Monday, December 31, 2012

స్త్రీలను వేటాడేది రేపిస్టులు అయితే, వారికి సహకరించేది ఫెమినిస్టులా!?



 అలాగె ఉంది కొంతమంది దోరణి చూస్తే. ఎవరు ఒక మాట ఆడపిల్లలు కోంచం జాగర్తగా ఉండమని చెప్పినా వీళ్ల మీద ఏదో పడ్డట్లే అవేశపడి పొతున్నారు. అసలు మన దేసమ్ లొ ఒక అంచనా ప్రకారం నూటికి రెండు కేసులు మాత్రమే పోలిస్ స్టేషన్ల దాకా వస్తున్నాయట. అటువంటప్పుడు స్త్రీల రక్షణకు కేవలం చట్ట బయం ఒక్కటే చాలదు. అన్ని జాగర్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఒంటి నిండ బట్టలు కట్టుకోండి అనటం బూర్జువా బావం అంట! మీ ఇష్టం వచ్చినట్ట్లు ఉండండ అని చెప్పడం అబిరుద్ది బావజాల మట. అసలు నాకొక పెద్ద అనుమానం ఏమిటంటే ఈ దెశపు స్త్రీలను తమ వ్యాపార ఉత్పత్తులు అమ్మకం కోసం ఆదునికత పేరుతో విచ్చలవిడి తన్నాని ప్రోత్సాహిస్తుంది వ్యాపారా వాదులే అని. వీరు డైరక్టుగా చెపితే బాగోదని వీరి తాబేదారులను "స్త్రీ వాదం" అనే పేరుతో రంగంలోకి దించి వితండ వాదాలు చేయిస్తున్నరు అని .

  వీళ్ల తంతు చూస్తుంటే వేటగాళ్లు అమాయక జంతువులను వేటాడే విదం గుర్తుకు వస్తుంది. వేటగాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు రెండు జట్లుగా విడి పోతారు. ఒక జట్టు దూరంగా దారి కాచి ఆ దారిలో కొంతమేర వలలు పన్ని ఎదురు చూస్తుంటారు. ఇంకొక జట్టు మరొక పక్క నుంచి డప్పులు శబ్దం చేస్తూ జంతువులను పొదల్లో నుంచి లేపి పరిగెత్తిస్తూ రెండో జట్టు వలలు పన్నిన చోటుకి తరుముకు వస్తారు. అమాయక జీవులు వేటగాళ్ళ మోసం తెలియక ముందు వెనుక చూసుకోక ఆ వలలో చిక్కుకుని వేటగాళ్ళకు ఆహారంగా మారతాయి.

  పై విదానమే ఈ స్త్రీ వాదులు, రేపిస్ట్లు కలసి చేస్తున్నరా అనిపిస్తుంది. ఒకళ్లేమో మీ ఇష్టం వచ్చినా విదంగా వీదుల్లోకి వెల్లే స్వేచ్చ ఉంది అంటారు అలా వెళ్ళిన వాళ్ళని రెచ్చగొట్టిందంటూ ఇంకొక వర్గం వారు  రేప్ చేస్తుంటారు. ఫెమినిస్టు లారా మీరు చెపుతున్నట్లు ఈ దేశంలో  బూర్జువ సంస్క్రుతే రేప్ లకు మూల కారణమయితే, ఆదునిక బావాలు వాళ్ళు తిరిగే పబ్బుల్లో, క్లభ్భుల్లో రేప్ లే జరుగ కూడదు. విమానాలలో సహితం పేరుమోసిన ఆదునికులే వికారాలు ప్రదర్శిస్తుంది ఎందుకో చెప్పగలరా?రేప్ అనేది అభిరుద్ది చెందిన దేశాలలో జరుగుట లేదా? కేవలం మన దేశం లోనే జరుగుతున్నాయా? దీని గురించి ఒక అద్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఒక వేళ మీరు చెప్పినట్లు ఇక్కడి మగ మనస్తత్వమే అటువంటిది, దానిని చట్ట దండన ద్వారే నియంత్రించగలం అని తేలితే మిలట్రీ రూల్ పేట్టైనా స్త్రీలను కాపాడవలిసిందే. లేదు స్త్రీలు కూడ ప్రబుత్వాలకు సహయపడితే ఈ విపరీత దోరణి నివారించవచ్చు అని తేలితే అలాగే చేయొచ్చు. అంతె కాని ఏది చెప్పినా బూర్జువాబావజాలమ్ అని ఈసడించుకుంటే పరిస్తితులు చక్క బడవు.     

No comments:

Post a Comment