Monday, December 24, 2012

"మతం" అనేది మనుష్యులకు మాత్రమె ఉంటుంది, జంతువులకు ఉండదు.


                                                                    
 మానవ ఆలోచనా పరిణామ క్రమంలో ఏర్పడిందే మతం. అది ముఖ్యం గా ఈ స్రుష్టిని నడిపే శక్తి ఏదో ఉందన్న మనిషి ఆలోచనలోనుంచి పుట్టిందే . వెర్వెరు ప్రజలు వెర్వేరు పద్దతుల ద్వారా ఆ శక్తి ని కనుగొనాలని ప్రయత్నిస్తూ కొన్ని విదానాల ద్వారా దానిని సాదించవచ్చని నమ్ముతుంటారు. ఆ నమ్మకాలే మత విశ్వాసాలుగా రూపొందినాయి.

  కాబట్టి మతం అనేది మనిషి ఆలోచనా  లేక జ్ణాన పరిణామా క్రమం లోనిది. ఇది జంతువులకు ఉండదు.ఎందుకంటె వాటికి జ్ణానం లేదు కాబట్టి. జ్ణానం లేకపోవుట వలన అవి స్రుష్టితో  ప్రత్యక్ష సంబందం కలిగి ఉంటాయి. కాబట్టి మానవుడి లాగా అనవసర బాదలు అంటూ ఏమి ఉండవు. జరిగిందానికి విచారించే పని లేదు, జరగబోయే వాటికి వగచే పని అంత కన్నా లేదు.

  కాని మనం జ్ణానం అనే దానిని పొంది ప్రక్రుతి ని పరీశిలిస్తూ , తద్వారా జ్నానాభివ్రుద్ది సాదించి చివరకు ప్రక్రుతినే శాసిమ్చ గలం అనే స్తాయికి ఎదిగాం.అసలు ఏ దైవ బావనతో ప్రక్రుతిని పరిశిలించటం మొదలు పెట్టామో, ఆ దేవుడే లేదు, పో! అనే నమ్మఖ్ఖానికి కోంత మంది వచ్చేశారు. ఇప్పుడు ప్రపంచం లో దేవుడూ,మతం వద్దనే వారు ఇరవయి శాతం అంటే నూట ఇరవై కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా. అంటే ప్రపంచంలో హిందువుల కంటే వీరే అదికమట!

  మరి పైన నేను చెప్పిన నిర్వచనం ప్రకారం వీరికి మతమ్ లేదు కాబట్టీ వీరు "జంతువులా? అని మీరు అడగవచ్చు. కాదు వీరు మనుషులే . వీరు తమకు మతం లేదని గప్పాలు కోడుతుంటారు, కాని వీరు మత వాదులే. వీరిది "నాస్తిక మతం" . అంటే దేవుడు లేడనే నమ్మక్కం కలిగిన వారు. అసలు ఏ నమ్మక్కం లేక పోతే, వీరు పరిపూర్ణ జ్ణానులు అవ్వాలి. అప్పూడు తిరిగి ప్రక్రుతితో సంబందం ఏర్పడాలి. అప్పుడు వీరికి జంతువులకు పెద్ద తేడా ఉండదు. అవి జ్నానం లేనివి. వీరు పరిపూర్ణ  జ్ణానులు. ఇరువురూ ప్రక్రుతితో ప్రత్యక్ష సంబందం కలిగి ఉంటారు. సుఖ దుఖాలకు అతీతులు.కాని ఈ నాస్తికులు అలాంటి వారు కాదుగా! వారికి నమ్మకాలు ఉన్నాయి. జ్ణానం ఉంది.కాబట్టి  వారు మనలా నమ్మక జీవులే.   

No comments:

Post a Comment