Saturday, November 17, 2012

అయ్యలారా! అమ్మలారా! వినండహో! మహమద్ ప్రవక్తే కల్కి అవతారమట!

                                                                   
                                      
 అదండి సంగతి! క్రిష్టియన్లు యేసు ప్రభువే కల్కి అవతార మంటుంటె మేమేమి తక్కువ తిన్నాం, అన్నట్లు ముస్లింలలో కొంతమంది "మహమద్ ప్రవక్తే భూమి మీద జన్మించిన చివరి అవతారం కాబట్టి ’కల్కి ’అంటే ఎవరో కాదు సాక్షాత్తు "మహమద్ ప్రవక్తే" అని బల్ల గుద్ది వాదిస్తున్నారు.దీనిని నిరూపించటానికి కల్కిపురాణం,శ్రిమద్బాగవతం,భవిష్య పురాణాలలో చెప్పిన భవిష్యాలు తమ ప్రవక్త కు సరిగ్గా సరిపోయాయి అని  మురిసి పోతున్నారు . వాటిలో మచ్చుకు కొన్ని:--

కల్కి పుట్టేది  "శంబళ" అనే ప్రాంతం:- శంభళ అంటే "ప్రశాంతమయిన  ప్రాంతం" అని అర్థమటా !. మహమద్ పుట్టిన "దారు సలేం" అన్నా అదే అర్థమట!.

కల్కి తండ్రి పేరు "విష్ణు  యశుడు" అంటే "దైవ సేవకుడు" అని అర్థమట! ప్రవక్త తండ్రి "అబ్దుల్లా" పేరులోని అర్థం కూడ అదేనటా!

కల్కి తల్లి పేరు " సుమతి" అంటే"శాంతి దూత"అటా! ప్రవక్త తల్లి అమీనా అన్నా అదే అర్థమట!

 ఇలా చెప్పుకుంతూ పోతే చాట బారతమ్ అయ్యేటట్లుంది! కాబట్టి సంబందిత లంకె ను ఇస్తున్నాను క్లిక్ చేసి చూడగలరు.

ఏతా వాతా చెప్పేది ఏమిటంటే హిందువుల కన్నా హిందూ బవిష్య పురాణాల మీద ఇతర మతస్తులకే ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది. అందుకే వారు మా ప్రవక్త కల్కి అంటే, మా ప్రవక్త కల్కి అని తెగ ఊదేస్తుంటె, ఈ హిందువులేమో ,ఎప్పుడొ కొన్ని లక్షల యేండ్లకు గాని కల్కి పుట్టడు అని హాయిగా కాలంవెళ్లదీస్తున్నారు.

కాని నేనైతే కల్కి ఈ సంవత్సరం చివరికల్లా వస్తాడని ఎందుకో మహా నమ్మకంగా ఉంది.చూద్దాం ఏమి జరుగుద్దో!     

(http://www.islamicvoice.com/november.97/OURD.HTM)

జగనే, కల్కి అవతారమా!?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html

( పూర్తి టపా కోసం లంకె ను క్లిక్ చెయ్యండి) 

Friday, November 16, 2012

"జగన్"గారి "లోటస్ పాండ్ మహల్" కి "కల్కి"కి ఉన్న సంబందం ఏమిటో తెలుసా?

                                                                    
ఇదే లోటస్ పాండ్ మహల్


 హైదరాబాద్ నగరంలో ఉన్న నివాస గ్రుహాలలో అతి పెద్ద గ్రుహం ఎవరిదో తెలుసా? ఇంకెవరిది! రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక పుత్రుడు,వై.యస్.అర్ పార్టీ అద్యక్షులు  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి "లోటస్ పాండ్".కొన్ని కోట్ల విలువ చేసే ఈ మహల్ కి ఈ పేరు ఎందుకు పెట్టారో? ఎవరు చెపితే పెట్టారో తెలియదు కాని, ఈ పెరుకు రాబోయే అవతార పురుషుడైన "కల్కి" పేరుకు సంబందం ఉంది.
                                                                      
ముందుగా "కల్కి" అంటే ఏమిటో తెలుసుకుందాం. "కల్క" అంటే ’మట్టి’ లేక ’బురద’ అనే అర్థం ఉంది. కాబట్టి "కల్కి" అంటే బుర్దలోనుంచి పుట్టినది "కమలం" లేక "తామర పుష్పం". అని అర్ఠమట.కాబట్టి కల్కి అవతార పురుషుడికి ఈ తామర పువ్వుకి ఏదో బలీయమైన సంబందం ఉండి తీరాలి.అందుకే బవిష్య కారులు పురాణాలలో నిగూడంగా" కల్కి" అనే నామంతో రాబోయే అవతార పురుషుడి జననం గురించి చెప్పి ఉంటారు.
                                                                    
 ఇప్పుడు ఆసక్తికరమఈన అంశం ఏమిటంటే "జగన్’ గారే కల్కి అవతారమా? ఇది ద్రుష్టిలో పెట్టుకునే ఈ మద్య కొంత మంది "యేసుక్రీస్తే" రాబోయే "కల్కి" అని ప్రచారం మొదలు పెట్టారా?అలా అయితే నెను ఇంతకు ముందు  టపాలలో చెప్పినట్టు, ఏసుక్రీస్తు,జాతక చక్రంలో ఉన్నట్ట్లు ఈయన జాతక చక్రంలో కూడ "రవి, బుదులు"ఒకే రాసిలో ఉన్నారా? లేదా? అనేది తరవాతి టపాలలో చూదాం.కల్కి కి నేను పైన చెప్పిన అర్థం కొర్కు నెను క్రింది లంకె ను ఆదారంగా తీసుకుని చెప్పాను.వివరాలు  కావాలంటే లంకె ను క్లిక్ చెయ్యగలరు.(సశేషం)
http://en.wikipedia.org/wiki/Kalki_Purana
http://www.deccanchronicle.com/tabloid/hyderabad/jagan%E2%80%99s-lotus-mahal-biggest-house-town-695








"అపరచితుడు" గెటప్ కు "నోస్ట్రడామస్" చిత్రమే ప్రేరణా?!

                                                                     

  పైన ఉన్న చిత్రాన్ని చూస్తుంటే " అపరిచితుడు" సినిమాలో అపరిచితుడు గుర్తుకు వస్తున్నాడు కదూ! ఇది ప్రఖ్యాత భవిష్య దార్శనికుడు నోస్త్రాడామస్ దర్శించించిన రాబోయే కలికి అవతారం లేక ప్రపంచ విజేత చిత్రమట. బహూశా ఈ బొమ్మను ప్రేరణగా తీసుకునే అపరిచితుడు గెటప్ తయారు చేసి ఉంటారు.

 ఈ బొమ్మలో కనపడుతున్న దానిని బట్టి, రాబొYఏ అవతార పురుషుడికి కొన్నిటితో సంభందం ఉన్నట్టు అనిపిస్తుంది. అవి (1)సింహం (2)సూర్యుడు (3) మత సంబందం (4)నల్లని& ఎర్రని వస్త్రాలు (5)బవిష్యత్తు దర్శించి రాసే లెఖకుడు లెదా దేవదూత . వీటి గురించి వివరంగా తెలుసుకుందాము.

          పై చిత్రంలొని రూపం ప్రసిద్ద భవిష్య దార్శనికుడు నోస్ట్రడామస్ చిత్రించినది అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ బొమ్మ ద్వార  బవిష్యత్తు అవతార పురుషుడు ఎవరని నోస్ట్రాడామస్ చెప్పాడో తెలుసుకుందాము. సాదరణంగా నోస్ట్రాడామస్ చెప్పిన సెంచరీస్ అన్ని ఇంచుమించుగా నక్షత్ర మండలం, రాశులు స్తానం ద్వార మరుగు మాటలో చెప్పాఅడు. కాబట్టి ఆయన చిత్రించిన ఈ చిత్ర్రాన్ని కూడ ఆ బాషలోనే డీ కోడ్ చేద్దాం.

  ఈ బొమ్మలో నక్షత్ర రాశులకు సంబదించినవి (1)సింహం (2) మనిషి(కన్య).క్రింది 2 సింహాలు మద్యలో మనిషి ని కన్య సింహ రాసులకు ప్రతీకలుగా బావించవచ్చు.అలాగే పై నున్న సూర్యుడి బొమ్మ సూర్యుడు కి ప్రతీక కాగ, రెండొ ప్రక్కన్న ఉన్న దేవదూత బుదుడుకి ప్రతీకగా చెప్పవచ్చు.

  దీనిని బట్టి, కన్య,సింహ రాసులుకు, వాటికి  అదిపతులైన సూర్యుడు బుదులకు, రాబోయే అవాతార పురుషుడుకు తప్పకుండా సంబందం ఉందని నోస్ట్రడామస్ దర్శించాడు. అంటే ఖచ్చితంగా ఈ అవతార పురుషుడి జనన సమయంలో సూర్యుడు బుదుడు ఒకే రాసిలోఉండాలి.ఆ రాశి కూడ తప్పకుండ మార్పును సూచించే రాసి అయి ఉండాలి. ఒక లెఖ్క ప్రకారం రానున్నది "ఆక్వేరియన్ ఏజ్" అంటె "కుంభరాశి యుగం"అని కాలజ్ణులు చెపుతున్నారు.అలాంటప్పుడు భహుశా కుంభ రాశిలో రవి, బుదులు, ఉండగా జన్మించిన వాడై ఉండాలి.  పైగా మత పరమైన చిహ్నాలు చిత్రించడం ద్వార ఈ రాబోయే అవతారం తప్పక మత నాయకుడై ఉందాలని తెలుస్తుండి. ప్రపంచంలోని వివిద మతాలలో ఈ కన్య బుద రాశులుకు వారి దేవతలకు ఉన్న సంబందం ఎమిటొ రాబొయే టపాలలో వివరంగా తెలుసుకుందాము అంతవరకు (సశేషం) 

Thursday, November 15, 2012

’స్త్రీ’,’పురుషుడు’కావడమనేది యుగాంతానికి గుర్తు అంటా!

!
కాలజ్ణానం లో వీర బ్రహ్మం గారు చెప్పిన "కలియుగ వింతల జాబితాలో" స్త్రీ పురుషుడుగా మారడం కూడా ఒకటి. ఇది యుగాంతానికి గుర్తు గా కూడా ఆయన అభివర్ణించాడు. సాదరణంగా బ్రహ్మంగారి కాలం నాటికి స్త్రీలను పురుషులుగా మార్చే టెక్నాలజి రాలేదు.ఈ రోజుల్లో కూడా పురుషులను స్త్రీలుగా మారుస్తున్నారు కాని, స్త్రీలను, పురుషులుగా మార్చినట్టు ఎక్కాడా జరుగలేదనుకుంటా.మరి ఆ రోజులలోనే బ్రహ్మం గారు ఈ విషయాన్ని చెప్పడమనేది ఊహ కందని విషయం.

                                                           

 బ్రహ్మం గారు చెప్పిన బవిష్యం నిజమైంది.ఈ మద్య "పింకి ప్రామాణిక్" అనే క్రీడాకారిణిని ఒక మహిళను రేప్ చేసిన కేసులో అరెస్ట్  చేసారు పోలిస్లు. ఈమే మన దేశం తరపున ఏసియన్ గేమ్స్ లో ఆడింది.అప్పుడు ప్రపంచం అంతా ఈమెను స్త్రీ గానే గుర్తించింది.కాని విచిత్రంగా అమే ఈ సంవత్సరమ్ జూన్ లో రేప్ అభియోగం మీద అరెస్ట్ అయింది. మూడు  రోజుల క్రితమె ఆమే మీద చార్జ్ షీట్ దాఖలు చేసారు.డాక్టర్లు ఇచ్చిన రీపోర్ట్ లో అమే పురుషుడెనని తేల్చారట!.ఎంత ఆశ్చర్యం! ఇన్నాళ్లు లోకమంతా స్త్రీ అని నమ్మిన వ్యక్తి, పురుషుడు గా డాఖ్టర్ల చేత నిర్దారింపబడటం!

దీని వల్ల మనం అనుకోవచ్చన్న మాట! యుగాంతం వచ్చేసిందని! అవును కదా మరి డిసెంబర్ 21 వ తారీకు ఇంకెన్ని రోజులుంది?అతి త్వరలోనే కదా. మనమంతా వీర భోగవసంత రాయలుని చూడొచ్చన్న మాట!హుర్రే!
 "పింకి ప్రామాణిక్" గురీంచి పూర్తి సమాచారం కావాల్సిన వారు ఈ లంకె మీద క్లిక్ చెయ్యగలరు.   
 (http://en.wikipedia.org/wiki/Pinki_Pramanik)   

ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post.htmlపూర్తిటపా కోసం లంకె మీద క్లిక్ చెయ్యండి

Wednesday, November 14, 2012

బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_14.html
పూర్టి టపా కోసం లంకె మీద క్లిక్ చెయ్యండి

మీకు తెలుసా? "బాలదేవత శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

ఎవరు ఏపని చేసినా స్వార్థమో, పరమార్థమో ఏదో ఒకటి ఉంటుంది.మన రాష్ట్రంలో టిబెట్ బౌద్ద గురువు "దలైలామా"పంపగా వచ్చిన దైవదూత, బాల దేవత "శాంబవి" ఎందుకు ఆంద్ర ప్రదేష్ లోని"సూర్య నంది" అనే ప్రాంతానికి వచ్చి హడావుడి చెయ్యడం వెనుక, బ్రహ్మం గారి కాలజ్ణానం,మరియు బౌద్ద గ్రంథాలలో ఉన్న బవిష్య వచనాల ఆదారంగా,దలైలామా గారు ఇచ్చిన ప్రోద్బలం ఉందని మీకు తెలుసా? తెలియకపోతే పూర్తి వివరాల కోసం ఈ  లంకె మీద క్లిక్ చెయ్యండి! http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_11.html

Sunday, November 11, 2012

మీకు తెలుసా? "బాల శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

మీకు తెలుసా? "బాల శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

 మీకు గుర్తుండె ఉంటుంది ఆ మద్య బాల దేవత శాంబవిని, ఆమె తల్లి అనబడే ఉషా రాణి తీసుకు వచ్చి,"సూర్య నంది" వద్ద ఒక ఆశ్రమం కట్టాలని ప్రయత్నించడం,వారు చేసిన హల్ చల్ కి వీపరీతమైన పబ్లిసిటి వచ్చి,చివరకు ఈ రాష్ట్రంలోని,కొంతమంది బాల హక్కుల పరిరక్షణ వాదులు చూపిన అత్యుత్సాహంతో, వారు ఈ రాష్ట్రం వదలి వెళ్లడం,వగైరా,వగైరా.
  ఎంతవర్కు ఆ ఆమ్మాయి జీవితం ఏదొ నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారే కాని,అసలు ఆ అమ్మాయి ప్రపంచం అంతా వదలిపెట్టి కేవలం మన తెలుగు ప్రాంతమైన "సూర్య నంది" కే ఎందుకు వచ్చింది? ప్రంపచ ప్రస్సిద్ద బౌద్ద గుర్వు "దలైలామా" గారూ ఆమేను ఇక్కడకు పంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?అని ఆలోచించారా? లేదు.ఈరాష్ట్రంలో లక్షలాది మంది బాలల జీవితాలు నాశన మవుతుంటే పట్టిచ్చుకోలేరు కాని "ఒక ’ప్రత్యేక  పని’మీద వాచ్చిన వాళ్లను మాత్రం నానా యాగి చేసి పంపారు.ఆ తర్వాత వాళ్లటు,వీళ్లిటు అంతే!

   మీకు తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ణానంమరియుప్రసిద్ద బౌద్ద గ్రంథాలలో , రానున్న అవతార పురుషుడు ఈ రాష్ట్రం నుంచే వస్తాడని బవిష్య వాణి రాసుందని?!."సూర్యుని యందు ఉద్బవం అవుతాడని"రాయబడిన ఆ గ్రంథాలలోని వ్యాక్యల ఆదారంగానే "దలైలామా" తన శిష్యురాలైనా శాంభవిని సూర్య నంది అనే ప్రాంతంలో అవతార పురుషుడు వస్తున్నాడని,ఆయన వల్ల టిబెట్ విమోచన జరుగనుందని ప్రకటించాల్శిందిగా దైవ దూత గా ఉషా రాణిని తోడిచ్చి పంపారు.             
                                                      

 ఆమే రాను వచ్చింది ,వచ్చే జనవరి లోపు "వీర బోగ వసంత రాయలు" వస్తాడని చెప్పటం జరిగింది,అందరికి తెలియ చెప్పి తాను వెళ్లి పోవటం జరిగింది.ఇప్పటికి వాళ్ళ నమ్మకం ప్రకారం మన రాష్ట్రం నుంచే అవతార పురుషుడు జనవరి లోపు పకటితమవుటాడని ఎదురు చూస్తున్నారంట! మరి సూర్య నంది ప్రాంతానికే ఎందుకు వచ్చారంటే " సూర్యుని యందు ఉద్బవం" అనే మాటను భవిష్యకారులు పొరపాటు గా అర్థం చేసుకుని "సూర్య నంది" ప్రాంతం  అనుకుని ఇక్కడకు పంపించి ప్రచారం చేసారు.
            వారి నిర్దేశిత కార్యక్రమం ఏమిటంటే ,"దలైలామా" గారు కూడా "సూర్య నంది" ప్రాంతాన్ని సందర్సించి "శాంబవి" ని ఆశిర్వదించి,ఆమె ద్వారా "వీరభొగ వసంత రాయుడి" అగమనాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియపరచడం.కాని గమ్మతు ఏమిటంటే ఈ రాష్ట్రంలో బౌద్ద మతాన్ని అభిమానించే వారే వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. అందుకే వీరి హడావుడి చూసి "దలైలామా" తన సూర్యనంది"సందర్శన మానుకున్నారు.ఉషా రాణి శాంబవి తో సహా "దర్మ సాల"కు వెళ్లి పోవటం జరిగింది.  

  మరి ఇంతకు వారు నమ్మి ప్రచారం చేసినది జరుగుతుందా? జరగదా? తెలుసుకోవాలని కుతుహలంగా ఉన్నారా? ఈ బ్లాగును అనుసరించండి,మీకు చెపుతాను.మరి నాకు కూడా, పరిశోదించటానికి సమయం కావాలి కదా!
                                                              

                                       

Thursday, November 1, 2012

ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?

                                                                    
                                                                       
గత కొన్ని సంవత్సరాలుగా కొంత మంది  విదేశి భవిష్యకారులు యేసు ప్రభువే కల్కి అవతారంగా వస్తాడని భవిష్యత్ గ్రందాలలో ఉన్నదని ప్రచారం చేస్తున్నారు.( గూగుల్ శొదన ద్వారా ఎవరైనా ఇటువంటి ప్రచారపు రాతలను చూడవచ్చుhttp://www.prophet666.com/2009/07/bible-prophecy-on-kalki-avatar.html#comment-form_5890978538720982908)    .  అయితే అసలు బవిష్య యుగపురుషుడుకి , జీసస్ క్రైస్ట్ కి  ఉన్న సంభందం ఏమిటి? కేవలం తమ మత ప్రవక్త మీద ఆరాదనతో ఇలా చెపుతున్నారా? అలా అయితే వారు ఖచ్చితంగా కల్కి అవతార జననం కరక్టే అని నమ్మితేనే కదా! యేసు క్రీస్తే కల్కి అని ప్రకటించ బూనటం. ఇవన్ని ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు. దీని గూర్చి విశ్లేషిస్తాను. ఆలోచించండి.


  యేసు క్రీస్తు జనన తేది  గురించి కూడ వివాదాలు ఉన్నప్పటికి అధిక ప్రజలు ఆమోదించిన అదికారిక సమాచారం ప్రకారం "క్రిస్టమస్" గా నేడు జరుపుతున్నది ఆయన జన్మ దినమే. ఆయన జన్మ సమయాని అనుసరించి ఆయన జాతక చక్రం ఈ విదంగా ఉంది( దీనిని వికిపీడియా ద్వారా సేకరించడమైనది) http://en.wikipedia.org/wiki/File:Horoscope-Christ.jpg#filehistory


                                                                        File:Horoscope-Christ.jpg

         పై రాశి చక్రం ప్రకారం యెసు క్రీస్తు జన్మించే సమయానికి  రవి(సూర్యుడు), బుదులు ఒకే రాశిలో ఉన్నారు.అదే మకర రాశిలో ఉన్నట్లు మనం చిత్రంలో చూడవచ్చు. నేను ముందు టపాలో రాబొయే యుగ పురుషుడు  నోస్ట్రాడామస్ చిత్రం ప్రకారం తప్పకుండా రవి బుదులు ఒకె రాశిలో ఉండగా జన్మించిన వాడై ఉంటాడు అని వివరంగా చెప్పటం జరిగింది.కావాలంటె ఈ లింక్ మీద క్లిక్ చేసి పూర్తి టపాను చదవగలరు.(నేను ఆ టపా రాసే సమయానికి యేసు క్రీస్తు జన్మ చక్రం చూడలేదు.ఇది నిజం.)  http://kalkiavataar.blogspot.in/2012/10/2.html


   కాభట్టి యెస్తు క్రీస్తు జననంలోను, రాబోయే యుగపుర్య్షుడి జననంలోను రవి బుదులు ఇరువురు ఏక రాశిలో ఉండటం అనే పోలిక వలన "క్రీస్తు రెండవ రాకడ" కల్కి అవతారమని పైన చెప్పిన వారు ప్రతిపాదించి యుండవచ్చు. నోస్త్రాడామస్ కూడ ఆ విదంగానే దర్శించడమో, ఊహించడమో చేసి ఉండవచ్చు. అదే నిజమైతే కల్కి అవతారం కూడ ఇదే గ్రహచారం (రవి, బుదులు) కలిగి ఉండాలి కథా! ఉందా చూదాం, రాబోయే టపాలలో.(నేను రాస్తున్న టపాలన్ని అప్పటి కఫ్ఫుడు సేకరించిన సమాచారం ఆదారంగా రాస్తున్నవే.అందు చేత ఎప్పటి దప్పుడు టపాగా పెట్టడం జరుగుతుంది.డీనిని ఆశు పరిశోదనగా బావించవచ్చు.నేను ఇటు వంటి పరిశోదనకు పూనుకోవడం ఆ దైవ సంకల్పం లో బాగమనుకుంటా)