Sunday, December 23, 2012

800 హిందూ దేవాలయలను పడగొట్టించిన హిందూ వాది ఎవరో తెలుసా?


                                                                       

 మీరు చెపితే నమ్మరు! బి.జె.పి. పార్టీని మత వాది పార్టి అని తెగ ఆడి పోసుకునే వారు సైటం నమ్మలేని నిజం ఇది. రోడ్ల అభిరుద్దికి ఆటంకం ఉన్నవని చెప్పి సుమారు ఎనిమిదివందల దేవాలయలను,  వందల మసీదులను పడగొట్టిoచిన ఘనత గుజరాత్ ముక్య మంత్రి "నరేంద్ర మోడి" గారికే దక్కుతుంది. హిందూ మతం అంటే అది ఒక జీవన విదానం అని, ఆదునిక అభిరుద్దికి అది ఆటంకం కాదు అని నిరూపించిన  హిందూ విశ్వాసి,"నరేంద్ర మోడి". అందుకే గుజరాత్లో ముస్లింలు సైతం ఆయనకు బ్రహ్మ రథం పట్టారు.

  వ్యక్తి తాను అనుసరించే విదానం వల్ల ప్రజలలో నమ్మక్కం కలిగించాలి. అంతే కాని ఆచరణీయం కాని శొల్లు సిదాంతాలు వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదు. నేతి బీరకాయలో నేయి యెంత ఉంటుందో ఈ సో కాల్డ్ అబ్యుదయ సిదాంత వాదుల్లో చిత్త శుద్ది అంతే ఉంటుంది. హిందూ మతం అంటే అబిరుద్ది నిరొదకం కాదు. ఇతర మతాలతో దీన్ని పోల్చి అజ్ణాన్ని చాటుకునే వారు, కుహానా లౌకిక వాదులు. హీ0దూ మతాన్ని మించిన లౌకిక తత్వం ఆచరించే మతం ఏది ఈ ప్రపంచంలో లేదు అని నా ద్రుడ విశ్వాసం. మత వాదం అంటే మూర్ఖమయినది అని, అబిరుద్ది నిరోదకమని, హిందూ వాదుల పాలనలో మైనార్టీ మతాల  ప్రజలకు రక్షణ ఉండదని ఇన్నాళ్ళు కుహానా లౌకిక వాదుల పార్టీలు చేసిన వాదనలు కల్లలని తేలాయి. నిజమయిన అభిరుద్ది కాంక్షించే వారు, కులు మత బేదాలు లేకుండానే పాలన సాగిస్తారని, హిందూ మత వాదులు కు ఉన్న లౌకిక ద్రుక్పదం కుహానా వాదులకు కూడా ఉండక పోవచ్చని శ్రీ మోడీ నిరూపించారు. నిరంతరం సొల్లు సిద్దాంతాలు వల్లె వెయ్యడం కాదు తమకు ఆచరణలో చూపించగల దమ్మున్న నాయకుడు కావాలని, వారికే కుల మతాల కతీతంగా తమ మద్స్దతు ఉంటుందని గుజరాత్ ప్రజలు నిరూపించారు. ఇప్పటికయిన పార్టీలు హిందూ మతాన్ని, ఇతర మతాల వలె చూడక అది ఒక విశిష్ట జీవన విదానమని గుర్తిస్తే మంచిది.      

No comments:

Post a Comment