Monday, February 3, 2014

మేకప్ లు వేసేసుకుని స్టేజ్ ఎక్కడానికి సిద్దంగా ఉన్న తరుణంలో "డ్రామా " అపమంటే ఎలా !?

                                                     


  పార్లమెంట్ లో అఖిలాంద్రా కాంగ్రెస్ డ్రామా కంపెనీ  వారిచే  భయంకర , బీబత్స రస పోషణతో ప్రదర్సింప బోతున్న గొప్ప  నాటక ప్రదర్శనకు కళాకారులు అందరూ మేకప్ లు వేసుకుని  స్టేజ్ ఎక్కడానికి సిద్దమైన .వేళ ప్రతి పక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు హటాతుగా ఇప్పుడు నాటక ప్రదర్సన వద్దంటే ఎలా చెప్పండి? అందుకే కమలనాదుల పార్టి అబ్యంతరాలను కాంగ్రెస్ మంత్రి కమల్ నాద్ ఒప్పుకొలెదు. నాటకం ఆడి  తీరాల్సిందే అన్నారు. ఇంతకీ నాటకం వివరాలు ఏమిటంటే
 .
 నాటకం పేరు: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్ వార్ .(తెలంగాణా బిల్ పోరు )

  రచన: కేంద్ర మంత్రుల గుంపు (గూప్ ఆప్ మినిస్టర్స్).


 సాంకేతిక సహకారం :  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ గుంపు .

 వాద్య సహకారం: సీమాంద్రా పార్టీస్(అరుపులు గొలలు)

 స్తంట్ మాస్టర్: తెలంగాణా పార్టీస్ (తంతాం, పొడుస్తాం)

  దర్శకత్వం: తమిళ తంబి   

 పబ్లిసిటి సహకారం  : సీమాంద్రా అండ్ తెలంగాణా N.G.O లు  

స్పాన్సర్ :  సోనియా గాంది .

 క్లుప్తంగా కద: తెలుగునాడు లో అదికార కాంగ్రెస్ వారి ప్రాబవం తగ్గినట్లు కేంద్ర ప్రబుత్వ పెద్దలు గ్రహిస్తారు . 2009 లో 33 సీట్లు గెలిచిన అదికార పార్టీకి రానున్న ఎన్నికల్లొ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్తితిలో అటు తెలంగాణాలో, ఇటు సీమాంద్రాలో అదిక సీట్ల మద్దతు పొందే ఉపాయంతో అటు తెలంగాణా ఉద్యమ నాయకుడితోను, ఇటుసీమాంద్రా  సానుబూతి నాయకుడితోను ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటారు . కాని అది గమనించిన సీమాంద్రా ప్రజలు క్రమంగా అధికార పార్టికి లోపాయాకార మద్దతు ఇస్తున్న సానూబూతి నాయకుడికి కి దూరమవుతుండటం, అటు వైపు తెలంగాణా ఉద్యమ నాయకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటo  తో పునరాలోచన లో పడతారు కేంద్ర పెద్దలు. ఎలాగైనా సరే సీమాంద్రా ఓట్లు తమ గుప్పెట్లో ఉంచుకోవాలి అని తలచిన అధికార పార్టీ తమ అభిమాన పాత్రుడు కిరణ్ ని రంగంలోకి దించుతారు . అతను సీమాంద్రా హీరో గా గుర్తించబడడానికి అన్ని రకాల సహకారమ్ అందిస్టారు . దానివలన రాష్ట్రం లో తెలంగాణా బిల్ ఓడిపోతుంది. కావాలని తప్పుల తడక బిల్ ని తయారు చేసిన కేంద్ర ప్రబుత్వం దానిని ఎలాగైనా పార్లమెంటులో గెలిపిస్తాం  అంటుంది. ఇంకొక పక్క  తమ పార్టీ వారినే  సభ జరుగకుండా అడ్డుకోమని సీక్రెట్ గా చెపుతుంది. అటు కేంద్ర పెద్దలు కిరన్ ని కోర్టుకు వెల్ళి మోకాలు అడ్డు పెట్టమంటారు . ఇలా మాయోపాయంతో అందర్నీ బోల్తా కొట్టించి తాము  మాత్రం లబ్ది పోందాలని చూస్తుoటారు . అదీ కధ.


No comments:

Post a Comment