రంకు నేర్చినోడు బొంకు నేర్వకపోతే ఎటువంటి చిక్కుల్లో పడతాడో డి గ్రేట్ "తరుణ్ తేజ్ పాల్ " ఉదంతం తెలియ చేస్తుంది. నా ఉద్దేశ్యం అబద్దాలు చెప్పి కేసులు నుండి తప్పిచుకోమని కాదు. తప్పు జరిగాక బాదితుల అంగీకారం లేకుండా, వారితో సంబందం లేకుండా తనంతట తాను తను చేసిన నేరాలకు శిక్షను ప్రకటించుకోవటం,దానిని స్వయంగా అమలు పరచుకోవడం , పరివర్తన చెందిన గొప్ప మహానుబావుడిగా పోజులు కొట్టడం ఇవ్వన్నీఅతన్ని చివరకు డిఫెన్స్ తీసుకోలేని స్తితికి నెట్టి వేశాయి. వివరాలు లోకి వెలితే,
అయన పేరు తరుణ్ తేజ్ పాల్ . స్టింగ్ ఆపరేషన్లతో పెద్ద పెద్ద మగాళ్ళ నే గడ గడ లాడించిన తెహెల్కా వీక్లీ మేగజైన్ వ్యవస్తాపక చీఫ్ ఎడిటర్. ఇతను ఎంతో మంది యువ జర్నలిస్టులకు మోడల్ రోల్. అటువంటి పెద్ద మనిషి తన స్నేహితుని కూతురుతో అనుచితంగా ప్రవర్తించి తన కొంచపు బుద్దిని బయట పెట్టుకున్నాడు. గోవాలో జరిగిన ఒక పత్రికా కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న తెహెల్కా పత్రికా లేడి జర్నలిస్ట్ ను అసబ్యంగా తాకరాని ప్రాంతాలలొ తాకి, ఆమె ప్రవైసీకి బంగం కలుగ చేసాడు. దీనితో ఖంగుతిన్న ఆ అమ్మాయి , ఆ పత్రికా లేడి చీఫ్ ఎడిటర్కు సెల్ మెసేజ్ ద్వారా విషయం తెలియచేసి బోరుమంది. దానితో దిమ్మ తిరిగి తేజ్ పాల్ తన పెద్దమనిషి తన్నాన్ని కప్పెట్టుకునేందుకు ఆ లేడి జర్నలిస్టుకు క్షమాపణ చెపుతున్నాను అని, అలాగే తను తెహెల్కా బాద్యతలు నుండి 6 నెలలు సస్పెండ్ అవుతున్నాని, కాబట్టి విషయాన్ని అంతటితో వదిలెయ్యమని ఆ ఎడిటర్ ని కోరాడట .
తేజ్పాల్ చేసినది మాత్రం అతితెలివి పనే అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళా ఉద్యోగినుల వేదింపుల చట్టం ప్రకారం ఏ స్త్రీ ఉద్యోగిని పైన అయినా లైంగిక వేదింపులు జరిగితే బాదితుల అనుమతితో ఒక కాంప్రమైజ్ కు వచ్చి తదనుగుణంగా కాంప్రమైజ్ సెటిల్మెంట్ రాసుకుని దానిని అమలు చేయమని కోరవచ్చు. కానీ ఈ కేసులో అమ్మాయిని సంప్రదించకుండా తనే క్షమాపణ చెప్పడం , తనే 6 నెలలు పత్రికా బాద్యతల నుండి తప్పుకోవడం ఇవ్వన్నీ విషయాన్నీ మసి పోసి మారేడు కాయ చేసే అతి తెలివి పనులు. ఆ పనులే ఇప్పుడు అతన్ని పీకల్లోతు కష్టాలలోకి నెట్టాయి. జాతీయ స్తాయిలో పోకస్ అయిన ఈ వ్యవహారం పై గోవా ప్రభుత్వం సుమోటో గా స్పందించి విచారణ చేపట్టింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాక , చీఫ్ ఎడిటర్ నుంచి తేజ్పాల్ ప్రకటన కు సంబందించిన రికార్డులు స్వాదీనం చేసుకుంది. దానితో కళ్ళు తెరిచినా తేజ్పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పెటిషన్ వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. కానీ స్వయం ప్రకటిత శిక్షను విదించుకున్న అతని తెలివి అతనిని ఖచ్చితంగా కట కటాల్లోకి నెట్టవచ్చు. కాబట్టి ఏ పని చేసినా కీడెంచి మేలెంచాలన్నారు పెద్దలు. ఎంతైనా పెద్దల మాట పెద్దల మాటే , అడునికుల చేష్టలు ఆటవిక చేష్టలే!
No comments:
Post a Comment