Sunday, September 18, 2016

పాంట్ లూడదీసి చూసి మతాన్ని నిర్ణయించి మానవ హననం చేసినోడు "సేక్యులరిస్టా" ? !


                                                           


                                    నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ గారు నిజాం పట్ల తనకున్న అంతులేని అభిమాన్నాన్ని చాటుకున్నారు. ఆ యన ప్రసంగం లో నిజాం యొక్క ఔదార్యాన్ని , ఆయనలోని పరిపాలనా దక్షతను , దానగునాన్ని పర పరి విధాలా కీర్తించాడు . కాని  నిజాం   చేసిన లేక చేయించిన మానహననాలు , మారణ హోమాలు గురించి మాట్లాడవద్దని హెచ్చరికలు చెసాడు . అలా చేస్తే  ఆంద్రప్రదేశ్ అంతా రక్తాలు పారుతాయి అని కూడా సెలవిచ్చారు. ఆయన చేసిన మారణహోమం ఏమో మానిపోయిన గాయాలు ఆట. ప్రజలను పీడించి వసూలు చేసిన సొమ్ముని  తమ పరివార విలాస వంత జీవనానికోసం వెచ్చిస్తే అది అభివ్రుద్ది అట.అందుకు నిజాం  గొప్ప రూలర్ అట. ఏది ఏమైనా అతని మాటలు వలన అతను ఎలాంటి బావాలు కలిగిన వాడో అర్దం చేసుకోవటానికి తెలుగు ప్రజలకు ఒక మంచి అవకాశం కలిగింది.

 తెలంగాణా ప్రాంతంలో ఎంతో మంది తెలుగు వారు ఉర్దూ నేర్చుకున్నారు. ఉర్దూ ని అభిమానించారు. అలాగే ముస్లిమ్లు కూడా తెలుగు నేర్చుకుని తమకు ప్రాంతీయ బాష పట్ల ఉన్న మక్కువను తెలియ చేసారు. అలాగే సీమాంద్రా లో కూడా ముస్లిమ్ లు  ఉర్దు కంటే తెలుగు బాషకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చి , ఆ బాషాభివ్రుద్దికి కె కాక నిజమయిన సెక్యులరిజం కోసం తపించారు . కానీ హైద్రాబాద్లో ఒక ప్రజా నాయకుడుగా ఉంటూ కనీసం చూసి "సామాజిక" అనే తెలుగు పదాన్ని కూడా ఉచ్చరించలేని వాడు "సెక్యులరిజం " గురించి గప్పాలు కొట్టడం, పైగా  తెలుగుదేశం పార్టీ వారి  సెక్యులరిజం గురించి ప్రశ్నించడం  విడ్డూరం. ఖచ్చితంగా అక్బరుద్దీన్ గారు నిజాం లకు వారసుడు తప్పా, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగిన ముస్లిమ్లకు మాత్రం కాదు.

   ఇక పోతే ఆయన నిజాం గురించి మాట్లాడుతూ ఆయన కూడా సెక్యులరిస్టే  అన్న దోరణీ కనపర్చాడు. నిజమే మరి నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు హిందువుల మీద జరిపిన  అత్యాచారాలు , హత్యాచారాలు గురించి తెలుసుకుంటే నిజాం ఎంత సెక్యులరిస్టో అర్దమవుతుంది. పాంట్లు ఊడడిసీ చూసి మతాన్ని నిర్ణయించి హత్యలు చేసిన  వారిని సెక్యులరిస్ట్లు అంటే,  ఇక చెప్పేదేమి లేదు . వారికి దూరంగా ఉండడం, దూరంగా ఉంచడం తప్పా!.

                                  (21/1/2014 Post Republished).   

4 comments:

  1. Can you deny the following facts:

    1. Hyderabad was well developed by 1956
    2. This was the main (or only) reason for Andhras to clamor for the merger

    ReplyDelete
  2. ee artical chaala bagunadi ,epati kapudu mee articals gurichi chepaalana naaku ela chepalo basha raavatam ledu meeru vrase articals mathram super sir

    ReplyDelete
  3. లౌకికత్వం ముసుగులొ ఇలాంటి ఎన్ని తప్పులనైన మన ప్రభుత్వాలు సమర్ధిస్తాయి

    ReplyDelete