Wednesday, November 21, 2012

’కసబ్ వాదానికి’ "కల్కి వాదమే" కరెక్ట్ అయినది, మరియు చవకైనది.

                                                                     
అబ్బా! మొత్తానికి కసబ్ ని ఏసేసారు! ఉరి! ఇదంతా బాగానే ఉందిగాని ఈ  ధర్మ యుద్దం లో ఎవరు గెలిచారు "కసబా(ఉగ్రవాదం)? ప్రభుత్వమా(ప్రజాస్వామ్యం)? అనేది  సమీక్షించాల్సిన  అవసరం ఉంది.

కసబ్ వైపు లాభ, నష్టాలు:- వీళ్లెలాగు "ఆత్మాహుతి దళం" కాబట్టి  వీళ్ల ప్రాణాలకు విలువలేదు.ఒక వేళ ఉన్నా పదిమంది అనుకుంటా.కొంత ఆయుద సంపత్తి లక్షల్లో ఉంటుదేమో.  ఇది నష్టం. పోతే లాభం,ఏమిటంటే వాళ్ళ జాతికి "వీరులు" అన్న గౌరవం, ఒక పెద్ద దేశాన్ని వణికించామన్న త్రుప్తి,పది మందికి 166  ప్రాణాలు తీసామన్న పైశాచికానందం, ప్రంపంచస్తాయిలో  ఉనికి నిరూపణ.బారతీయ న్యాయ స్తానాలను అవహేళన చెయ్యడం(కసబ్ చేసింది},

ప్రభుత్వం వైపు లాభ, నష్టాలు:- మంచి సమర్దులైన పోలిస్ ఆఫిసర్లను కోల్పోవడం,166 మంది ప్రజలను కోల్పోవడం,నాలుగేండ్లు, విచారణ పేరుతో సుమారు ముప్పయి కోట్ల రూపాయలు ఖర్చు కావడం,  అయితే ఇక లాభం ఒకటే "ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించారు అని, దీనివెనుక "పాకిస్తాన్ వుంది" అనేది. ప్రపంచానికి చాటడం    

 ఏదైనా తీవ్రవాదానికి, తీవ్రవాదమే కరెఖ్టేమోఅనిపిస్తుంది. వాడిని ఆరోజే  ఖతం చేసి, ఉగ్రవాద తండాల మీద అమెరికా తరహాలో దెబ్బతీస్తే దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉండెవి.మన ప్రజలు శాంతమూర్తులు కాని మనదేవుళ్లు శాంతి మూర్తిత్వత్వం చెప్పలేదు. కరూణామయుడిని ఆరాదించే వాళ్లే శత్రు వినాశనం కొరకు అన్ని విదాల హింసను అమలు చేస్తుంటే మనకేమిటి ఈ దిక్కుమాలినతనం? కాబట్టి  కసబ్   వాదానికి’ "కల్కి వాదమే" కరెక్ట్ అయినది, మరియు  చవకైనది.  

No comments:

Post a Comment