మంత్రులు అంటే ఎలా ఉండాలో , తెలిసికోవాలంటే మన రాష్ట్ర మంత్రులని కొంతమందిని చూసి నేర్చుకోవాలనుకుంటా! ఒక పక్క కళంకిత మంత్రులతో మన పాలనా వర్గం ఇలా తగలబడిందేమిటా అని బాదపడే వారికి మొన్న ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు వింటే నోరెళ్ళబెట్టక తప్పదు.
సదరు మహిళా మంత్రిణికి అమె నియోజక వర్గానికే చెందిన ఒక మాజి మంత్రితో తగవులు ఉన్నాయి. వారిద్దరి మద్య అసలు గడ్డి వెయ్యకుండానే భగ్గుమంటుండవచ్చు. కాని అంత మాత్రానికే సదరు మాజి మంత్రి మగ తనాన్ని చాలెంజ్ చేస్తున్నట్లు "మగాడివైతే నా ముందుకు వచ్చి మాట్లాడు" అనాలా? అంతే కాదు తాను గౌరవప్రదంగా, సాంప్రదాయ చీర కట్టుకున్న విషయం కూడా మరచి" చేత కాకపోతే చీర కట్టుకుని ఉండు" అని అనడం ఎంతవరకు బావ్యం. అదే ఏ పురుషుడో ఈ మాట అని ఉంటే మహిళా సంఘాలు ఒక్క పెట్టున గోల చెయ్యరా?
సాక్షాతు ఒక మహిళా మంత్రిణియే, చీర కట్టుకోవడాన్ని చేతకాని తనంగా అభివర్ణిస్తుంటే, సాంప్రదాయ స్త్రీ లోకంను అవమానించినట్లు కాదా? అంతెందుకు ముందు వెనుక కానక తనని కూడా సదరు మహిళా మంత్రి అవమానించుకున్నారు.ఎందుకంటే ఆమె అప్పుడు చీరను కట్టుకుని అన్ని మాటలు అంటున్నారు మరి!
ఒక వ్యక్తి యొక్క సంస్కారం అంచనా వేసేది వారు ఉపయోగించే బాషయే! అసలు ఒక మంత్రి హోదాలో ఉండి పుబ్లిగ్గా ఒక మాజి మంత్రి మగతనాన్ని కించ పరిచేలా మాట్లాడడం సబ్య సమాజం హర్షించదు. ఆ తర్వాత మన సాంప్రదాయం అయిన చీర కట్టుడుని అలా చేతకాని తనంగా అభివర్ణించడం అసలు బాగో లేదు.మన సంస్క్రుతికి ప్రతీక స్త్రీలు అని మనం బావిస్తుంటాం. ఆ బావనలు తప్పు అనేలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారు ప్రవర్తించడం కడు అక్షేపణీయం.
It is shame to see such female
ReplyDeleteministers.
good one.
ReplyDelete