Tuesday, February 25, 2014

మాట తప్పి , ఆంద్ర ప్రదేశ్ లోకే అడుగుపెడుతున్న "తెలంగాణా దొర " గారికి స్వాగతం! సుస్వాగతం !

                                                                   


మొన్నతెలంగాణా   దొర  విమానం ఎక్కి డిల్లికి పోయాడు . బేగం పేట విమానాశ్రయం దగ్గరకు పోయేసరికి ఆయనకి ఒక పోన్ కాల్ డిల్లి నుంచి వచ్చింది . ఈయన దగ్గర M.P  సీటు ప్రామిస్ తీసుకున్న డిల్లీ  నాయకుడు ఒకరు ,  దొర గారికి డిల్లి ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నాడు . ఆ ఇంఫార్మరే పోన్ చేసి మరి చెప్పాడట ! ఈ పార్లమెంట్ సెషన్ లోనే తెలంగాణా బిల్ పాస్ చెయ్యాలని మేడం హుకుం జారీ  చేసేసారట ! అందుకే ఇక తెలంగాణా O.K అని సమాచారం . ఆ మాట వినగానే ఒళ్ళంతా పులకరించింది తెలంగాణా దొరకి . అంతే ! అప్పటికప్పుడు అక్కడున్న మీడియా వారి ముందు వీర ప్రతిజ్ఞ చేసేసాడు . "నేను అడుగంటూ తిరిగి హైదరాబాద్ లో పెడితే "తెలంగాణా రాష్ట్రం " లోనే తప్పా ఆంద్ర ప్రదేశ్ లో కాదు " అని . ఆ మాట విని తెలంగాణా ప్రజలు సంతోషించారు .

   కాని అదే తెలంగాణా దొర ఈ  రోజే డిల్లి నుండి హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు . ఆయనకు తెలంగాణా చరిత్రలో ఎవరికీ పలకని ఘన స్వాగతం పలికేందుకు అయన గారి పార్టి సంసిద్ధులు అవుతున్నారు . మంచిదే ! కాని అయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి ? చేస్తున్న పని ఏమిటి? అయన తిరిగి అడుగు పెడ తానన్నది తెలంగాణా రాష్ట్రంలో . కాని అడుగు పెడుతున్నది ఆంద్ర ప్రదేశ్ లో . కనీసం టెక్నికల్ గా కూడా తెలంగాణా ఎర్పడలేదే ! దానికి రాష్ట్రపతి గారు అప్పాయింటెడ్ డేట్ ను ప్రకటించాల్సి ఉంది కదా ! ఆ  రోజు నుంచి కదా తెలంగాణా ఏర్పాటు ! మరి ఈ నాలుగు రోజులు డిల్లిలోనే ఉండీ రాష్ట్రపతి గారి చేత అ డేట్ ప్రకటింప చేసి , తెలంగాణా ఏర్పడిన తోలి రోజున తోలి అడుగు డిల్లి నుండి వచ్చి పెడితే ఎంత గొప్పగా ఉండేది ? ఇలా  ప్రతిజ్ఞా బంగం చేసి అయన రావడం! దానికి చరిత్ర లో గుర్తుంచుకునే స్వాగతం పలకడం ! చివరకు ప్రజలు అయన వాగ్దానా బంగాన్నే గుర్తుంచుకునే ప్రమాదం ఉంది .

  ఏదైనా దొర  దొరే ! అయన చెప్పిందే వేదం . అందుకే ఆయనకు స్వాగతం! సుస్వాగతం

1 comment:

  1. నెహ్రూ కుటుంబం మన దేశాన్ని నాశనం చేస్తుంది
    ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది కదా(అంటే వాళ్ళు కాదు ముందుంది తెప్పించారు)
    ఇక తెలంగాణాలో kcr కుటుంబం ఏమో అనిపిస్తుంది

    ReplyDelete