నిన్నN.T.V లో ప్రసారమయిన "వైజాగ్ఎలియన్స్" ప్రసారాన్ని చూశాకా నాకొక డౌట్ వస్తుంది అసలు మన వీరబోగవసంత రాయలుకి "ఎలియన్స్" కి ఏమన్నా లింకుందా? అని. అసలు ఇంతవరకు అటు రష్యా, అమెరికా లోనే తిరుగాడుతున్న ఎలియన్స్ (నాసావారు కూడ ప్రకటించారట) హటాతుగా ’ఆంద్రప్రదేశ్’ కి ఎందుకు వచ్చినట్టు?
నిన్న టి.వి లో చూపిన ఎలియన్స్ చిన్న బొమ్మల్లు లాగా ఉన్నాయి. ఈ బొమ్మలు వల్ల మనల్ని ప్రబావితం చెయ్యాడానికి అవతార పురుషుడికి ఏమయిన అవకాశం ఉందా? నేను ఇలా ఆలోచించడం హాస్యాస్పదం గా అనిపించినప్పటికి మన "శక పురుషుడు" మరియు "ప్రథమాంద్ర పాలకుడు" అని చెప్ప బడిన "శాలివాహన చక్రవర్తి" జన్మ వ్రుత్తాంతం లో కూడ ఈ విదంగానే "బొమ్మల్ తో యుద్దం" అనేది ఉంది, కాబట్టి ఇలాగా ఆలోచించవల్శి వస్తుంది.
మన హైదరాబాద్ టాంక్ బాండ్ మీద ఉన్న ’తెలుగువారి విగ్రహలలో" "శాలివాహన చక్రవర్తి" ది మొట్ట మొదటిది. ఈయనే మన తెలుగు వారి తొలి చక్రవర్తి అట! ఇయన ’శక పురుషుడు" కూడా. అంటె మన తెలుగు పంచాంగ కాలెండర్ ఈయన జన్మ తేది ననుసరించే గుణించబడుతుంది. దీనినే బారత ప్రభుత్వం అధికారిక కాలెండర్ గా ప్రకటించింది. కాబట్టి ఈయనకు "యుగాంతానికి" కూడా ఏదో సంబందం ఉండి ఉందాలి.
ఇయన జివిత చరిత్రలో,కూడ అప్పట్టి ఉత్తరాది చరవర్తి అయిన ’విక్రమాదిత్యుడితో’ యుద్దం చెయ్యల్శి వచ్చినాప్పుడు, "సాలివాహనుడు" కు సైన్యం లేకపోతే తమ ఇలవేల్పు అయిన ’నాగేంద్ర స్వామి" మహిమతో అప్పట్టి కప్పుడు ’మట్టిబొమ్మలు " తయారు చేసి(శాలివాహనుడిది "కుమ్మరి" కులమట), వాటికి ప్రాణం పోసి, ఆ బొమ్మల సైన్యం సహాయం తోనే యుద్దం చేసి, విక్రమాదిత్యుడిని ఓడించి "రాజ్యాధికారం" చేపట్టి మన జాతిని జనరంజకంగా పాలించాడట. ఆయన వంశమే తర్వాత"శాత వాహన వంశం" గా పేరుగాంచి శుమారు నాలుగు వందల యేండ్లు తెలుగునాట రాజ్య పాలన చేసారట.నేను ఈ కథ చదివినప్పుడు ’బొమ్మలు ప్రానం పోసుకుని" సైనికులు కావడమoతే, ఒక వేలా శాలివాహనుడు ’మట్టి మనుషులు" లాంటి సామాన్య ప్రజలలో చైతన్యం కలిగించి, వారి సహాయంతో అప్పటి పాలకులను పదవీచ్యుతలను చేసి సింహాసనం ఎక్కాడేమో అనుకున్నాను. కాని ఈ ఎలియన్స్ పుకార్లు వింటుంటే ఆ టైమ్ లో కూడ ఈ ఎలియన్స్ బొమ్మల్లు ఏమన్నా "శాలివాహనుడి"కి సహాయం చేశాయా అని అనుమానం కలుగుతుంది.
కాబట్టి మనం బొమ్మల్ని అంత తేలిగ్గా తీసుకోరాదు. ఆ శాలివాహనుడే తిరిగి మన ’వీర భోగ వసంత రాయలు" గా అవతరిస్తే ఆయన "బొమ్మల ఏలియన్స్" తిరిగి ఏ.పి. లోకొచ్చాయా!అలా వస్టే మనం ఎంచక్కా "బొమ్మల యుద్దం" చూడొచ్చు. ఆ అగండాగండి. ఇప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తు కొచ్చింది. ఇంతకు నేను చెప్పినట్లు "కల్కి" అంటే "మట్టి నుండి పుట్టిన" అనే అర్థం కూడ ఉందట!కావాలంటే ఈ http://en.wikipedia.org/wiki/Kalki_Purana లింక్ ని క్లిక్ చేసి చూడండి. కాబట్టి మట్టి నుండి పుట్టిన వాడు అంటే "కుమ్మరి కులం" అనే అర్థం వస్తుంది కాబట్టి,వీరభోగవసంత రాయలు, అన్నా ’శాలివాహనుడు అన్న, కల్కి అన్నా ఒకటేనా! మరింకొక ఆశ్చర్యమయిన పోలిక ఏమిటంతే మనకు కనిపించే శాలివాహనుడు బొమ్మ, కల్కి బొమ్మ, ఒకేలాగ అంటే గుర్రం మీద కత్తి ఎత్తి యుద్దం చేస్తున్న వీర పురుషుడి బొమ్మే. ఇద్దరూ యుగ పురుషులే.
నేను ఊహించేది నిజమో కాదో తెలియాలంటె, ఇంకొన్ని రోజులాగక తప్పదు.
మీ ఫ్రొఫైల్ నేమ్ తప్పు గా ఉన్నది సవరించుకోగలరు సార్వబౌమ కాదు సార్వభౌమ ఇంగ్లీషులో SAARVA BHOUMAతప్పుగా భావించవద్దు
ReplyDeleteమీ ఫ్రొఫైల్ నేమ్ తప్పు గా ఉన్నది సవరించుకోగలరు సార్వబౌమ కాదు సార్వభౌమ ఇంగ్లీషులో SAARVA BHOUMAతప్పుగా భావించవద్దు
ReplyDeleteమీ ఫ్రొఫైల్ నేమ్ తప్పు గా ఉన్నది సవరించుకోగలరు సార్వబౌమ కాదు సార్వభౌమ ఇంగ్లీషులో SAARVA BHOUMAతప్పుగా భావించవద్దు
ReplyDelete