Thursday, November 21, 2013

ఒక ప్రక్క రాజకీయ తుపానులు , మరొక పక్క ప్రక్రుతి తుపానులతో అల్లాడుతున్న సీమాంద్రులు!

                                                   

  నిన్న విజయవాడ నుండి నా మిత్రుడు ఒకరు పోన్ చేసారు. ఆయనగారి కొలీగ్ కి ఖమ్మం కోర్టుల్లో ఏవో సర్టిపైడ్ కాపీలు కావాలంటా , అందుకు ఖమంలో ఎవరైనా తెలిసిన లాయర్లు ఉన్నారా అని అడిగితే నా రిపరెంస్ ఇచ్చాడంట. కాబట్టి సదరు మిత్రుడికి కోరిన సహాయం చేయమని నాకు చెప్పడానికి నాకు పోన్ చేసాడు.నేను సిదార్దలో లా చేసేటప్పుడు నా క్లాస్ మేట్ తను. చానాళ్ళకి పోన్ చేసాడు కాబట్టి కాసేపు యోగ క్షేమాలు విచారించుకున్నాం. పాపం అతని  మాటల్లో కొంత నైరాశ్యం ద్వనించింది. నాలుగు నెలలు బట్టి సీమాంద్రలో కోర్టులు నడవటం  లేదు. ఉద్యోగులు అంటే ఎదో పైలిన్ తుపాన్  వంకతో  తిరిగి ఉద్యోగాల్లోకి చేరి పోయారు కానీ, తక్కిన వర్గాలకు ఏ దారీ కాన రాక బరువుగా ఉద్యమాన్ని ఈడ్చుతున్నట్లుంది. అయినా ఉద్యోగుల పార్టీస్పేషన్ లేని ఉద్యమాన్ని సీమాంద్రా మీడియా కూడా  పోకస్ చేయకపోవటం వలన సీమాంద్రాలో ప్రస్తుతం ఏ ఉద్యమాలు లేవు అని ఇక్కడి తెలంగాణా వారు , అక్కడి కేంద్రం వారు అనుకుంటున్నారు.

   ఈ  సంవత్సరం జనవరి 1 న ఎవరి ముఖం చూసారో కానీ , సీమాంద్రులకు అటు ప్రక్రుతి నుంచి, ఇటు వారు ఇష్టపడి ఎన్నుకున్న "అమ్మ హస్తం"నుంచి  తుపాన్ లను ఎదుర్కొంటూ నానా కష్టాలు పడుతున్నారు. వారి తరపున రాజకీయ నాయకులు కేంద్రం తో పిల్ల ఆటలు ఆడుతూంటే ప్రజలు వారిని కట్టడి చేయలేక పోయారు. తీరా ఇప్పుడు మునుం మీదకు వచ్చే సరికి ఎన్ని గగ్గోళ్ళు పెడితే మాత్రం ఏమి లాభం? నేను ఇదే బ్లాగులో పెబ్రవరి 1 వ తారీఖున చెప్పాను. సీమాండ్రా నాయకులు పిల్ల చేష్టలు చేస్తున్నారు, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అని. సోనియా గాందీ ఖచ్చితంగా తెలంగాణా ఇస్తుందని కూడా  చెప్పటం జరిగింది. రాజకీయాలతో ఏ మాత్రం ప్రత్యక్ష సంబందాలు లేని నేనే సోనియాగాందీ గురించి ఒక వాస్తవ అంచనా వేయగలినపుడు , మహా మహులైన వారు , ఆమె తో సనిహిత సంబందాలు ఉన్న వారు ఆమె మనస్తత్వాన్ని అంచనా వేయడం లో ఎందుకు విపలమయ్యారో అర్దం కావడం లేదు.

  తెలంగాణా రాష్ట్ర విభజన ప్రకటించే రోజు వరకు సీమాంద్రా ప్రజలకు తప్పుడు భరోసలు ఇస్తూనే వచ్చారు. ఇప్పటికీ వారిది అదే తంతు. సీమాంద్రా మంత్రులు అయితే పూర్తిగా "అమ్మ" కాళ్ళ మీద సాగిలపడి, "పాకేజీలు ఇవ్వు తల్లీ" అని దీనాతీ దీనంగా అడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మాకు తెలంగాణ విభజన అనేది వస్తుందని నమ్మకం ఉన్న, అది సోనియా గాందీ  గారి పుట్టిన రోజు కానుకగా స్వీకరించడం అస్సలు ఇష్టం లేదు. కానీ సీమాంద్రా నాయకుల దోరణీతో, పస్ట్  ఏదో విదంగా తెలంగాణా తీసుకోవడమే మంచిదని మెదలకుండా ఉన్నారు తెలంగాణా ప్రజలు. అఫ్కోర్స్ మాలోను సోనియాకి గుడి కట్టి తమలోని  పిచ్చిని ప్రదర్శిస్తున్నారు అనుకోండి . రేపు తెలంగాణా ఇచ్చాకా మాత్రం అమ్మ పార్టీని తెలంగాణాలో కూడా  ఆనవాలు లేకుండా చేయడం ఖాయం. సీమాంద్రా నాయకులకు నిజంగా తాము తప్పు చేసాము అని బావిస్తే దానికి నష్ట నివారణ చర్యలు తెలంగాణా నుంచి మొదలు పెట్టాలి. కానీ ఎంత సేపు సీమాంద్రా ప్రజలతో సమఈఖ్యాంద్ర్రకు జై అనిపిస్తే ఒరిగేది ఏమిటి? ఒక తెలంగాణా వాడిగా ఇంత కంటే ఎక్కువ చెప్పలేను.

    ఏది ఏమైనా తోటి సోదరులు అయిన సీమాంద్రా ప్రజలు అటు ప్రకృతితో , ఇటు పనికి రాని  నాయకులతో నానా కష్టాలు పడుతున్నందువలన, వారిని ఆ "పైడి తల్లి, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్తెన్న, బెజవాడ దుర్గమ్మ, పానకా ల నరసింహుడు, తిరుపతి వెంకన్న అందరూ చల్లగా చూచి వారికి మేలు చేయాలని ఒక తెలుగు సోదరుడుగా కోరుకుంటున్నాను.నేను సోనియాగాందీ తెలంగాణా ఇస్తుందని చెప్పిన టపాను క్రింది  లింక్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

నాన్నా "తెలంగాణా" వచ్చే! http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

2 comments:

  1. sir,
    Namaste. Nizame. meeru cheppindi. mee blog lo anade kuda chadivanu.
    a.v. ramana

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ రమణ గారు, నా అంచనా తప్పు కాక పోతే అతి త్వరలోనే రాష్ట్ర విభజన విషయం లో కొంత మంది కుట్ర ఉన్నదనేది వెల్లడవుతుంది. దాని గురించి నేను ఇదివరకే ఇంకొక బ్లాగులో చెప్పాను, కానీ చాలామంది అది నిజం కాదనుకున్నరు. కానీ మారుతున్న పరిస్తితులు చూస్తుంటే నా అంచన నిజమేననిపిస్తుంది. ఒక వారం రోజుల్లో అది వెల్లడవవచ్చు. అప్పుడు వివరంగా చెపుతాను.

      Delete