మద్య ఎడబాటే అనే బావనతొ ఉండటం వలన శోక తప్తులై ఉన్నారు . కొంత మంది మాత్రమె హైదరాబాద్ ను U.T చేస్తే చాలు అనుకుంటున్నారు తప్పా , సామాన్య జనం మనస్పూర్తిగా విభజనను ఒప్పుకోవడం లేదు . అలాగే తెలంగాణా జిల్లాలోని అత్యదిక శాతం ప్రజలు విభజన కావాలనే కోరుకుంటున్నారు . అయితే గడచినా 60 సంవత్సరాలుగా సిమాoద్రా నుండి లక్షలాదిగా ప్రజలు తెలంగాణా కు వచ్చి ఇదే తమ జన్మ భూమి అని స్తిర పడిపోయారు . విరెవ్వరికి మనస్పూర్తిగా రాష్ట్ర విభజన ఇష్టం లేదు . కాకపొతే తామున్న దగ్గర సమస్యలు కొని తెచ్చు కోవడం ఇష్టం లేక అందరితో పాటు తాము తెలంగాణా కు జై అంటున్నారు .
సరే ఏదేమైతేనేం ఆర్టికిల్ 3 అనేది ప్రజల్ని విదదియలెదు . ప్రాంతాలను అది కూడా రాజకీయంగా విడదీయ గలుగుతుంది . సమర్ధులు పాలకులు గా ఉన్నంత కాలం సమైక్యంగా ఉంటారు , పాలించే వారిలో చేవ చచ్చినప్పుడే విడిపోతుంటారు అనేది చారిత్రిక సత్యమ్. కాని ఇప్పుడు మాత్రం ప్రజలు కాకుండా ప్రాంతాలను రాజకీయ నాయకులు విడగొట్టుకున్నార్రు . వారు తమ సమర్ధతను చూపించి తమ ప్రాంతాలను స్వర్గ దామం చెయ్యాలని ఉవ్విలూరుతున్నారు . వారి కోరికను కాదనడం ప్రజలకు పాడి కాదు. ఈ రోజు ఏ ఆర్టికిల్ ద్వారా విడి పొయామో అదే ఆర్టికిల్ కి తిరిగి కలిపే శక్తి ఉన్నాడని నేతలుకు తెలియంది కాదు . అందుకే ఈతెలంగాణా సిమాంద్ర నేతలకు మద్య తెలుగు ప్రజలు ఒక పందెం పెడితే ఎలా ఉంటుంది ?
పందెం ఎందుకంటే , తెలంగాణా నెతలెమొ విడిపోతే బాగుపడతాం అంటుంటే , సిమాంద్ర నేతలేమో కలిసి ఉంటే నే బాగుంటాం అంటున్నారు . సామాన్యుడికి సమర్దుడైన నాయకుడి పాలనే కావాలంటున్నారు . మంచో , చెడో ఇంకా 10 ఏండ్లు రాజధాని , హై కోర్టు , విద్యా అవకాశాలు ఉమ్మడిగా ఉండాల్సిందే . కాబట్టి ఈ 10 యేండ్ల లో ఎ రాష్ట్రం ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందో చూడాలి . ఒక వేల తెలంగాణా ఎక్కువగా అభివృద్ధి చెందితే విడిపోయిన రాష్ట్రాలు యదావిదిగా ఉండాల్సిందే . లేదూ సిమాంద్ర ఎక్కువుగా అభివృద్ధి చెందితే మరల ఆర్టికిల్ 3 ని ప్రయోగించి రెండు రాష్ట్రాలను కలపాలి. ఇప్పుడు 10 ఏండ్లు విడిపోయినంత మాత్రానా నష్టం ఏమి ఉండదు . ఎందుకంటే అప్పటి దాక కేంద్రం వారు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి , 10 ఏండ్లు రాష్ట్ర విభజన వల్ల లాభమే తప్పా నష్టం ఉండదు .
మరి పైన చెప్పిన విదంగా పందానికి మన రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా ? ఒప్పుకుంటే 2014 నాటికి తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు పొందుతాయి అనడంలో నాకైతే సందేహం లెదు.