Friday, November 16, 2012

"అపరచితుడు" గెటప్ కు "నోస్ట్రడామస్" చిత్రమే ప్రేరణా?!

                                                                     

  పైన ఉన్న చిత్రాన్ని చూస్తుంటే " అపరిచితుడు" సినిమాలో అపరిచితుడు గుర్తుకు వస్తున్నాడు కదూ! ఇది ప్రఖ్యాత భవిష్య దార్శనికుడు నోస్త్రాడామస్ దర్శించించిన రాబోయే కలికి అవతారం లేక ప్రపంచ విజేత చిత్రమట. బహూశా ఈ బొమ్మను ప్రేరణగా తీసుకునే అపరిచితుడు గెటప్ తయారు చేసి ఉంటారు.

 ఈ బొమ్మలో కనపడుతున్న దానిని బట్టి, రాబొYఏ అవతార పురుషుడికి కొన్నిటితో సంభందం ఉన్నట్టు అనిపిస్తుంది. అవి (1)సింహం (2)సూర్యుడు (3) మత సంబందం (4)నల్లని& ఎర్రని వస్త్రాలు (5)బవిష్యత్తు దర్శించి రాసే లెఖకుడు లెదా దేవదూత . వీటి గురించి వివరంగా తెలుసుకుందాము.

          పై చిత్రంలొని రూపం ప్రసిద్ద భవిష్య దార్శనికుడు నోస్ట్రడామస్ చిత్రించినది అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ బొమ్మ ద్వార  బవిష్యత్తు అవతార పురుషుడు ఎవరని నోస్ట్రాడామస్ చెప్పాడో తెలుసుకుందాము. సాదరణంగా నోస్ట్రాడామస్ చెప్పిన సెంచరీస్ అన్ని ఇంచుమించుగా నక్షత్ర మండలం, రాశులు స్తానం ద్వార మరుగు మాటలో చెప్పాఅడు. కాబట్టి ఆయన చిత్రించిన ఈ చిత్ర్రాన్ని కూడ ఆ బాషలోనే డీ కోడ్ చేద్దాం.

  ఈ బొమ్మలో నక్షత్ర రాశులకు సంబదించినవి (1)సింహం (2) మనిషి(కన్య).క్రింది 2 సింహాలు మద్యలో మనిషి ని కన్య సింహ రాసులకు ప్రతీకలుగా బావించవచ్చు.అలాగే పై నున్న సూర్యుడి బొమ్మ సూర్యుడు కి ప్రతీక కాగ, రెండొ ప్రక్కన్న ఉన్న దేవదూత బుదుడుకి ప్రతీకగా చెప్పవచ్చు.

  దీనిని బట్టి, కన్య,సింహ రాసులుకు, వాటికి  అదిపతులైన సూర్యుడు బుదులకు, రాబోయే అవాతార పురుషుడుకు తప్పకుండా సంబందం ఉందని నోస్ట్రడామస్ దర్శించాడు. అంటే ఖచ్చితంగా ఈ అవతార పురుషుడి జనన సమయంలో సూర్యుడు బుదుడు ఒకే రాసిలోఉండాలి.ఆ రాశి కూడ తప్పకుండ మార్పును సూచించే రాసి అయి ఉండాలి. ఒక లెఖ్క ప్రకారం రానున్నది "ఆక్వేరియన్ ఏజ్" అంటె "కుంభరాశి యుగం"అని కాలజ్ణులు చెపుతున్నారు.అలాంటప్పుడు భహుశా కుంభ రాశిలో రవి, బుదులు, ఉండగా జన్మించిన వాడై ఉండాలి.  పైగా మత పరమైన చిహ్నాలు చిత్రించడం ద్వార ఈ రాబోయే అవతారం తప్పక మత నాయకుడై ఉందాలని తెలుస్తుండి. ప్రపంచంలోని వివిద మతాలలో ఈ కన్య బుద రాశులుకు వారి దేవతలకు ఉన్న సంబందం ఎమిటొ రాబొయే టపాలలో వివరంగా తెలుసుకుందాము అంతవరకు (సశేషం) 

No comments:

Post a Comment