చాలా మంది ముఖ్యంగా ఈ నాటి తరంవారు "మత గ్రందాలలో" చెప్పిన అవతార పురుషులు వస్తారని ఈ కలి నుండి మనల్ని కాపాడతారని నమ్ము తుండక పోవచ్చు. ఎందుకంటే దేవతలు,రాక్షసులు అనేవారిని పురాణాలలో చదివి వాటిని ఒక " సోషియో ఫాంటసీగా" ఏన్జాయి చెయ్యడమే తప్ప వాటి వెనుక నున్న " బావాజాలాన్ని" గ్రహించలేక పోవడమే అని నా అభిమతం.
.పౌరాణిక పాత్రలైన "హిరణ్యాక్షుడు,హిరణ్య కశిపుడు, రావణుడు" అందరూ బౌతిక వాదులే అయి నప్పట్టికి అచంచల శివభక్తులు,రావణాశురిడి కాలంలో గాలి ఎంత కావాలి అంటే,అంత మాత్రమే వీచేదట . అలాగే ఆన్ని ప్రక్రుతి శక్తుల మీద "రావణ బ్రహ్మ" కు పట్టు ఉండేదని చెపుతుంటారు. దీని వలన వారు బౌతిక సుఖాలకు ప్రాదాన్యత ఇచ్చారని తెలుస్తుంది. రామ రాజ్యం కంటె రావణ రాజ్యం ఒక పద్దతి ప్రకారమ్ ఏలబడింది. దేవతలు కంటె "రాక్షసులు బలవంతులని సమర్దులని ఎన్నోసార్లు రుజువయింది.అయినా వీరు "దైవ క్రుపకు" ముఖ్యంగా "స్తితి కారుడైన" విష్నుమూర్తికి శత్రువులుగా గుర్తించబడి ఆయనచే సంహరించ బడ్డారు. మహా దేవుడి ప్రాపకం ఉన్నా,వీరి నాశన్నాన్ని అది నిరోదించ లేక పోయింది. ఇంకొక గమ్మయితైన విషయం ఏమిటంటే దేవతలు, రాక్షసులు ఇరువురూ ఒక తండ్రి బిడ్డలే. తల్లులే వేరు. ఏమిటిదంతా! ఇలా ఎందుకు పురాణాలలో రాసారు. ఒక వేళ ఇది కేవలం విష్ణు బక్తులు, శివ బక్తుల మీద రాసిన ద్వేషపూరిత రచనలే అయితే, శివబక్తులు, రావణబ్రహ్మ ని హీరో గా చూపిస్తూ కౌంటర్ రచనలు చేయాలిగా? అలా చేయలేదు ఎందుకని? రామాయణంలోనే రావణుడి గొప్పతనం కూడ చెప్పటం జరిగింది కదా!కాబట్టి ఇవి కేవల ద్వేషపూరిత రచనలు కావు. అప్పట్టి రాజులను, పాలనా విదానాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కల్పనలు జోడించి రాసిన చరిత్రలే కావచ్చు,
సైన్స్ "బౌతిక" ప్రపంచాన్ని నిర్మిస్తుంటే, మతం, నైతికతో కూడిన "మానసిక ప్రపంచాన్ని" నిర్మిస్తుంది.ఈ రెంటి మద్య సమన్వయం ఉండటం అవసరం."బౌతిక ప్రపంచ వాదులు" "రాక్షసులు గాను, "మానసిక ప్రపంచ వాదులు" దేవతలగాను అభివర్ణించబడినప్పటికి,ఇరువురూ మనుష్యుల ఆలోచనా విదానాలకు ప్రతీకలే తప్ప ఆటువంటి వారు జీవ పరిణామ క్రమంలో ఉన్నారనడానికి ఈ నాటి వరకు ఆదారాలు లేవు.
ప్రక్రుతిలో సకల జీవజాలం వర్దిల్లడానికి "మానసిక వాదం" తోడ్పడితే,కేవలం మానవుడి వికాసానికి మాత్రమే "బౌతిక వాదం" తోడ్పడుతుంది. ఈ స్రుష్టీ దర్మం "మానసిక వాదానికే అనుకూలం కాబట్టి ప్రతీకగా "భగవంతుడు,అవతారమూర్తులు" వచ్చారు.ఇంచుమించుగా అన్ని మతాల లోని సారాంశం ఇదే ఉద్బోదిస్తుంది. హిందూ అవతార మూర్తులు ఎప్పుడూ,"ఏ నాడైతే బౌతిక వాదం వెర్రితలలు వేసి, ప్రక్రుతి వినాశనానికి కారణమవుతుందో అప్పుడు ఉద్బవిస్తారు
.ఒకానొక సిద్దాంతం ప్రకారం ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి "కార్యా కారణ" సంబందం "ఉండి తీరుతుంది.పాలు పొంగితే పొయ్యి ఆరిపోవాలి. లేక పోతే పాలన్ని ఆవిరైపోతయి. కాబట్టి మనం మంట తగ్గిస్తాము. ఇదే సూత్రం ప్రక్రుతి నియమాల్కు వర్తిస్తుంది. బౌతిక సుఖాల మోజులో స్వార్దపూరితమయిన మనిషి చర్యలు సకల జీవజాలానికి వినాశకంగా పరిణమిస్తే, దానిని ప్రక్రుతి ఆపి.తీరుతుంది. అది మానవ చర్యల రూపంలో ఉంటుంది. అలా ఆపేవాడే "కల్కి".ఒక వేళ అలా ఆపకపోతే "ప్రళయం" రూపంలో మన పతనం తప్పదు. అందుకే నేను ఇంత గట్టిగా విస్వశిస్తుంది."కల్కి" రావడం ఖాయం లేకుంటే మనం పోవడం ఖాయం.