మయన్ కాలెండర్ ప్రకారం నిన్నటితో అంటే డిసెంబర్ 21 కి యుగాంతం అయిపోయింది. నేను చెప్పిన ప్రకారం అవతార పురుషుడు కల్కి ఉరఫ్ వీరబోగ వసంతరాయలు సమాచారం(http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html) ప్రకటించడంతో నిన్నటి వరకు ఉన్న నా బ్లాగు టైటిల్ ఉద్దేశ్యం నెరవేరింది. ఇక ఆ టైటిల్ తో బ్లాగును నడపడం అనవసరం అని బావించి ఈ రోజు నుండి బ్లాగు టైటిల్ ను "కల్కి ఖడ్గం" గా మార్చడమయినది. కావున వీక్షకులు, బ్లాగ్మిత్రులు, అజ్ణాత సద్విమర్శకులు, మరియు కువిమర్శకులు గమనించ గలరని మనవి.
మనిషిని జ్ణాన వంతున్ని చెయ్యడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు. వారి క్రుషి పలితమే నేటి మన శాస్త్ర సాంకేతిక పురోభివ్రుద్ది. దాని వలన మానవుడు ప్రక్రుతిని శాసించే స్తాయికి ఎదిగినట్లు కనిపిస్తున్నాడు. కాని తన జాతి మీద ఉన్న మమకారం, స్వార్దం, ఇతర జీవజాతులను పట్టించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి విజ్ణానినని విర్రవీగి తన సౌఖ్యమె పరమార్థంగా బావించి విచ్చల విడిగా ప్రక్రుతిని నాశనం చేస్తూ సకల జీవరాసి మనుగడకే పెను ముప్పుగా మారాడు.
పూర్వ కాలమ్ లో రాక్షసులు చేసిన పనినే ఇప్పట్టి విజ్ణానుల మని విర్ర వీగే వారు కొంత మంది చేస్తున్నారు. వారికి దేవుడు, మతం అంటే అసహ్యం. వారిది కూడ ఒక మతమే. ఈ స్రుష్టికి మానవుడే కేంద్రం. దైవ బావన మూర్కత్వం అనే మతం. "నాస్తిక మతం". సైన్స్ పేరిట జరిగే ఘోరాలు గురించి పెద్ద పట్టింపు ఉండదు వీరికి ఎక్కడో ఎవరో మతం పేరిట వ్యక్తుల్ని మోసం చేస్తున్నారని, వారిలో అజ్ణానాని పెంచుతున్నరని తెగ బాదపడి పోతారు. "నాస్తిక వాదం" పేరుతో దేశీయ మతాల్ని తూలనాడుతు, విదేశీ మత బావజాలాభివ్రుద్దికి పరోక్షంగా సహాయపడుతుంటారు.
ఏ మతమయినా సకల జీవ సంక్షేమం గూర్చి చెపుతుంది. కాని శాస్త్రియా నాస్తిక మతం కేవలం మనిషి అభివ్రుద్ది,ప్రక్రుతి మీద ఆదిపత్య దోరణి గూర్చి మాత్రమే ఆలోచిస్తుంది. ఇటువంటి దోరణులను నియత్రించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. నా బ్లాగు అందుకోసం క్రుషి చేస్తుంది.
No comments:
Post a Comment