."యుగాంతం" అంటే "జగాంతం" కాదు, అని నేను ఎప్పుడో బల్ల గుద్ది(మీకు వినిపించదు లెండి) చెప్పాను.కేవలం మయన్ల కాలెండర్ అంతం అని కూడా చెప్పాను. అదే వీషయాన్ని "నాసా" వారు ఉద్ఘాటించినట్లు ఈ రోజు పేపర్లో వచ్చింది. అయినా నేను మాత్రమే కాదులేండి మన దేశంలో లక్షకి ఒకరు కూడ ఈ ప్రపంచం మునిగిపోద్ది ఎవరూ భయపడటం లేదు. అదే అమెరికా లో అయితే నూటికి పదిమంది ఏదో అయిపోద్దని భయపడి పోతున్నారట. ప్రభుత్వం చెప్పినా వారు నమ్మరట. అంత "పిచ్చి పువ్వులం" కాదుగదా మనం. ఎందుకంటె వారు సైన్స్ పరంగా అభివ్రుద్ది చెందిన దేశం లో నివసిస్తున్నారు. మరి మనం ఏదో "దేవుడు" కర్మ" అనె వేద భూమి లో జీవిస్తున్నాం. ఏది ఎలా జరిగినా అంతా ఆ దేవుడిదే భారం అనుకుంటాం కాబట్టి, ఇలాటి వాటిని నమ్మను గాక నమ్మం.
నేను ఒక విషయం మాత్రం రూడిగా చెప్పగలను భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక చిన్న తోక చుక్క (ఇటు వంటి వాటిని నాసా పరికరలు కనిపెట్ట లేవట) మొత్తం అఖ్కర్లేదు, దాని తోక తగిలి భూమి కి ఏ మాత్రం ప్రమాదం జరిగినా అందరూ బాగానే ఉంటారు ఒక్క అమెరికా తప్పా! కోట్ల మంది పిచ్చిఎత్తి, ఉన్మాదులయి ఒకరినొకరు కాల్చుకు చస్తారు. మొన్న జరిగిన "ఉన్మాది" కాల్పులు ఆ కోవకి చెందినవేనంట. ఈ ఉదాహరణ చాలు వారి భద్రత ఎంత "అభద్రతా భావం "తో ఉందో!
అయినా మన కెందుకు లెండి వారి గొడవ. మన వీరబోగ వసంత రాయలు గారు మాత్రం ఇంకొక 48 గంటల్లో మన కు కనపడతాదు. ఏమండోయి ఏదో "జగాంతం" రాదని అన్నానని వీరబోగ వసంత రాయలు కూడ రాడనుకునేరు. మన నమ్మక్కం మనది. ఒకరి కోసం మన నమ్మక్కాన్ని వదులు కుంటామా ఏమిటి? అందరు ఎల్లుండి అన్ని పనులు తొందరగా ముగించుకుని "ఆకాశం" వంక చూస్తూ కూర్చోండి. నాకు కబురందగానే మీకు వెంటనే "స్పెషల్ టపా" ద్వారా చెప్పేస్తాను. లేదా మీకు కనపడితే మీరయినా చెప్పండి.
No comments:
Post a Comment