Wednesday, November 6, 2013

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? !!!..


                                                         

 మంగళ యాన్ ! భారతీయులు తరపున మొట్ట మొదటిసారిగా మంగళ లేదా అంగారక గ్రహం చుట్టూ తిరగి విషయ సేకరణ చేయట్టానికి పంపిన స్పేస్  క్రాఫ్ట్ పేరు అది. దాని బరువు 1350 కిలోలు. దీని ని నిన్న మద్యాహ్నం P.S.L.V 25 ద్వారా భూ కక్ష్యలో  ప్రవేశ పెట్టారు. దీనితో తోలి దాస పూర్తయింది. ఇంకా ఎనిమిది నెలలు జాగర్తగా పర్యవేక్షిస్తూ అంగారక గ్రహ కక్ష్యలోకి వెళ్ళేలా చేయగలిగితే అప్పుడు భారతీయుల కల నెరవేరుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అంగారకుడి మీద రోవర్లు దించి పరిశోదన చేస్తున్నాయి . మనం మాత్రం అంగారకుడి పై కాలు మోపకుండా దాని కక్ష్యలో తిరుగుతూ , అంగారకుడి గురించి మరింత సమాచరం తెలుసుకోవడమే" మంగళ యాన్ " ప్రయోగ ఉద్దేశ్యం.

 అసలు నాకనిపిస్తుంది "డార్విన్" చెప్పిన "జీవ పరిణామ " సిద్దాంతం తప్పేమో అని . ఎందుకంటే ఆ సిద్దాంతం ప్రకారం ఇప్పటి ఆదునిక మానవుదు "కోతి " నుండి అనేక మార్పులు పొందుతూ చివరకు మనిషి లా రూపొందాడు అట. ఇలా రూపొందటానికి గరిష్టం గా 20,000 సంవత్సరాలు కాలం సేరి పోతుందని ఒక అంచనా. మరి ఒక లెక్క ప్రకారం ఆప్రికా ఖండం లో ఆదునిక మానవుడుకి మూల రూపమైన 'హోమో సేపియన్" ఆవిర్బవించి 2,00,000 {రెండు లక్షలు ) సంవత్సరాలు అయిందట. కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళబట్టి కేవలం డెబ్బై యేండ్ల క్రితమే మొదలయింది అందంటారు.ఆసియా ఖండానికి వచ్చి 15,000 యేంద్లేనట. మరి కోతి నుండి మనిషిగా పరిణామం చెందటానికి 20,000 సంవత్సరాలు సరిపోతే సుమారు 1,50,000 సంవత్సరాల పాటు ఒకే ప్రాంతం లో ఎలా ఉండగలిగాడు మానవుడు అంటే ఇప్పటికి సమాదానం దొరకని ప్రశ్నే. కోతి నుండి మానవుడు పరిణామా క్రమం చెందితే ఇంకా కోతులు కనపడడానికి కరణం ఏమిటి? అని చాల మంది ప్రశ్నిస్తుంటారు. ఒకే ప్రాంతం లో పరిణామ క్రమం చెందిన జీవులు, చెందకుండా మూల రూపాలోనే మిగిలి పోయిన జీవులు కలసి  ఉండటానికి అవకాశం ఉందా ? ఒకవేళ మనం ఆప్రికా నుండి రూపాంతరం చెంది వచ్చిన కోతులుకు వారసులం అయితే , ఆప్రికాలో కోతులు ప్రస్తుతం లేవా? అని ప్రశ్న. మరి ఇండియా లో ని పూర్వపు కోతులు ఏ రూపాంతరం చెందకుండా అలాగే ఎలా ఉన్నాయి ?

    మనకు రామాయణం లో వానర  వీరులు  ప్రస్తావన ఉంది. మన అంజనేయ స్వామి వారు సాక్షాత్తు వానర జాతికి చెందిన వారు. అది పూర్తిగా కవి కల్పన అని అనవచ్చు కొందరు. కానీ రామాయణ రచనా  కాలం డార్విన్ ఆవిష్కరణ కంటే కొన్నీ వేల  సంవత్సారాల ముందు ది.ఒకవేళ అది ఊహే అనుకున్నా , నరులతో వానరులు స్నేహసంబందాలు కలిగిఉండటం ని,కలసి మెలసి సంచరించడాన్నీ ,   విదేశి శాస్త్రజ్ఞులు కంటే వేల సంవత్సరరాల పూర్వమే మన రామాయణ కర్త అయిన వాల్మీకి ఊహించగలగడం  గ్రేటే కదా!   ఒక సిద్దాంతం ప్రకారం శాస్త్రజ్ణులు కంటే ముందే  ఆద్యాత్మిక వాదులు విశ్వ రహస్యాలు తెలుసుకోగలుగుతారు.  ఆ విషయాన్నీ వారు వారి కర్దం  అయిన రీతిలో వివరిస్తారు. కొంచం కల్పనా శక్తి ఉన్న వారు కధలూ  , కావ్యాలుగా వాటిని ఆవిష్కరిఇంచారు . ఆ తర్వాతనే శాస్త్రీయ బావనలు అభివృద్ధి చెందటం ప్రారంబం అయ్యాక వాటిని నిరూపించడానికి ప్రయత్నిచడం ప్రారంభించారు శాస్త్రజ్ఞులు

             అసలు కోతి నుండి మనిషి వచ్చాడు అనే దానికంటే ఒకప్పుడు వానరాలను పోలిన జీవ జాతి ఒకటి మానవులతో సమకాలీనులుగ ఉండే వారు అనిపిస్తుంది. మరి వారెవరూ ? ఈ  మానవు లెవరు? అనేది   తరవాతి టపాలో చెపుతాను. .     

No comments:

Post a Comment