నిర్బయ ఉదంతం తర్వాత స్త్రిల మీద అత్యాచారాలు గురించి విబిన్న వాదాలు నడుస్తున్నాయి దేశం లో. సాంప్రదయ వాదులు, పొలీసులు, రాజకియ నాయకు అత్యదికులు స్తిల ఆదునిక వస్త్రదారణ వారి మీద అత్యాచారాలు జరిగేలా పురిగొల్పుతుంది అని వాదిస్తుంటే, అదునిక మహిళలు, విద్యార్దినులు మండి పడుతున్నారు. ఇదంతా పొలిసుల, నాయకుల చేతకాని తన్నాన్ని కప్పి పెట్టుకోవాడానికి చెప్పే మాటలు అని వాదిస్తున్నారు.
ఇక్కడ గమనించ దగిన విషయం ఏమిటంటే, స్త్రీల ఆదునిక వస్త్ర దారణే రేప్ లు జరగటానికి కారణమయితే, సాంప్రదాయ వస్త్రదారణ చేసే స్త్రీల మీద అత్యాచారాలు జరుగ కూడదు. లేదా అత్యదిక అత్యాచారాలు అదునిక వస్త్రదారుణిల పైనే జరగాలి! అలా జరుగుతున్నాయా? ఒక వేళా అసలు బట్టలు కట్టుకోకుండా వీదుల్లో తిరిగినా ఆ వంక తో రేప్ లు చేసే హక్కు మగవాళ్ళకు ఉంటుందా?వారి మీద న్యూసెన్స్ కెసులు పెట్టాలే కాని లైంగిక దాడులు చెస్తె అది ఖచ్చితంగా నేరం అవుతుంది.
కాని ఇదే సందర్బంలో ఒక విషయమ్ గుర్తుంచుకోవాలి. అసలు స్త్రీల పట్ల రేప్ లు అదికంగా జరగడానికి ఏ కారాణాలు దోహద పడుతున్నాయి అనే దాని మీద సమగ్ర అద్యయనం జరగాలి. దాని ద్వార కారణాలు కనుగొనడమె కాక అత్యాచారాల నివారణకు తగిన విదానాలు రూపొందించుటకు అవకాశం ఉంటుంది. ఈ అద్యయన కమిటీల్లో, ఈ విభిన్న వాదలు చెసే వారికి ప్రాతినిద్యం కల్పిస్తె మంచిది. కేవలం న్యాయ కమీషన్లు కాకుండా సామాజిక,సాంస్క్రుతిక రంగాల్లో సేవ చెస్తున్న వారిని, మంచి పరిజ్ణానం కలిగిన వారిని ఈ కమిటీల్లో సబ్యులుగా వేస్తే మంచి పలితముంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈదిశగా ఆలోచించాలి.
No comments:
Post a Comment