Monday, November 11, 2013

"క్షీర సాగర 'మదన'o " సూత్రం ఫేస్ బుక్ పరిచయాలకు వర్తిస్తుంది!

                                                

ఈ  మద్య ఫేస్ బుక్  ఖాతాదారులు అయిన కొంత మంది స్త్రీలు   మిత్రుల సమావేశం లో తమ బాదతో కూడిన అభి ప్రాయాలు  వెలి బుచ్చారు. వారి ఆవేదనలో అర్దం ఉంది. వారి మాటల ప్రకారం తమ కంటే ఎంతో చిన్న వారు అయిన మగపిల్లలు  , అందులో తమ పిల్లలు వయసు ఉన్న వారు కూడా  తమకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపమని వత్తిడి తెస్తుంటారట. అలా ఒకరు  పోనీలే ఎంతో ఇదిగా అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ కురాడినిమ్ ప్రెండ్ గా ఆడ్  చేసి వాడి పోస్టింగ్ లు చూస్తె మైండ్ బ్లాంక్ అయినంత పని అయిందట. ఆ విషయ్యాన్ని ఆవిడ గారు చెపుతూ , అలా చేయవద్దని ప్రాదేయపడే దోరణిలో కోరుతుంటే నాకు ఆమె అమాయకత్వానికి జాలి వేసింది.

   పేస్ బుక్ ని మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం స్నేహితులుగా ఎంచుకో బోతున్న వారు ఏ దృష్టితో వాడుతున్నారు అనేదే ప్రధానం. పేస్ బుక్ లో ఒక్కప్పుడు కంటే ఇప్పుడు కొంత పరిపక్వత చెందిన వారు ఖాతా దారులుగా ఎక్కువుగా చేరుతున్నప్పటికి కుర్ర కారు మత్రం దానిని ఇంకా తమ లోని వికారాలు ప్రదర్శించ దానికే వినియోగిఒస్తున్నారు అని చెప్పక తప్పదు. ఈ  పేస్ బుక్ విషయం లో "క్షీర సాగర మదనo సూత్రం " వర్తిస్తుందని ఎందుకు అంటున్నాను అంటే దానికి దీనికి కొంత పోలిక ఉంది . అదేమిటంటే:-

   "పూర్వం దేవతలు ,రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. అజరామరులు గా  ఉండడానికి  ఇరు వర్గాలకు "అమృతం " అవసరం కాబట్టి , ఒక అవగాహనా మేరకు మందర పర్వతాన్ని కవ్వం గా, వాసుకి ని తాడు గా చేసి పాల కడలిని మదించడం మొదలు పెట్టారు. అప్పుడు ముందుగా ఉద్బవించింది "హాలా హలం" అంటే విషం . దాని దెబ్బకు ముల్లోకాలు తల్లడిల్లాయట . దానిని స్వీకరించడానికి ఎవరికీ శక్తి లేదు. స్వికరిమ్చక పోతే  సాగర మదనం కుదరదు. అప్పుడు మహా దేవుడైన శివుడు ఆ గరళాన్ని తను మింగి అది లోపలకు పోకుండా కంఠం లోనే దాచుకుని గరళ కఠుండైనాదు.  అ విదంగా క్షీర సాగర మదనం కోన సాగించి అమృతాన్ని సాదిస్తారు దేవ దానవులు . ఆ తర్వాతి కద మనకు అవసరం లేదు.

    ఈ  కదను నేను ఎందుకు పేస్ బుక్ తో పోల్ఛానంటే ఒక మంచి  కోసం ముందుకు పోతున్నపుడు ముందుగా ఎదురయ్యేది చెడే కావచ్చు . కానీ దానిని అదిగమిస్తేనే మంచి అనేది దొరకదు. ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపేన్ చేసే వారిలో చాలా మంది తమ ఒరిజినల్ పోటోలు కానీ , అడ్రెస్ కానీ ఇవ్వరు. ఆడపిల్లలు అయితే సరే. కానీ మగపిల్లలు కూడా  ఆడపిల్లల పేరుతో అకౌంట్ లు ఓపెన్ చేసి ఆడపిల్లలతో స్నేహాలు కలిపి చాటింగ్ లు చేస్తూ ఉంటారు. ఇది లేని పోని వ్యవహారాలకు దారి తీసి  తమ జీవితాలు నాశనం చేసుకున్న వారి గురించి పేపర్లలో చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి వారి అకౌంట్ ల పట్ల జాగర్త గా ఉంటే, ఫేస్ బుక్ విషయ సేకరణకు, సామజిక అవగాహనకు బాగా పనికి వస్తుంది. ప్రజల  అభిప్ర్రాయాలు తెలుసుకోవడానికి సామాజిక వెబ్సైట్లు ను ప్రభుత్వ వర్గాలు ఉపయోగించడం గమనార్హం.మీ బావాలను , మీ లోని నైపుణ్యాలను పది మందితో పంచుకుని , మీ విషయ పరిదిని పెంచుకోవడానికి , మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది తప్పకుండా పనికి వస్తుంది. కాకపొతే దానిలో ఉన్న రాక్షసుల అకౌంట్ లను పట్టించుకోకుండా , ఎవరి అకౌంట్ అయినా కొంత కాలం పరిశీలించాకే వారిని మిత్రులుగా స్వీకరింఛి వారితో మీ బావాలు షేర్ చేసుకోవడం  మంచిది.మీ ఫేస్ బుక్ మిత్రులు గురించి మీ కుటుంబం లోని వారికి కూడా తెలియటం మంచిది. అప్పుడే మీకు పేస్ బుక్ జ్ణానామ్రుతం  పంచగలగటం  తో పాటు స్వాంతన చేకూర్చగల మాద్యమం అవుతుంది. పేస్ బుక్ దానవులు ని నిరోదించటానికి సాంకేతిక అవగాహన కలిగిఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి నుండి బెడద ఉండక పోవచ్చు.

2 comments:

  1. అది మధనం అండీ...మదన అంటె మన్మధుడు

    ReplyDelete
    Replies
    1. yes,you are correct. rectified. thank you for your response .

      Delete