Wednesday, January 2, 2013

"రేప్" నేరానికి "ఉరి శిక్ష" వలన లాభం కంటే నష్టం ఎక్కువ!

                    
                                                                          

  మొన్న డిల్లీలో గాంగ్ రేప్ తర్వాత అందరం ఆవేశ పడి పోయి, రేపిస్టులకు మరణ శిక్షే సరి అయినదని డిమాండ్ చెస్తున్నాం. నేను కూడ అదే అవేశం లో అదే కరెక్ట్ అనుకున్నాను. కాని నెమ్మదిగా, కూల్ మైంద్ తో అలోచిస్తే, ఈ డిమాండ్ తప్పని, ఒక వేళా అలాంటి శిక్షలే చట్టం లో పొందుపరుస్తే, దాని వలన ఆడపిల్లలు కు  మేలు కంటే కీడే అదికమని అనిపిస్తుంది.

  ఎలాగంటారా, ఇప్పట్టి వరకు రేప్ కీ గరిష్టంగా  శిక్ష  పది యేండ్లు మాత్రమె. కాబట్టి రేపిస్టుకు తాను చట్ట పరంగా శిక్షించబడినా ప్రాణం తీయరనె బరోసా ఉంటుంది కాబట్టి బాదితురాలికి ప్రాణ హాని తలపెట్టడు. అదే ఉరి శిక్ష అయితే ఎలాగు తాను చావడం ఖాయం కాబట్టి, కేసులో కీలక సాక్షి బాదితురాలే కాబట్టి, అమెను చంపితే కేసులో సాక్ష్యం లేకుండా చెయొచ్చు అనే బావనకు రావచ్చు. ఆమె బ్రతికున్నా, చచ్చినా ఒకటే శిక్ష కాబట్టి, ఆమెను చంపితేనే కొంతవరకు కేసు నుండి లేక ఉరి శిక్ష నుండి తప్పించుకోవచ్చు అని బావించే ప్రమాద ముంది. దీని వలన ప్రతి రేప్ బాదితురాలి ప్రాణానికి  రిస్క్ ఏర్పడుతుంది. కాబట్టి మనమ్ అవేశం తో కాక విజ్ణతతో, వాస్తవిక ద్రుష్టితో అలోచించాలి.
        మొన్నటి వరకు మన దేశమ్ లొ ఉరిశిక్ష  ని రద్దు చెయ్యాలని పరి వర్తన వాదులు వాదించారు. కాని డిల్లీ ఘటన చూశాక  మానవ మ్రుగాలకు ఉరిశిక్షే కరెక్ట్ అంటున్న జాతి యావత్తు ను చూసి ఏమనలెక పోతున్నారు. ఒక పక్క ఆడపిల్లలు గలమెత్తి అందోళన చెస్తుంటే, ప్రబుత్వానికి గుండే జారి పొతుంది,ఇదెక్కడ మహా ఉద్యమంగా  మారి తమ అదికారానికే ఎసరు వస్తుందో అని. కాని మ్రుగాల్లకు మాత్రం ఏ మాత్రం జంకు గొంకు లేదు అనిపిస్తుంది. అసలు డీల్లీ ఘటన తర్వాత, అత్యచారాలు ఎక్కువ పెరిగాయో, లేక పత్రికల వాళ్ళు శ్రద్దగా ప్రతి అత్యాచారాన్ని ప్రచురిస్తున్నారో తెలియదు కాని అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే సామాన్య ఆడపిల్లలకు  వారి తల్లి తండ్రులకు భయం వేస్తుంది. నేను మొన్న ఒక చోట కొంత మంది పెద్దల మాటలు అలకించాను. ఆడపిల్లల్ని  పెద్ద చదువులు చదివించే బదులు తొందరగా  పెళ్ళి చేసి, తమ బాద్యతలు తీర్చుకుంటే మేలు అని.

  పై మాటలు విన్న నాకు  ఒక్క సారిగా చరిత్ర గుర్తుకు వచ్చింది.వెనుకటి రోజుల్లో  మన వాళ్ళు ముస్లింల దండయాత్రలు సందర్బంగా పెళ్లికాని ఆడపిల్లల్ను చెరపట్టే వారని వారిని కాపాడుకోవడం కోసం వారికి బాల్య వివాహలు చెసే వారని చదువుకున్నాం.తిరిగి ఆడపిల్లల మీద అత్యాచారాలు నిరోదించలేక పోతె, తల్లి తండ్రులు ఆడపిల్లల్ని కాలేజిలకు పంపే బదులు పెళ్ళి చెయ్యడానికే మొగ్గు చూపొచ్చు. ఇది చూడటానికి కొంత విచిత్రంగా అనిపించినా ఆదునిక వస్త్రదారనే అత్యాచారాలకు ప్రదాన కారణమని పెద్దలు బావిస్తే జరుగబోయే పరిణామం ఇదే. పరువుగల తల్లి తండ్రులు పరువుగా తమ పిల్లల్ని ఒక పరువుగలవాడి చేతిలో పెట్టి తమ దర్మాన్ని నెర వేర్చాలనుకుంటారు. పరువు అనేది ట్రాష్ అనే గొప్ప సంస్కారం(?) నూటికి తొంబయిమందికి ఉండక పోవచ్చు. అటువంటి వారు దేన్నైన ఈజీగా తీసుకోవచ్చు. కాని బలయ్యెది సామాన్య, సాంప్రదాయ వాదులైన తల్లి తండ్రులున్న ఆడపిల్లలే. కాబట్టి తక్షణం ఈ సమస్యను సీరియస్ తీసుకోకపోతే ఇదొక సామాజిక రుగ్మత గా మారె ప్రమాదముంది.   

  ఉరి శిక్షకు బదులు, కొంతమంది సూచిస్తున్నట్లు, రసాయానాలతో, రేపిస్ట్" మగ అహంకారాన్ని" తొలగిస్తె మంచిదనుకుంటా! ఈ దిశగా  సామాజిక వాదులు ఆలోచన చెయ్యాలని కోరుతున్నాను.నేను ఇదివరకటి టపాలో చెప్పినట్ట్లు, దీని మీద ఒక సమగ్ర అద్యయనం చేసేటందుకు నిర్థిష్ట కాల పరిమితితో కూడిన ఒక కమిటీ ని వేస్తె మంచిది. జుడిషియల్ కమిషన్ వలన లాభమ్ లేదు. సామాజిక వాదులు, స్త్రీ వాదులు, న్యాయ నిపుణులు, పోలిస్ అధికారులతో కూడిన ఒక విస్త్రుత కమిటీ నీ వేయాలి. అప్పుడే ఏమన్నా పలితం ఉండవచ్చు.  

Tuesday, January 1, 2013

సాంప్రదాయ దుస్తులు దరించిన వారు "రేప్" లకు గురికావటం లేదా?



  నిర్బయ ఉదంతం తర్వాత  స్త్రిల మీద అత్యాచారాలు గురించి విబిన్న వాదాలు నడుస్తున్నాయి దేశం లో. సాంప్రదయ వాదులు, పొలీసులు, రాజకియ నాయకు అత్యదికులు స్తిల  ఆదునిక వస్త్రదారణ  వారి మీద అత్యాచారాలు జరిగేలా పురిగొల్పుతుంది అని వాదిస్తుంటే, అదునిక మహిళలు, విద్యార్దినులు మండి పడుతున్నారు. ఇదంతా పొలిసుల, నాయకుల చేతకాని తన్నాన్ని కప్పి పెట్టుకోవాడానికి చెప్పే మాటలు అని వాదిస్తున్నారు.

 ఇక్కడ గమనించ దగిన విషయం ఏమిటంటే, స్త్రీల  ఆదునిక వస్త్ర దారణే రేప్ లు జరగటానికి కారణమయితే, సాంప్రదాయ వస్త్రదారణ చేసే స్త్రీల మీద అత్యాచారాలు జరుగ కూడదు. లేదా అత్యదిక అత్యాచారాలు అదునిక వస్త్రదారుణిల పైనే జరగాలి! అలా జరుగుతున్నాయా? ఒక వేళా అసలు బట్టలు కట్టుకోకుండా వీదుల్లో తిరిగినా ఆ వంక తో రేప్ లు చేసే హక్కు మగవాళ్ళకు ఉంటుందా?వారి మీద న్యూసెన్స్ కెసులు పెట్టాలే కాని లైంగిక దాడులు చెస్తె అది ఖచ్చితంగా నేరం అవుతుంది.

 కాని ఇదే సందర్బంలో ఒక విషయమ్ గుర్తుంచుకోవాలి. అసలు స్త్రీల పట్ల రేప్ లు అదికంగా జరగడానికి ఏ కారాణాలు దోహద పడుతున్నాయి అనే దాని మీద సమగ్ర అద్యయనం జరగాలి. దాని ద్వార కారణాలు కనుగొనడమె కాక అత్యాచారాల నివారణకు తగిన విదానాలు రూపొందించుటకు అవకాశం ఉంటుంది. ఈ అద్యయన కమిటీల్లో, ఈ విభిన్న వాదలు చెసే వారికి ప్రాతినిద్యం కల్పిస్తె మంచిది. కేవలం న్యాయ కమీషన్లు కాకుండా సామాజిక,సాంస్క్రుతిక రంగాల్లో సేవ చెస్తున్న వారిని, మంచి పరిజ్ణానం కలిగిన వారిని ఈ కమిటీల్లో సబ్యులుగా వేస్తే మంచి పలితముంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈదిశగా ఆలోచించాలి.     

Monday, December 31, 2012

గాందీ గారి "సప్త మహా పాపములు" చూడండి

                                                                                   


 
                గాందీ గారి "సప్త మహా పాపములు" చూడండి

  నా బ్లాగును స్నేహితులకు, చూచువారికి,విమర్శకులకు, రంద్రాన్వేషకులకు అందరికి ఆంగ్ల సంవత్సర శుబాకాంక్షలు. నా బ్లాగు టైటిల్ లో ఉదహరించిన గాంది మహాత్ముడు చెప్పిన "సప్త మహా పాపములు" అనగా ఏవో సచిత్రంగా ప్రచురించడమయినది.   

స్త్రీలను వేటాడేది రేపిస్టులు అయితే, వారికి సహకరించేది ఫెమినిస్టులా!?



 అలాగె ఉంది కొంతమంది దోరణి చూస్తే. ఎవరు ఒక మాట ఆడపిల్లలు కోంచం జాగర్తగా ఉండమని చెప్పినా వీళ్ల మీద ఏదో పడ్డట్లే అవేశపడి పొతున్నారు. అసలు మన దేసమ్ లొ ఒక అంచనా ప్రకారం నూటికి రెండు కేసులు మాత్రమే పోలిస్ స్టేషన్ల దాకా వస్తున్నాయట. అటువంటప్పుడు స్త్రీల రక్షణకు కేవలం చట్ట బయం ఒక్కటే చాలదు. అన్ని జాగర్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఒంటి నిండ బట్టలు కట్టుకోండి అనటం బూర్జువా బావం అంట! మీ ఇష్టం వచ్చినట్ట్లు ఉండండ అని చెప్పడం అబిరుద్ది బావజాల మట. అసలు నాకొక పెద్ద అనుమానం ఏమిటంటే ఈ దెశపు స్త్రీలను తమ వ్యాపార ఉత్పత్తులు అమ్మకం కోసం ఆదునికత పేరుతో విచ్చలవిడి తన్నాని ప్రోత్సాహిస్తుంది వ్యాపారా వాదులే అని. వీరు డైరక్టుగా చెపితే బాగోదని వీరి తాబేదారులను "స్త్రీ వాదం" అనే పేరుతో రంగంలోకి దించి వితండ వాదాలు చేయిస్తున్నరు అని .

  వీళ్ల తంతు చూస్తుంటే వేటగాళ్లు అమాయక జంతువులను వేటాడే విదం గుర్తుకు వస్తుంది. వేటగాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు రెండు జట్లుగా విడి పోతారు. ఒక జట్టు దూరంగా దారి కాచి ఆ దారిలో కొంతమేర వలలు పన్ని ఎదురు చూస్తుంటారు. ఇంకొక జట్టు మరొక పక్క నుంచి డప్పులు శబ్దం చేస్తూ జంతువులను పొదల్లో నుంచి లేపి పరిగెత్తిస్తూ రెండో జట్టు వలలు పన్నిన చోటుకి తరుముకు వస్తారు. అమాయక జీవులు వేటగాళ్ళ మోసం తెలియక ముందు వెనుక చూసుకోక ఆ వలలో చిక్కుకుని వేటగాళ్ళకు ఆహారంగా మారతాయి.

  పై విదానమే ఈ స్త్రీ వాదులు, రేపిస్ట్లు కలసి చేస్తున్నరా అనిపిస్తుంది. ఒకళ్లేమో మీ ఇష్టం వచ్చినా విదంగా వీదుల్లోకి వెల్లే స్వేచ్చ ఉంది అంటారు అలా వెళ్ళిన వాళ్ళని రెచ్చగొట్టిందంటూ ఇంకొక వర్గం వారు  రేప్ చేస్తుంటారు. ఫెమినిస్టు లారా మీరు చెపుతున్నట్లు ఈ దేశంలో  బూర్జువ సంస్క్రుతే రేప్ లకు మూల కారణమయితే, ఆదునిక బావాలు వాళ్ళు తిరిగే పబ్బుల్లో, క్లభ్భుల్లో రేప్ లే జరుగ కూడదు. విమానాలలో సహితం పేరుమోసిన ఆదునికులే వికారాలు ప్రదర్శిస్తుంది ఎందుకో చెప్పగలరా?రేప్ అనేది అభిరుద్ది చెందిన దేశాలలో జరుగుట లేదా? కేవలం మన దేశం లోనే జరుగుతున్నాయా? దీని గురించి ఒక అద్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఒక వేళ మీరు చెప్పినట్లు ఇక్కడి మగ మనస్తత్వమే అటువంటిది, దానిని చట్ట దండన ద్వారే నియంత్రించగలం అని తేలితే మిలట్రీ రూల్ పేట్టైనా స్త్రీలను కాపాడవలిసిందే. లేదు స్త్రీలు కూడ ప్రబుత్వాలకు సహయపడితే ఈ విపరీత దోరణి నివారించవచ్చు అని తేలితే అలాగే చేయొచ్చు. అంతె కాని ఏది చెప్పినా బూర్జువాబావజాలమ్ అని ఈసడించుకుంటే పరిస్తితులు చక్క బడవు.     

ఫుల్ గా మందు కొట్టి,అర్థరాత్రి ఆంగ్ల సంవత్సరాది కి ఆహ్వానం పలికే వారికి శుబాకాంక్షలు.!


 అబ్బా! పాత వత్సరం ఈరోజు అర్థరాత్రితో ముగుస్తుంది. దేశప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతమ్ చెప్పటానికి బారీ ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారట!అర్థరాత్రి అనందం కోసమ్ ఎదురు చూస్తున్నారు.

 సరె అందరకు ఉన్నట్లే మనకు ఒక సంవత్సరాది ఉంది. దానిని ఉగాది అంటాం. ఆ రోజు తెల్ల వారు జామునే లేచి శుభ్రంగా తలంటు పోసుకుని, కొత్త బట్టలు కట్టుకుని,పూజలు చేసుకుని, ఉగాది పచ్చడి తిని, పిండివంటలు వండుకుని ఇంటిల్లీ పాది ఆనందంగా గడుపుతాము. ఇదంతా పగటి వేళలో జరుగుతుంది.ఇది మన సంస్క్రుతి. మన మత విదానం ఇదే మనకు నేర్పింది.

 ఇక పొతే విదేసి సంస్క్రుతి నేర్పిన దేమిటంటే ఇంకా గంటల్లో నూతన సంవత్సరం వస్తుందనగా, ఫ్రెండ్స్ తో కూర్చుని మందు పార్టీ ఏర్పాటు చేసుకోవడం.ఫుల్ గా మందుకొట్టి ఊగుతూ ఆ మత్తులోనే, న్యూ ఇయర్ కి స్వాగతం చెపుతూ, రోడ్ల వెంబడి పిచ్చి గంగిర్లెత్తినట్లు వెర్రి కేకలు వేస్తూ, తిరిగి,తిరిగి ఇంటికి వెళ్ళి(వీలుంటె) బోర్ల బొక్కలా పడుకుని నిద్ర పోవడం. వీరికొక సెంటిమెంట్ ఉందట! మొదటి రోజు ఎలా జరిగితే సంవత్సరం అంతా అలాగే జరుగుద్ది అంట! ఇంకే మరి! స్వాగతమే మత్తులో చెపుతున్నారు కాబట్టి, ఆ యేడాదంతా అదే పరిస్తితి!

  ఈ విదానం వల్ల వ్యాప్పారస్తులు,సెలబ్రిటిలు, మద్యం షాప్ లకు బారీ ఒపెనింగ్లు తప్పా ఎవరికి ఎమి ఒరగదు. ఏది ఏమయినా నలుగురితో నారాయణా అని నేను స్వాగత శుబాకాంక్షలు చెపుతున్నాను.

              ఇష్...యు....ఆ..ప్..ఇ..న్య్...ఉఉ..యి...యాఅ...ర్..............(ఇప్పటికే బాటిల్ కతం),

Sunday, December 30, 2012

పొలిసోడే రేప్ చెస్తే "ప్రొటెక్ట్" చెసేదెవరురా! దేవుడా!



  ఇక చెప్పండి. పాపం ఒక అమె కంప్లైంట్ ఇద్దామని విజయవాడ లోని ఒక పోలిస్ స్టేషన్ కి వెల్లిందట. అక్కడ ఆమె కంప్లైంట్ సంగతి దెవుడెరుగు, ఆ పొలిస్ స్టేషన్లో ని కానిస్టేబుల్ అమె పై అత్యాచారం చేసి పంపిస్తే ఆమె ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉందట. అసలు ఏమి జరుగుతుందో నాకైతే అర్థమ్ కావటం లేదు. అసలు మగాడు అంటె కనీసమ్ "రేప్" చెయ్యగలిగినవాడు అని అర్థమా ఎమిటి?

  వీలమ్మా కడుపు మాడా ! వీల్లకేమి పోకదల వచ్చిందండి? ఇలా బరి తెగించారు.కాపాడే వాడెవడో, కాటేసే వాడెవడో తెలియకపోతే ఆడ కూతుళ్ళు బ్రతికేదెట్టా? ఒక పక్కా డిల్లీ పిల్లని పొట్టన పెట్టుకున్నందుకు దేశమంతా అట్టుడికి పోతుందా! అయినా ఈ మగ మ్రుగాలకి  కోంచమన్నా చీమూ నెత్తురు ఉందా? అంత ఆపుకోలేక చస్తునారా? అసలు ఈ మద్య ఏమన్నా వీదేశీయులు మన దేశం మీదకి"విషపు గాలి" లాంటిది ఏమన్నా వదిలారా? అది పీల్చీ, మనోల్లు శివాలెత్తి పోతున్నారా?లేకుంటే ఈ పాపం ఏమిటండి!

   అసలు నన్నడిగితే కన్ను కి కన్ను, కాలు కి కాలు సిద్దాంతం యే కరెక్ట్ అండి.అప్పుడు కాని బుద్ది రాదు మగ మ్రుగాలకి. ఏమండోయి, కన్ను కి కన్ను అన్నానని "రేప్" కి "రేప్"  అనుకోమాకండి. దేని వలన ప్రమాదముంటే దానిని తీసివేయడమే! అంతే. ఆడ పిల్లలు మీ చదువులు, గిదువులు తర్వాత.అంద్రా, తెలంగాణా తో పని లేదు మీకు. నిలదీయండి ప్రభుత్వాలని. మీకు సంపూర్ణ రక్షణ కు చర్యలు తీసుకునే దాక "కల్కి అవతారులై" కదలండి. నేను మొన్నట్టి దాక "కల్కి" అంటె మగాడు వస్తాడు అనుకున్నా! కాదు తల్లులారా, మిరే! మిరె కల్కి లైనా కాళికలైనా! మీరు కదిలితే మగ మ్రుగాలు పారి పోవాలి . జై కల్కి!,      జై కాళికా!

Saturday, December 29, 2012

మేము ఆ విషయం లో "మగవాళ్లం" కాదు.?!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_6727.html
పూర్తి టపా కోసం లింక్ మిద క్లిక్కండి

మమ్మల్ని క్షమించమ్మా, మేము ఆ విషయం లో "మగవాళ్లం" కాదు.



 అని బారత దేశం లోని నాయకులు "అమానత్" కి శ్రద్దాంజలి ఘటీంచాలి. మనం "రేప్" లు చెయ్యడం లో ఫస్ట్ అట! కాని   రేప్ కు గురైన వారికి వైద్య సహాయం లో అండించడమ్ లో "మగవాళ్లం" కాదు అని నిరూపించుకున్నాం. పదిరోజులు బాదితురాలికి వైద్యం ఆందించి, అన్ని అవయవాలు ఇన్ఫెక్షన్ తో పాడయ్యే దాక చూసి, చివరి క్షణం లో "సింగపూర్" పంపుతారా? మన దేశం కంటే ఎంతో చిన్నదయినా దేశం లో ఉన్న మెరుగఈన వైద్య సౌకర్యాలు మన దగ్గర లేనందుకు సిగ్గు పడాలి.
                                                                   
   డీల్లీ రేప్  కేస్ విషయం లో అక్కడి మహిళా ముక్య మంత్రి షీలా దీక్షిత్ గారికి డీల్లీ పోలిసులకు మద్య ఎందుకో బేదాభి ప్రాయాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పాలనా పరంగా డిల్లీ పోలిస్ భారత రక్శణ శాఖా మంత్రి షిండే గారి కంట్రోల్  లో పని చేస్తుందట. అందుకే వారికి ముఖ్యమంత్రి ని పెద్దగా పట్టించుకోరనుకుంటా!

  మొన్న  ప్రజలు ఆందొళన  చేసిన విషయమ్ లో, బాదితురాలి మరణ వాంగ్మూలం తీసుకునే సమయం లో పోలిసులు ప్రవర్తించిన తీరు మీద సాక్షాతు, రాష్ట్ర ముఖ్య మంత్రియే పొలిసుల మిద హోమ్ మంత్రికి పిర్యాదు చేసారంటే  పరిస్తితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 మరి అటువంటి పాలనా వ్యవస్తలొ స్త్రీల మీద అత్యాచారాలు చెయ్యాలనుకున్న దుండగలకు ఏ మాత్రం భయం ఉంటుంది చెప్పండి. ప్రతి వాడు తమ మీదకు రాకుండా బాద్యతను ప్రక్క వాడి మీదకు నెడదామని చూసే వారే. ఇటువంటి అదికారులు స్త్రీలకు రక్షణ కల్పించ గలరా? వీరీ రక్షణా  బరోసాను నమ్మి భయటకు వెళ్లిన స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలరా? రాలెరని "అమానత్" ఉదంతమే చెపుతుంది. ఏన్ని కటిన చట్టాలు చేసినా అమలు చేసే వారికి చిత్తశుద్ది లెకపోతే వాటి వల్ల ఒరిగేది ఏమి  ఉండదు.

  కాబట్టి మహిళలు కళ్ళు తెరిచి ప్రస్తుత పరిస్తితులను వాస్తవ ద్రుష్టి తో అంచనా వేసుకో గలగాలి. ఏ పద్దతి అవలంబిస్తే మాన ప్రాణాలకు భద్రత ఉంటుందో వివేకం తో ఆలోచించ గలగాలి. ఒంటరిగా, లేక బాయ్ ఫ్రెండ్లతో తిరగటానికి బదులు ఒక బాచ్ గా అంటే గుంపుగా తిరగటం మేలు.బాయ్ ఫ్రెండ్ ల సంస్క్రుతికి సాద్య మైనంత దూరంగా ఉంటూ,సోదర సోదరీ బావాల సంస్క్రుతిని అలవాటు చెసుకోవటం మేలు. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వారితోనే గుంపుగా కలసి తిరగడం మంచిది.

  కీకారణ్యమ్ కంటే జనార్యాణాలోనే స్త్రీలకు రక్షణ కరువు.మగాళ్ల రూపం లో ఉనా తోడేళ్లు నుండి రక్షించుకోవడానికి గిరిజనులు అనుసరించే "గుంపు" జీవన విదానమె కరెక్ట్. వారిలో అంతే. ఒక గుంపులో ఎవరికి హాని తల పెట్టినా మొత్తమ్ గుంపు హాని చెసిన వారి మీద దాడి చేస్తుంది. ఆ భయంతో నే సాదారణంగా ఎవరూ ఒకరి కొకరూ హని తల పెట్టరు . ఎందుకంటే దాని ప్రబావమ్ మొత్తం గుంపు అనుభవించాలి కాబట్టి. అందుకే అక్కడ పోలిస్ లు లేక పొయి..  నా రక్షణ ఉంటుంది. ఈ విదానమె నగరాలలో పాటిస్తే బాగుంటుంది అని నా అబిప్రాయం.
        డీల్లీ    రెప్ కేసు లో బాదితురాలు అమానత్ ఈ రోజు మ్రుతి చెందినది అని తెలిసి చాలా విచారిస్తున్నాను. అమె కొరిక నెరస్తులకు శిక్ష పడటం అని తెలుస్తుమ్ది. కాబట్టి ఆమే ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణమె నేరస్తులకు  ఉరి సిక్ష పదేలా ప్రభుత్వమ్ చర్యలు తీసుకోవాలి.ఆమే కుటూంభ సభ్యులకు ప్రగాడ సానుబూతి తెలుపుతూ

ముఖ్యమంత్రికి, పోలిసులకు, పొసగని చోట నేరస్తులకు భయం ఉంటుందా?


                                                                   
  ఉండదు గాక ఉండదు. డీల్లీ రేప్  కేస్ విషయం లో జరిగింది అదే.అక్కడి మహిళా ముక్య మంత్రి షీలా దీక్షిత్ గారికి డీల్లీ పోలిసులకు మద్య ఎందుకో బేదాభి ప్రాయాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పాలనా పరంగా డిల్లీ పోలిస్ భారత రక్శణ శాఖా మంత్రి షిండే గారి కంట్రోల్  లో పని చేస్తుందట. అందుకే వారికి ముఖ్యమంత్రి ని పెద్దగా పట్టించుకోరనుకుంటా!

  మొన్న  ప్రజలు ఆందొళన  చేసిన విషయమ్ లో, బాదితురాలి మరణ వాంగ్మూలం తీసుకునే సమయం లో పోలిసులు ప్రవర్తించిన తీరు మీద సాక్షాతు, రాష్ట్ర ముఖ్య మంత్రియే పొలిసుల మిద హోమ్ మంత్రికి పిర్యాదు చేసారంటే  పరిస్తితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 మరి అటువంటి పాలనా వ్యవస్తలొ స్త్రీల మీద అత్యాచారాలు చెయ్యాలనుకున్న దుండగలకు ఏ మాత్రం భయం ఉంటుంది చెప్పండి. ప్రతి వాడు తమ మీదకు రాకుండా బాద్యతను ప్రక్క వాడి మీదకు నెడదామని చూసే వారే. ఇటువంటి అదికారులు స్త్రీలకు రక్షణ కల్పించ గలరా? వీరీ రక్షణా  బరోసాను నమ్మి భయటకు వెళ్లిన స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలరా? రాలెరని "అమానత్" ఉదంతమే చెపుతుంది. ఏన్ని కటిన చట్టాలు చేసినా అమలు చేసే వారికి చిత్తశుద్ది లెకపోతే వాటి వల్ల ఒరిగేది ఏమి  ఉండదు.

  కాబట్టి మహిళలు కళ్ళు తెరిచి ప్రస్తుత పరిస్తితులను వాస్తవ ద్రుష్టి తో అంచనా వేసుకో గలగాలి. ఏ పద్దతి అవలంబిస్తే మాన ప్రాణాలకు భద్రత ఉంటుందో వివేకం తో ఆలోచించ గలగాలి. ఒంటరిగా, లేక బాయ్ ఫ్రెండ్లతో తిరగటానికి బదులు ఒక బాచ్ గా అంటే గుంపుగా తిరగటం మేలు.బాయ్ ఫ్రెండ్ ల సంస్క్రుతికి సాద్య మైనంత దూరంగా ఉంటూ,సోదర సోదరీ బావాల సంస్క్రుతిని అలవాటు చెసుకోవటం మేలు. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వారితోనే గుంపుగా కలసి తిరగడం మంచిది.

  కీకారణ్యమ్ కంటే జనార్యాణాలోనే స్త్రీలకు రక్షణ కరువు.మగాళ్ల రూపం లో ఉనా తోడేళ్లు నుండి రక్షించుకోవడానికి గిరిజనులు అనుసరించే "గుంపు" జీవన విదానమె కరెక్ట్. వారిలో అంతే. ఒక గుంపులో ఎవరికి హాని తల పెట్టినా మొత్తమ్ గుంపు హాని చెసిన వారి మీద దాడి చేస్తుంది. ఆ భయంతో నే సాదారణంగా ఎవరూ ఒకరి కొకరూ హని తల పెట్టరు . ఎందుకంటే దాని ప్రబావమ్ మొత్తం గుంపు అనుభవించాలి కాబట్టి. అందుకే అక్కడ పోలిస్ లు లేక పొయి..  నా రక్షణ ఉంటుంది. ఈ విదానమె నగరాలలో పాటిస్తే బాగుంటుంది అని నా అబిప్రాయం.
        డీల్లీ    రెప్ కేసు లో బాదితురాలు అమానత్ ఈ రోజు మ్రుతి చెందినది అని తెలిసి చాలా విచారిస్తున్నాను. అమె కొరిక నెరస్తులకు శిక్ష పడటం అని తెలుస్తుమ్ది. కాబట్టి ఆమే ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణమె నేరస్తులకు  ఉరి సిక్ష పదేలా ప్రభుత్వమ్ చర్యలు తీసుకోవాలి.ఆమే కుటూంభ సభ్యులకు ప్రగాడ సానుబూతి తెలుపుతూ

Friday, December 28, 2012

ఎవరి బ్లాగు చూస్తే,"సైన్స్ గాడ్" మైండ్ బ్లాక్ అవుతుందో వారే వీరబోగ వసంత రాయలా?



                                                                  సింహాచల వరాహ నరసింహ స్వామి.          

  నెను ఎదో కుతూహలమొ, మత ప్రచారం లో బాగమనుకోండి, ఒక పరిశోదన మొదలుపెట్టి దాని సారాంశాన్ని, ఈ బ్లాగులో యుగాంతం డిసెంబర్ 21,2012. అనే శిర్షిక క్రింద సీరియల్గా ప్రచురించటం జరిగింది. దానికి సంబందించి నా పరిశోదనా సారాంశాన్ని, మొత్తం చివరి టపాలో  ప్రచురించటం జరిగింది. దానిలో వీరబోగ వసంత రాయలు గురించి పది విషయాలు చెపుతూ, ఆయన నాస్తికులతో భావ యుద్దం చేస్తాడు అని కూడ చెప్పటం జరిగింది. అంతే! "గాడ్" అనె అయనకు కోపం వచ్చినట్ట్లుంది.నన్నూ, నా మతాన్ని ఆయన బ్లాగులో స్పెషల్ టపా పెట్టి ఆక్రోశాన్ని వెళ్ల గ్రక్కాడు.

  నా మతం "పందులకు పసుపు" రాసేదట!అంటే మనం వరాహా అవతారాన్ని పూజించడాన్ని అయన ఆ విదంగా గేలి చెసాడు.నిజమే పందిలో ఉండేది "ఎలక్ట్రాన్, ప్రొటాన్, నుట్రాన్ లే, మనిషిలో ఉండేవి అవే. అందుకే మాకు దేవుడు అంటే "ఇందుగలడు, అందులేదని కాక సర్వాంత్ర్యామి". కాని "సైన్స్ గాడ్"  కి అలా కాదేమో. మేము మతమ్ లోని విజ్ణానాన్ని దర్శిస్తుంటే, ఈ సో కాల్డ్ గాడ్ సైన్స్ అనే పేరుతో మూర్కత్వాన్ని పోగేసుకుంటున్నాడు.

  వీళ్లన్ని చూస్తుంటె వీరబోగ వసంతరాయలు గురించి నేను చెప్పిందే జరుగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. లేకుంటే నేను వదిలిపెట్టినా ఆ టపాని ఈ నాస్తికులు ఎందుకు వదలిపెట్టకుండా ఏదో రకంగా కెలుకుతున్నారు?. ఒక వేళా వీరబోగ వసంతరాయలు  గురించి నేను చెప్పినది వీరు నమ్మి ఉండాలి. ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు అనే మాటలను పట్టుకుని యెందుకైనా మంచిదని ముందే ఎదురు దాడి మొదలు పెట్టారా!. అయ్యా నేను చెప్పింది కల్కి పురాణం లోని అంశాలే. నా పరిశోదనలో ఒక్కట్టి నేను కల్పించి చెప్పలేదు. ఈ విదంగా ఉండొచ్చు అని మాత్రమె చెప్పాను. ఒక వేళ సైన్స్ వాదులు నమ్మకపోతే దానిని రాదాంతమ్ చెయ్యల్సిన అవసరం లేదు. నేను ఒక సారి కాకపోతే వంద సార్లు, రీపోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది నా మత ప్రచారం లో బాగమ్ కాబట్టి. ఇంకొంత మంది అయితే ఒక పక్క నాది పిచ్చి అంటూనే వీరబోగ వసంతరాయలు గురించి పర్సనల్గా, 'ఈ మెయిల్' చెయ్యమని అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటె ఎవరికైనా ఏమనిపిస్తుంది. నా సబ్జెక్ట్ జనాల్కి బాగానే ఎక్కింది అని. ఇక పోతె నమ్మక్కమంటార, సైన్స్ గాడ్ లే స్పందిస్తుంటే, మిగతా వారి సంగతి చెప్పాలా!ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html మీద క్లిక్ చెస్తే మీకే తెలుస్తుంది వారు ఎందుకు ఎగిరెగిరిపడుతున్నారో,