మన డెశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య అవినీతి. మన ఆదర్శమేమో అవునీతి నిర్మూలించి "దర్మ రాజ్యం" తెమ్మాంటుంటే, ఆచరణలో మాత్రం అది సాద్యమయ్యేపని కాదు అని చిన్నోళ్ల దగ్గర్నుంచి పెద్దోళ్లదాక ఒకటే నమ్మక్కం.ఈ మద్య అవినీతి నిర్మూలిస్తామని ఎవరైనా చెపితే వాడినో "వెర్రి వెంగళప్ప" ని చూసినట్టు చూస్తున్నారు.వీళ్ళ వల్ల కాడు వీళ్లను పుట్టించోడి వల్ల కూడ కాదు అనేది సామాన్య అభిప్రాయం.
కాబట్టి ప్రజలారా దీనికొకటే విరుగుడు. ప్రభుత్వానికి ఒక "చివరాకరి" అవకాశం ఇచ్చేద్దాం. ఆ లోపు దేశమ్ లో అవినీతిని నిర్మూలించారా వెల్ అండ్ గుడ్. లెదా మనమే దానిని నిర్మూలిద్దాం. ఎలాగంటే అవినీతిని బాగా ప్రోత్సాహించేసి అవినీతి పరులను గడ గడ లాడిద్దాం! ఈదేమి పిచ్చి సలహా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మనకో సామెతుంది "పెరుగుట విరుగుట కొరకే" అని . అందులో గొప్ప లాజిక్ తో కూడిన సత్యం ఉంది. కొంత మంది అవినీతి వలన ఎక్కువమంది బాదపడుతున్నాం. కాని అవినీతిని చట్టబద్దం చేసేసి(మనమే చెయ్యడం), అందరు విచ్చల విడిగా అవినీతిని ప్రోత్సహిస్తే దాని పలితం అతి త్వరలో ప్రజలకు కనపడి చివరకు "పాస్ పొయ్యడానికూడా" పదిరూపాయలు ఇస్తే కాని పనికాని పరిస్తితులు వస్తాయి. అప్పుడు నా సామి రంగా ఈ అవినీతి ని ప్రజలు "నీతిగా" తరిమేస్తారు. మా "కల్కి" గారు అప్పుడు అందరికి దర్శనమిస్తాడు. కాబట్టి మనం ఎలాగు త్రుంచలేము. మన నాయకులకు,అదికారులకు సహాయపడి కనీసం దానిని పెంచుదాం. వాట్ డు యు సే?
No comments:
Post a Comment