లౌకికవాద పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి గారి సి.బి.ఐ. చార్జ్ షీట్ దాఖలు చేయ్యబడిన మంత్రులపై ఎట్టి చర్యలు తీసుకోకుండా "కళంకిత మంత్రులను కాపాడుతున్న ముఖ్యమంత్రి" గా కొనియాడబడుతుంటే, అక్కడ గుజరాత్ లో "మత వాది పార్టీ " గా ముద్రపడిన పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి "మోడీ" గారు మాత్రం తన కాబినెట్ మంత్రి గారికి క్రింది కోర్టు వేసిన శిక్ష చాలదు "ఉరి" తీయాలని సుప్రీం కోర్టును కోరవలసిందిగా అధికారులను అదేశించాడట!
ఔరా! ఏమి ఈ విచిత్రం. లౌకిక వాదమంటే తప్పు చేసిన వాడిని , చెయ్యని వాడిని ఒకేరీతిగా చూడటమా! అలా చూడరు కాబట్టె మతవాదులంటె ఈ ఉదార పురుషులకు ఇంత లోకువా!.ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎవరు ఏమిటో "వారు చెప్పే శ్రి రంగ నీతులు బట్టి కాక, చేసే పనులు ద్వారా గుర్తించండి". లేకుంటె మనం చెయ్యగలిగేది ఏమి ఉండదు, వారు వేసే డ్రామాలు చూడటం తప్ప!
నిజం చెప్పారు. కనీసం చదువుకున్న వాళ్ళైనా ఆలోచించాలి.
ReplyDeleteదన్యవాదాలు యమ్వీ అప్పారావు గారు.
Delete