Wednesday, December 26, 2012

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి మద్య తేడా తెలియనివారిని ఏమనాలి?


                                                                           

  ప్రతిష్టాత్మకమయిన,మన తెలుగు బాషా ఔన్నత్యాన్ని చాటే, "ప్రపంచ తెలుగు మహా సభలు" తెలుగు ప్రాంతంలో జరగటం ముదావహం.ఇవి ప్రపంచ సభలు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువార్కి అంటే, తెలుగు బాషను మాత్రు బాష గా ఉన్న వారందరికి సంబందించిన సభలు అని సాదారణ ప్రజలు అనుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రం లో ఒక భాగమయిన తెలంగాణా లోని ప్రజలు అనుకుంటూ ఉండవచ్చు. కాని తెలంగాణా విడగొట్టాలి అని పదియేండ్ల నుండి పోరాటం చేస్తున్న నాయకులు మాత్రం అలా అనుకోవటం లేదని అర్థమవుతుంది. వారు ’తెలుగు" అనేది తమది కాదని, అది పరాయి బాషని బావిస్తున్నట్లుంది. ఆంద్రా వాళ్ళ మీద కోపం "తెలుగు బాష" మీద చూపించడం ఎంతవరకు సమంజసం?

   అసలు వీరు చేసే ఒక వాదం ఆశ్చర్యం గా ఉండటమే కాక ప్రజలు ని అయోమయానికి గురి చేస్తుంది. తమది "తెలుగు తల్లి" కాదు అని తెలంగాణా తల్లి అని చెపుతూ ఒక కొత్త తల్లిని ఆవిష్కరింపచేశారు. తెలంగాణా తల్లి దేనికి ప్రతీకా, బాషకా? ప్రాంతానికా? స్పష్టత లేదు. తెలంగాణా వారు మాట్లాదేది తెలుగా? కాదా?.తెలంగాణా అంటే తెలుగుకి సంబందించిన పదం కాదా?ఆంద్రా అనేది మాత్రమే తెలుగుకు సంబందించినదా!ఏమిటీ విపరీత అర్థాలు?

  నాకు తెలిసీ "భరత మాత" అని దేశ భూ బాగానికి ప్రతీకగా ఆ తల్లిని ఆరాదిస్తున్నాం.అలాగే "తెలుగు తల్లి" అని మాత్రు బాషకు ప్రతీకగా పూజిస్తున్నాం. అలాగే "తెలంగాణా తల్లి" అని ప్రాంతీయ బూబాగానికి ప్రతీకగా తెలంగాణా ప్రజలు ఆరాదించ వచ్చు. కాని వారి మాత్రు బాష ఏమీటీ అనేది ఘనత వహించిన నాయకులు చెప్పాలి. వారు మాట్లాడేది తెలుగే అయితే "తెలుగు తల్లి" వారి తల్లి అవుతుంది. అటువంటప్పుడు వారు తిట్టేది వారి తల్లినేనా? కాదా? ఆత్మ విమర్శ చేసుకోవాలి. తల్లి ని తిట్టేవాడు ప్రజా నాయకులు అవుతారా?తెలంగాణా ప్రజలు  నిగ్గదీసి అడగాలి.ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది అంటే "అన్న దమ్ముల మీద కోపం అమ్మ మీద చూపించి నట్లుంది".
                శ్రి వేంకటేశ్వరుని పాద పద్మముల నగరి అయిన "తిరుపతి" పట్టణం లో నేడు మొదలవుతున్న మన బాషా ప్రపంచ మహా సభలు సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన  తెలుగు అన్నదమ్ములు, అక్కచెల్లెలందరకు శుభాభినందనలతో..........


2 comments:

  1. తెలంగాణా యాసను అవహేళన చెసేది మీరే – తెలుగు తల్లి బొమ్మ చూపించి తెలంగాణాను మాయ చెసేదీ మీరే !
    http://udayaraagam.wordpress.com

    ReplyDelete
    Replies
    1. యాస లెని బాష లెదు. ఎవరయినా సరే,అట్టి యాసను అవమానించువాడు,ass తో సమానం. కాని వాడెవడో యాసను అవమానించాడని, బాషామాతల్లినే అవమానించడం బావి రాష్ట్రాది నేతలు కావాలనుకునే వారికి తగునా?

      Delete