వినేవాడి చెవిలో పువ్వులు ఉంటె చెప్పేవాడు ఎన్ని కట్టు కదలు చెప్పటానికైన రెడి ! భారత దేశం లో నిర్బయ ఉదంతం తర్వాత జరిగిన హత్యల్లో ఆంద్ర ప్రదేస్ లో ని మచిలీ పట్నం కు చెందిన మహిళా ఇంజనీర్ అనూహ్య కేసు కూడా ఒకటి . అ హత్య జరిగి నెలలు గడుస్తున్నా నిన్నటి వరకు ఏ క్లూ సాదిo చినట్లు ముంబాయి పోలీసులు మీడియాకు చెప్పలేదు . ఈ రోజు మాత్రం ఒక 35 ఏండ్ల వ్యక్తిని, హత్య చేసిన నిందితుడిగా ముంబాయి కోర్టులో ప్రవేశ పెట్టి , రిమాండ్ కు పంపించారు . కొద్ది సేపటి క్రితం ముంబై పోలిస్ వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి , అనూహ్య కేసులో మిస్టరి చేదిoచామని, ఆమెను సనప్ అనే పాత నేరస్తుడు , టాక్సీ డ్రైవర్ గా ఆమెను తీసుకు వెళ్లి , అత్యాచారం లేక రాబరి చేయబోతే ఆమె ప్రతిఘటించడం వలన , ఆమెను ఉరి వేసి చంపి , ఆ పై పెట్రోల్ పోసి తగల బెట్టాడని చెప్పుకొచ్చారు . ఇదంతా వింటుంటే కొన్ని అనుమానాలు బుర్ర ఉన్న వారికెవరికైనా జనిస్తాయి . మరి ఘన మైన ముంబాయి పోలిస్ వారికి రాలేదంటే నమ్మడం కష్టం . కావాలనే ఎవరో వెనుక ఉండి ఈ కేసును అయేషా కేసు లో మాదిరి పక్క దారి పట్టించి అసలు నెరస్తులను రక్షించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది . ఈ కేసులో కలుగుతున్న అనుమానాలేమిటంటే ---
ఎస్తేర్ అనూహ్య ముంబాయి T.C.S కంపెనీలో ఉద్యోగిని . ఆమె గత క్రిస్టమస్ కి తన స్వస్తలం మచిలీ పట్నానికి వచ్చి , తిరిగి జనవరి మూడవ తారికున బయలు దేరింది . 4 వ తారికున హైదరాబాద్లోని ప్రెండ్స్ తో పార్టి లో పాల్గొని ఆ సాయంత్రం ముంబాయికి రైలులో బయలు దేరింది . 5 వ తారీకు తెల్లవారు జామున ముంబాయిలో దిగిన తర్వాత కొంత సేపు వెయిటింగ్ రూమ్ లో ఉండి అ తర్వాత ఒక వ్యక్తికీ తన బ్యాగ్ ను ఇచ్చి , తానూ సెల్ పోన్లో మాట్లాడుతూ బయటకు వేలుతుండడం క్లియర్ గా రైల్వే స్టేషన్ లోని సి.సి. పుటేజ్ లలో కనిపించింది . అయితే ఆమె తో పాటు పుటేజ్ లలో కనిపించిన వ్యక్తే ఈ రోజు పోలీసులు చెపుతున్న
సనప్ పాత నెరస్తుడట.పార్ట్ టైం కాబ్ డ్రైవర్ గా ఉన్న అతనికి అనూహ్యను తీసుకు వెళ్ళిన రోజు మాత్రం కాబ్ లెదట . తను కాబ్ డ్రైవర్ ని అని చెప్పి ఆమెతో 300 రూపాయల బేరం కుదుర్చుకున్న అతను బయట వరకు ఆమెను తీసుకువచ్చిన తర్వాత , తన దగ్గర కాబ్ లేదని మోటార్ సైకిల్ మిద డ్రాప్ చేస్తాను అంటే మొదట్లో అనూహ్య ఒప్పుకోలేదట . అ తర్వాత ఆతను అనుమానం ఉంటె నా సెల్ తీసుకుని మిరేవరితోనైనా పోన్ చేసి విషయం చెప్పండి, కాని నన్ను మాత్రం నమ్మండి , మిమల్ని నమకంగా ఇంటి దగ్గర దిగబెడతాను అంటే , దానికి ఆమె కూడా అతని పోన్ తీసుకుని ఎవరికో పోన్ చేసినట్లు నటించిందట కాని నిజంగా చేయలేదట . గుడ్డిగా అతనిని అనుసరించి హత్యకు గురి అయిo దట . ఇది పోలిస్ వారి కహాని . ఈ కహాని లో కలుగుతున్న అనుమానాలేమిటంటే -
(1). ముక్కు , ముఖం తెలియని వాడు కాబ్ ఉందని చెప్పి బయటకు తీసుకు వచ్చి , అక్కడ మోటార్ సైకిల్ చూపించి దాని మిద దిగబెదతాను అంటే అ ఇంజనీర్ నమ్మి గొర్రె పిల్లలా అతని వెంట వెళ్ళిందా ?
(2). "నా మిద అనుమానం ఉంటె మిరేవరికైనా నా సెల్ లోనే నా గురించి సమాచారం ఇచ్చాకె నాతొ రండి"అని అతడు అంటే సరే అని సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడినట్లు నటించాల్సిన అవసరం ఆమెకు ఏమిటి? ఖచ్చితంగా ఆమె తనకు తెలిసిన వారేవరితోనో మాట్లాడి , వారు పర్వాలేదు అతనితో వెళ్ళమని రికమెండ్ చేసాకే వెళ్లి ఉండాలి . అ నిందితుడు కూడా ఆమెకు తెలిసిన వ్యక్తీ చెపితేనే ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చానని , కావాలంటే అతనితో/ఆమె తో మాట్లాడండి అని తన సెల్ ఇచ్చి ఉండాలి . అ విషయాన్ని ఆమె అతని సెల్ ద్వారా కన్పర్మ్ చేసుకున్నాకే అమాయకంగా అతనిని అనుసరించి బలి అయి పోయి ఉంటుంది .
(3). ఈ కేసులో ముంబాయి పోలీసులను ఇమ్ప్లూయన్స్ చేయగలిన వారి హస్తం ఉంది ఉండాలి .వారికి ఆ అమ్మాయికి ఏదో బేదాభిప్రాయాలు ఉంది ఆమె బ్రతికి ఉంటె తమకు ముప్పు అని ముంబాయి పాత నేరస్తులతో ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండాలి . తమక్జు ఉన్న ఇన్ప్లోయన్స్ తో కేసుకు మసి పోసి మారేడు కా య చేసి , పాత నేరస్తులకు కేసు అంట గట్టి , తము తప్పించుకునే ప్రయత్నం అని అనిపిస్తుంది తప్ప, పోలిస్ వారి కహాని ఎ మాత్రం నేమ్ విదంగా లెదు.
ఈ కేసును నిజాయితిగా సి.బి.ఐ వారి చేత దర్యాప్తు చేస్తే తప్పా నిజాలు నిజాలు వెలుగులోకి రావు . అ దిశగా ఆమె సంబదికులు చర్యలు తీసుకోవాలి . అవసరమైతే తెలుగు ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .
good info
ReplyDeletethank you radhika garu
Deleteఅవసరమైతే తెలుగు ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .
ReplyDeleteభలే చెప్పారే!
మన తెలుగు ప్రజా సంఘాలను కదిలించాలా?
తెలుగువాళ్ళకు తమలో తాము తన్నుకు చావటం తప్ప మరేమైనా చేతనౌనని ఈ భూప్రపంచకంలో ఎవరైనా అంటే అంతకంటే అమాయకుడు ఉండడు కదా! అదీకాక ఏదైనా సంఘం అంటే పాపం వాళ్ళలో వాళ్ళకు ఎన్ని ముఖ్యమైన పనులుంటాయీ, పెద్దపెద్దవాళ్ళతో ఎలాంటి అవసరాలు ఎంతెంతగా ఉంటాయీ అన్నది ఆలోచించాలి మనం. పైగా అవి తెలుగువారి సంఘాలు అయేసరికి వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాడుకోవటం మరింత జోరుగా ఉంటుందే మరి అలాంటప్పుడు ఇలాంటి పోలీసులచేతిలో ఉన్న బడావాళ్ళతో లింకులుండే అవకాశం ఉన్న కేసులో ఈ సంఘాలు కల్పించుకుంటాయా చెప్పండి
you are correct sir !
Delete