Wednesday, November 28, 2012

కాబోయే"ఇంద్రుడు" శూద్రుడైన "బలి చక్రవర్తి" అంట!

                                                                         
ఇన్నాళ్లు ఈ దేశంలో దళితులు, తమను అగ్ర వర్ణాలవారు అణగద్రొక్కారని,బ్రాహ్మణ పక్షపాతి అయిన "మనువు" రాసిన "మనుస్మ్రుతి" మరియు ఇతర హిందూ మత గ్రంథాలు అన్ని కూడ అగ్రవర్ణాలకే పెద్దపీట వెయ్యడం వల్ల తాము నిమ్న కులాలుగా హీనస్తితిలో ఉండాల్శి వచ్చిందని బాదపడుతున్నారు కదా. వారికి ఒక శుభ వార్త. రాబోయే కాలంలో" ఇంద్ర పదవి" ని శూద్రుడైన "బలిచక్రవర్తి" అదిరోహిస్తాడటా! ఇది ఏ బౌద్ద గ్రంథమో, దళిత సాహిత్య గ్రంథాలో చెప్పింది కాదు. సాక్షాతు, హిందూ పవిత్ర గ్రంధమైన "విష్ణు పురాణంలోనే చెప్పబడిందట!కావాలంటే క్రింది రిఫరెన్స్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

  హిందూ బవిష్యపురాణం, విష్ణు పురాణం ప్రకారం మనకు 14 మంది "మనువులు" ఉంటారట. ఒక్కొక్క మనవు కాలాన్ని "మన్వంతరం" అంటారట.అలా 14మన్వంతరాలకు, 14 మంది మనువులే కాక, 14 మంది ఇంద్రులు కూడ ఉంటారట. ప్రతి  మన్వంతరంలో ఆ దేవదేవుడైన పరమాత్మ కూడ జన్మించి,తన దర్మాన్ని నెరవేర్చుతాడట. అలాగే ప్రతి మన్వంతరానికి"సప్తరుషులుగా" ఎవరు ఉంటారో కూడ నిర్ణయించబడింది. ఇలా ప్రతి మన్వంతారానికి వచ్చే మనువు పేరు,ఇంద్రుడి పేరు,పరమాత్మ పేరు,సప్తరుషుల పేర్లు, స్పష్టం గా తెలుపబడ్డాయి.ref:-http://en.wikipedia.org/wiki/Manvantara

  ఉదాహరణకి, ఇప్పుడు నదుస్తున్నది ఏడవ మన్వంతరం అయిన "వైవస్వత మన్వంతరం".ప్రస్తుత మనువు పేరు "వైవస్వతూడు". పరమాత్మ పేరు"వామనుడు".సప్త రుషులు "కశ్యపాది సప్త మునులు".ఇంద్రుడి పేరు "పురందరుడు"’పరమాత్మ అయిన వామనుడి తల్లితండ్రులు"కశ్యప,అదితి" దంపతులు.

  అలాగే రాబోయే 8 వ మన్వంతరం""సావర్ణి మన్వంతరం"లో కూడ ఎవరి పేర్లు ఏమిటొ స్పష్టం గా తెలుపబడ్డాయి.ఈ కాలంలో మనువు పేరు"సావర్ణి".ఇతడు సూర్యుని పోలికతో ఉంటాడని "సూర్య సావర్ణిక" అని కూడ అంటారు.పరమాత్మ పేరు "సార్వబౌమ".సప్తరుషులు "గాలవాది మహామునులు".ఇకపోతే ఇంద్రుడు"బలి చక్రవర్తి". ఇతనినే వామనావతారంలో విష్ణువు పాతాళానికి త్రొక్కివేసింది. పరమాత్మ అయిన "సార్వబౌమ" తల్లి తండ్రులు పేర్లు,"దేవగుహ్యుడు" మరియు"సరస్వతి".ref:http://en.wikipedia.org/wiki/Savarni_Manu

 కాబట్టి 8వ మనువు కాలంలో పాతాలానికి త్రొక్కివేసిన బలి చక్రవర్తే "ఇంద్ర" పదవి అలంకరిస్తున్నడంటే అంతకంటే కావాల్సిందేముంది మన దళితులకి. కాకపోతే బలిచక్రవర్తి ఎక్కడ వచ్చేస్తాడొనని కోంతమంది మూడ పంచాంగ గణికులు మన్వంతర కాలాన్ని,4320 సంవత్సరాలుకు కొన్ని సున్నాలు కలిపి లక్షల యేండ్లు చేసారు.ఎలాగు శూద్రులు ఈ పురాణాలు పట్టించుకోరు కాబట్టి వారు ఆ విదంగా చేయగలిగారు. కాని ఒక అంచనా ప్రకారాం ౭ వ మన్వంతరం కూడ  వచ్చే సంవత్సరం "రఠసప్తమి" నాటికి పూర్తి కావాలి. దీనికి "మాయా  యుగాంతానికి" చాల దగ్గరి సంబందం ఉండటం గమనార్హం.

 కాబట్టి "ఉందిలే మంచి కాలం ముందు,ముందునా,"శూద్రుడే దేవుడంట" నంద నందనా" అనుకుంటూ హాపీగా ఉందామా!    http://www.newworldencyclopedia.org/entry/Rakshasa 

7 comments:

  1. >కాబోయే"ఇంద్రుడు" శూద్రుడైన "బలి చక్రవర్తి" అంట!

    బలి శూద్రుడేమిటీ? ఆయన రాక్షసుడు. మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.

    > మూడ పంచాంగ గణికులు మన్వంతర కాలాన్ని,4320 సంవత్సరాలుకు కొన్ని సున్నాలు కలిపి లక్షల యేండ్లు చేసారు.

    మూఢత్వం మీదే, నిస్సందెహంగా.


    ReplyDelete
    Replies
    1. రాక్షసులు అంటే "బ్రహ్మ" పాదాల నుండి పుట్టినట్లు రామాయణంలో చెప్పారని ఒక చోట చదివాను. "బ్రహ్మ" పాదాల నుండి పుట్టింది శూద్రులని "మను దర్మం" చెప్పింది కాబట్టే నేను బలి చక్రవర్తి ని శూద్రుడు అని చెప్పటం జరిగింది. రుజువుగా టపాలో లంకె పెట్టాను.కాబట్టి ఎవరికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో "శ్యామలీయం" గారే చెప్పాలి.
      ఇకపోతే "మన్వంతరం" అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అని చదివాను.ఇప్పట్టికి ఆరు గడచి ఏడవది నడుస్తుందని,పురాణాలలో ఉందని మీ బోటి వారే చెపుతుంటే "మన హిందూ గ్రంథాలలోని సారాన్ని, ఎంతగా పండితులు నాశనం చేసారో ఏ మాత్రం చదువుకున్న వాడికైనా ఇట్టే అర్దమవుతుంది. అటువంటి పండిత పుత్రులని మూడులు అంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదు.దానిని ప్రక్షిప్తం చేసింది మీరు కాదుగా? అలా అయితే మన్వంతరం కాలాన్ని కొన్ని కోట్లు వత్సరాలు అని ఈ బూమండలం మీద చదువుకున్న వాడిని నమ్మించగలరా?

      "బాపలు రాసిన పంచాంగాలు కల్లలైపోవు, శూద్రులు చెప్పేదే నిజమయి నిలుచు" ఇది బ్రహ్మం గారి కాలజ్ణాన వాక్యాలు. నిజమవుతున్నాయి.!

      Delete
    2. మీరు మీ‌వ్యాసంలో ఉటంకించిన లింకులో "According to the Ramayana, rakshasas were created from Brahma's foot" అని ఉంది. అది అప్రమాణికం. రామాయణం వేదసమ్మితం - దానిలో అలా ఉండే అవకాశం లేదు. వేదపురాణేతిహాసాలలో సాంప్రదాయం చెప్పేది వేదమే‌ప్రామాణికమని. వేదంలో 'పద్భ్యాం శూద్రో‌అజాయత' అని ఉంది. శూద్రశబ్దానికి రాక్షసుడు అని అర్థం లేదు కాబట్టి మీరిచ్చిన లింకులోని అర్థం పై వేదవాక్యం ప్రకారం అసమంజసం. కాబట్టి బ్రహ్మ పాదాల నుండి పుట్టింది శూద్రులని మను దర్మం చెప్పింది కాబట్టే బలి చక్రవర్తి ని శూద్రుడు అని చెప్పటం సరియైన పథ్థతి కాదు.

      మీకు ఇట్టే అర్థమైపోయిన విషయాలలో తప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని మీరు భావించే అవకాశాలు లేకపోతే వాదించేందుకు యెవరికీ‌యేమీ లేదు.

      ఇకపోతే బ్రహ్మం గారు కడు ప్రసిథ్తయోగిపుంగవులు. వారు కాలజ్ణానం పేరుతో‌గ్రంధాన్ని వెలయించారని వినటమే కాని మనకు ప్రామాణికంగా స్పష్టంగా ఉన్న ఒక్క సుష్టుగ్రంధమూ‌లభించలేదు. బజారుల్లో‌ ఈ‌పేరుతో రకరకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. అనూచానంగా అనేకమంది వీధి గాయకులు బైరాగులు కాలజ్ణానం తత్వాలు పాడుతూ‌వస్తున్నారు కాని వాటికీ ఒక సుష్టురూపం లేదు. అయితే చీటికీ‌మాటికీ‌ కాలజ్ణానంలో ఇలా ఉండి అలాఉంది అనటమూ, వింతగా అనిపించిన వాటిని మనవాళ్ళు కాలజ్ణానజోస్యం క్రిందా, పాశ్చాతులు Nostradamus జోస్యం క్రిందా లెక్కలు వేయటం జరుగుతూ‌ఉంది. అంతే.

      Delete
  2. నేను ఎక్కడో చదివిన విషయం: బలి, ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుని కొడుకు. హిరణ్యకశ్యపుడు, దితి కశ్యపుల కుమారుడు.

    http://en.wikipedia.org/wiki/Mahabali
    http://en.wikipedia.org/wiki/Prahlada
    http://en.wikipedia.org/wiki/Hiranyakashipu

    ReplyDelete
    Replies
    1. అవును.

      కశ్యపుడు - హిరణ్యకశిపుడు - ప్రహ్లాదుడు - విరోచనుడు - బలి. ఇదీ వారి వంశక్రమం.
      ప్రహ్లాదునికి హరి ఇచ్చిన వరం ఆతని వంశం వారిని చంపనని.

      హిరణ్యకశ్యపుడు అని వ్రాయకూడదు. హిరణ్యకశిపుడు అనాలి.


      Delete
    2. n the Vaivasvata-manvantara, He (Avatara) is named Vamana


      The seventh Manu, who is the son of Vivasvan, is known as Sraddhadeva. He has ten sons, named Iksvaku, Nabhaga, Dhrsta, Saryati, Narisyanta, Nabhaga, Dista, Tarusa, Prsadhra and Vasuman. In this manvantara, or reign of Manu, among the demigods are the Adityas, Vasus, Rudras, Visvedevas, Maruts, Asvini-kumaras and Rbhus. The king of heaven, Indra, is known as Purandara, and the seven sages are known as Kasyapa, Atri, Vasistha, Visvamitra, Gautama, Jamadagni and Bharadvaja. During this period of Manu, Vishnu appears from the womb of Aditi in his incarnation as the son of Kasyapa.

      మరి విష్ణు అవతారమయిన, వామనుడు కూడ కశ్యప,అదితి కుమారులని ఉంది.అంటే బలి, వామనుడుకి మనవడా? తాతే మనవడిని పాతాళానికి త్రొక్కివేశాడా?

      Delete
  3. Bali chakravarthi ani manam sambodhisthunna purana ourushudu thaanu kshathriya dharma prakaram vamanunaku danam chesthanani thanaguruvyna sukracharyuni tho cheppinatlu puranaallo undaga aayana sudrudani ela cheppagaligaaro

    ReplyDelete