Monday, December 31, 2012

ఫుల్ గా మందు కొట్టి,అర్థరాత్రి ఆంగ్ల సంవత్సరాది కి ఆహ్వానం పలికే వారికి శుబాకాంక్షలు.!


 అబ్బా! పాత వత్సరం ఈరోజు అర్థరాత్రితో ముగుస్తుంది. దేశప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతమ్ చెప్పటానికి బారీ ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారట!అర్థరాత్రి అనందం కోసమ్ ఎదురు చూస్తున్నారు.

 సరె అందరకు ఉన్నట్లే మనకు ఒక సంవత్సరాది ఉంది. దానిని ఉగాది అంటాం. ఆ రోజు తెల్ల వారు జామునే లేచి శుభ్రంగా తలంటు పోసుకుని, కొత్త బట్టలు కట్టుకుని,పూజలు చేసుకుని, ఉగాది పచ్చడి తిని, పిండివంటలు వండుకుని ఇంటిల్లీ పాది ఆనందంగా గడుపుతాము. ఇదంతా పగటి వేళలో జరుగుతుంది.ఇది మన సంస్క్రుతి. మన మత విదానం ఇదే మనకు నేర్పింది.

 ఇక పొతే విదేసి సంస్క్రుతి నేర్పిన దేమిటంటే ఇంకా గంటల్లో నూతన సంవత్సరం వస్తుందనగా, ఫ్రెండ్స్ తో కూర్చుని మందు పార్టీ ఏర్పాటు చేసుకోవడం.ఫుల్ గా మందుకొట్టి ఊగుతూ ఆ మత్తులోనే, న్యూ ఇయర్ కి స్వాగతం చెపుతూ, రోడ్ల వెంబడి పిచ్చి గంగిర్లెత్తినట్లు వెర్రి కేకలు వేస్తూ, తిరిగి,తిరిగి ఇంటికి వెళ్ళి(వీలుంటె) బోర్ల బొక్కలా పడుకుని నిద్ర పోవడం. వీరికొక సెంటిమెంట్ ఉందట! మొదటి రోజు ఎలా జరిగితే సంవత్సరం అంతా అలాగే జరుగుద్ది అంట! ఇంకే మరి! స్వాగతమే మత్తులో చెపుతున్నారు కాబట్టి, ఆ యేడాదంతా అదే పరిస్తితి!

  ఈ విదానం వల్ల వ్యాప్పారస్తులు,సెలబ్రిటిలు, మద్యం షాప్ లకు బారీ ఒపెనింగ్లు తప్పా ఎవరికి ఎమి ఒరగదు. ఏది ఏమయినా నలుగురితో నారాయణా అని నేను స్వాగత శుబాకాంక్షలు చెపుతున్నాను.

              ఇష్...యు....ఆ..ప్..ఇ..న్య్...ఉఉ..యి...యాఅ...ర్..............(ఇప్పటికే బాటిల్ కతం),

No comments:

Post a Comment