మొన్నట్టి దాక తమకు చెప్పకుండా హఠాత్తుగా "రాష్ట్ర విభజన ' నిర్ణయం తీసుకోవడమేమిటని దీర్గాలు తీసారు. ఒక వేళ రాష్ట్రం ఏర్పాటు చెస్తే రెండు ప్రాంతాలిక్ "సమ న్యాయం" చేయాలన్నారు. డెబ్బై రోజులకు పైగా సమ్మె చేయించారు. సాక్షాతూ ముఖ్యమంత్రి గారు రెండు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపించాకే విభజన పై ముందుకు కదలాలి అనటమే కాక భారత రాష్ట్ర పతి గారికి అధికారిక లేఖ రాశారు. అయన గారీ సూచనలకు తల ఒగ్గిన కేంద్ర ప్రభుత్వం మళ్లి అఖిల పక్షం మీటింగ్ కు రమ్మని రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు అన్నింటిక్ కబురు పంపింది.
ఇక ఇప్పుడేమో అఖిల పక్ష మీటింగ్ కు వెళితే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని కొత్త రాగం అందుకుని దానికి వెళ్ళేది లేదని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాష్ట్రం లో T.D.P. , కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రాంతాలలో పట్టు ఉన్న పార్టిలు కాబట్టి వారు గోడ మీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారు. అసలు పార్టీల నుంచి ఒకే అభిప్రాయం చెప్పాలని రూలేమన్నా ఉందా ? లేదు కదా ! మరి అఖిల పక్షం మీటింగ్ కు రెండు ప్రాంతాల ప్రతినిధులు హాజరయి అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కాదు, రెండు ప్రాంతాల ప్రజల అభి ప్రాయలు తెలియచేయల్సిన గురుతరమైన బాద్యత రాజకీయ పార్టీల మీద ఉంది. రెండు ప్రాంతాల అభిప్రాయాలు విన్న తర్వాత కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా , దానికి రాజ్యంగా బద్దత ఉంటుంది కాబట్టి ఎవరూ చేయగలిగేది ఏమి ఉండక పోవచ్చు. మరి అలా ఒక పద్దతి ప్రకారం నడచే అవకాశం వచ్చినపుడు ఆ అవకాశాన్ని చేజార్చుకోవడం ఎందుకు?
అసలు ప్రజల మనో బావాలను తెలియచెప్పలేక నిత్యం అయోమయానిక్ గురయ్యే ఈ అవకాశవాద పార్టిలు తెలుగు ప్రజలకి అవసరమా? ఆలోచించండి?
No comments:
Post a Comment