Monday, April 29, 2013

జగన్ గారు అదికారంలోకి వస్తే "చంద్రబాబు" గారి కి చెరసాల తప్పదా?

                                                                       
  ఇది కేవలం ఊహ జనితమైన ప్రశ్న అని కొట్టివెయ్యడానికి వీలు లేనిది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్తితులను లోతుగా పరిశీలిస్తే తప్పా ఇది బోదపడదు.

  ఉదాహరణకు మన పొరుగున ఉన్న తమిళనాడు నే తీసుకోండి. అక్కడ ప్రాంతీయ పార్తీలదే అధికార పీటం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బి.జె,పి లు చెరొక ప్రాంతీయ పార్టీలకు కొమ్ము కాస్తాయి. అక్కడ ప్రాంటీయ పార్టీ అధినేతలైన జయలలిత, కరుణానిది గార్ల మద్య పచ్చ గడ్డి కాదు కదా ఏ గడ్డి వెయ్యకున్న భగ్గుమంటుంది. కరుణానిధి అధికారం లో ఉన్నప్పుడు అసెంబ్లీలో జయలలిత చీర గుంజి పరభవించారని పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చాక కరుణానిది ని పంచ ఊడిపోతున్నా కట్టుకునే అవకాశం ఇవ్వకుండా పోలిసులు అరెస్ట్ చేసి హింసించారని దుమారం చెల రేగింది. ఇదంతా ఒకరి పై ఒకరు వ్యక్తి గత, పార్టీ గత కక్షలతోనే చేయించారని తమిళ పత్రికల బోగట్టా!

  ఇప్పుడు మన రాష్ట్రం లో కూడ అదే సీనులను మనం చూడ వచ్చనుకుంటా!. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వలన ఈ రాష్ట్రంలో రెండవ ప్రాంతీయ పార్టీ అవిర్భావం జరగటం, దానికి ఆయన కుమారుడు అధిపతి కావటం,చక చకా జరిగిపోయాయి. కాని ఆయన గారి ఖర్మ బాగోక అవినీతి కేసులలో విచారణ నిందితుడిగా జైల్ కెళ్ళవలసి వచ్చింది. ఇదంతా ఒక కుట్ర అని, ఆ కుట్ర వెనుక  అధికారపక్షం మాత్రమే కాక, చంద్రబాబు గారి హస్తం కూడ ఇందులో ఉందని జగన్ గారి వర్గం బలంగా విశ్వసిస్తుంది. దీని తార్ఖాణంగా "చిదంబరం, చంద్రబాబు" ల సీక్రేట్ మీటీంగ్ ని వై.కా.పా. వర్గాలు ఉటంకిస్తాయి. కాబట్టి ఇప్పుడు జగన్ గారి వర్గానికి టార్గెట్ టి.డీ.పి. దాని అదినేత చంద్ర బాబుగారు మాత్రమే అన్నది తేటతెల్లం. మరి దీనికి ప్రతీకారం ఎలా తీర్చుకోవడం?.ఇది జగన్ వర్గాన్ని నిద్రపోనివ్వని సమస్య!

  ఇక ఈ రెండు పార్టీలు, రాష్ట్రంలోని రెండు బలమైన సామాజిక వర్గాల అధికార ఆకాంక్షలకు ప్రతీకలు. పైకి ఎవరేమి చెప్పినా సగటు పార్టీ కార్యకర్తలు ఇదే బావాన్ని కలిగి ఉన్నారు.కాబట్టి ఈ పార్టీల మద్య  అన్ని విషయాలలో పోటీ డీ,అంటే డీ అన్నటే ఉంటుంది. అందుచేత అవినీతి ఆరోపణలతో జైలు పాలైన జగన్ గారి సహజ కోపం చంద్రబాబు గారు ఏదో రకంగా చెరసాల కు వెళితే తప్పా చల్లారదు. అందు చేత ఒక వేళా జగన్ అధికారం లోకి వస్తే "టీ.డి.పి" అధినేత కు ఆరళ్ళు తప్పవు అనుకుంటా!       

1 comment: