Friday, April 12, 2013

ఈ హై డ్రామాకు "అంజలి" ఘటించే వారెవరు?


                                                                

  సినిమా వాళ్ల బ్రతుకులు తెరమీద కనపడేంత అందంగా, ఆనందంగా ఉండవని ఎన్నో మార్లు రుజువైంది. నాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు ఒకటే స్టోరీ.అయినవాళ్లే ఆరళ్లు పెట్టిన వైనం. నటిమణులను డబ్బు సంపాదించే యంత్రాలుగా బావించి వారి మీద ప్రేమ రహిత అధికారం చెలాయించడం,అది తట్టుకోలేక వారు ఇతరుల రక్షణలోకి వెళ్లడాలు, అక్కడా వారి ఖర్మ బాగుంటే ఓ.కె, లేకుంటే ఆత్మ హత్యలు, ఇవ్వన్నీ మామూలే సినిమా వారికి అనిపిస్తుంది.

  అసలు సినిమా రంగమే చాలవరకు క్రుత్రిమ మనుషుల కలయికతో కూడినది అనిపిస్తుంది. వారు ముఖాలకే కాదు, మనసులకు కూడ రంగు వేసుకుంటారు. సీనిమా షూటింగ్ మొదలు అది విడుదలయ్యే దాక అంతా ఫాల్స్ పుబ్లిసిటి మీదే దాని బవిత్యం ఆదారపడి ఉంటుంది. ఒక్క సారి ఆ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టాక ఎవరైనా సరే, ఒక రకమైనా  మానసిక రోగానికి గురి కాక తప్పదేమో. పేరున్న నటీ నటులకు ఎప్పుడూ చుతూ భజనలు చేసే బాకా గాల్లు,పిచ్చి అభిమానుల సంఘాలు కంపల్సరి. ఎక్కువ కాలం ఈ రకమైన వాతవరణమ్ లో ఉన్న వారు ఎవరైనా సరే క్రుత్రిమ మనుషులుగా మారి పోతారు. బ్రతుకులో స్వచ్చత ఉండదు. ఇది తెలియబట్టే మనసున్న  నటుడు  శోబన్ బాబు గారు తమ పిల్లల్ని నటన వైపు కన్నెతి చూడనివ్వ లేదనుకుంటా.

  ఇక తెలివి గల నటులు కొంతమంది తమకు అవకాశాలు తగ్గుతున్నాయి అని తెలియగానే, సినిమా రంగం లాంటి లక్షణాలున్న రాజకీయ రంగానికి షిఫ్ట్ అవుతున్నారు. రెండిటికి కావల్సింది పుబ్లిసిటి, వెర్రి అభిమానమే కాబట్టి డైరెక్ట్ గా జనం ముందు నటించడానికే వస్తున్నారు. ఇలా ఈ రెందు రంగాలు ఈ క్రుత్రిమ వ్యక్తులతో చాల వరకు బ్రష్టు పట్టి పోయాయి.

  ఇక వర్డమాన నటి అని చెపుతున్న "అంజలి" మిస్సింగ్ కేసులో ఈ హై డ్రామా ఎందుకో అర్థం కావటం లేదు. ఒక వేళా ఆ అమ్మాయి బాబాయి కొడితే పోలిసులకు చెప్పిచట్ట రక్షణ తీసుకోవచ్చుగా. ఏవరో నిర్మాత రక్షణలోకి ఎందుకు వెళ్లడం? బహూశా ఈ ఉదంతాన్ని కూడ సినిమా తీసి ప్రేక్షకుల జేబులు లూటి చెయ్యడానికి వేసిన ప్లాను కాదు గదా! ఆ మద్య ఎవరో ఒక పాట( అనిత ఒ అనితా)  రాసిన అజ్నాత ప్రేమికుడు ఎవరా అని టి.వి. చానల్ లో వారం రోజులు ఊదరగొట్టి,లేని పబ్లిసిటి క్రియేట్ చేసి, చివరకు అతనిని గుర్తించినట్లు ఒక హై డ్రామా నడిపారు. చివరకు అదే కదాంశంగా సినిమా కూడ తీశారు. ఇలా చెయ్యడం సినిమా వాళ్లకే చెల్లింది. ఇది అలాంతిదేనేమో!

   మొన్నటిదాక సినిమాలే మనల్ని పిచ్చోళ్లను చేశాయి. ఇప్పుడు కొన్ని వందల చానల్లు  మనల్ని వెర్రి వాళ్ళని చెయ్యడానికి మన ఇంట్లోకే వచ్చాయి.అతి త్వరలో అందరు గుడ్డలు చించుకుని రోడ్ల మీదకు రా వచ్చేమో!                 

No comments:

Post a Comment