Thursday, March 13, 2014

రాష్ట్ర అద్యక్షుడైనా సరే , ఒంగుంటే "ఓటు మాయం" అట!

                                                            

                                                          

అయన పేరు కఠారి శ్రీనివాస రావు గారు . అయన హోదా "లోక్ సత్తా" అనే జాతీయ పార్టికి రాష్ట్ర అద్యక్షులు . అంటే ఆంద్ర ప్రదేస్ లో ఆ పార్టి బాగోగులు చూడాల్సిన వారు . ఆయనకు గత ఎనిమిదేళ్ళుగా సేరిలింగం పల్లి బూతులో ఓటరుగా తన ఓటు హక్కు వినియోగించు కుంటున్న వ్యక్తీ . దానికి గుర్తుగా ఎప్పుడూ అయన ఓటరు కార్డు అయన జేబులోనే ఉంటుందట . కాని మొన్న ఎందుకో ఓటరు లిస్టు చూస్తె అయన పేరు గారి అయన కుటుంభ సబ్యుల పేర్లు కాని ఓటరు లిస్టు లో లెవట . దానితో ఖంగు తిన్న అయన తిరిగి కొత్తగా ఓటరు లిస్టు లో నమోదు కోసం అప్లై చేసుకున్నారట . దినంతటికీ కారణం ఒంగుంటే ఓట్లు మాయం చేసే ప్రత్యర్ది రాజకీయ పార్తిలే అని అయన గారి అరొపణ . నిజమే సుమా ! అప్పుడప్పుడు చెక్ చేసుకోక పొతే ఏదైనా మాయం చేయగల వారున్న రాష్ట్రం ఇది. తస్మాత్ జాగర్త !
 ఇంతకీ అయన గారి ఈ విషయం గురించి ఏమన్తున్నారి ఈ  విడియోలో తిలకించండి .
      

Monday, March 3, 2014

ముంబాయి పోలీసులు అనూహ్య మర్డర్ కేసును మరో "అయేషా " కేసు గా మార్చ బోతున్నారా !?

                                                             


వినేవాడి చెవిలో పువ్వులు ఉంటె చెప్పేవాడు ఎన్ని కట్టు కదలు చెప్పటానికైన రెడి ! భారత దేశం లో నిర్బయ ఉదంతం తర్వాత జరిగిన హత్యల్లో ఆంద్ర ప్రదేస్ లో ని మచిలీ పట్నం కు చెందిన మహిళా  ఇంజనీర్ అనూహ్య కేసు కూడా ఒకటి . అ హత్య జరిగి నెలలు గడుస్తున్నా నిన్నటి వరకు ఏ  క్లూ సాదిo చినట్లు ముంబాయి పోలీసులు మీడియాకు చెప్పలేదు . ఈ రోజు మాత్రం ఒక 35 ఏండ్ల వ్యక్తిని, హత్య చేసిన నిందితుడిగా ముంబాయి కోర్టులో ప్రవేశ పెట్టి , రిమాండ్ కు పంపించారు . కొద్ది సేపటి క్రితం ముంబై  పోలిస్ వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి , అనూహ్య కేసులో మిస్టరి చేదిoచామని, ఆమెను  సనప్  అనే పాత నేరస్తుడు , టాక్సీ డ్రైవర్ గా ఆమెను తీసుకు వెళ్లి , అత్యాచారం లేక రాబరి చేయబోతే ఆమె ప్రతిఘటించడం వలన , ఆమెను ఉరి వేసి చంపి , ఆ  పై పెట్రోల్ పోసి తగల బెట్టాడని చెప్పుకొచ్చారు . ఇదంతా వింటుంటే కొన్ని అనుమానాలు బుర్ర ఉన్న వారికెవరికైనా జనిస్తాయి . మరి ఘన మైన ముంబాయి పోలిస్ వారికి రాలేదంటే నమ్మడం కష్టం . కావాలనే ఎవరో వెనుక ఉండి ఈ  కేసును అయేషా కేసు లో మాదిరి పక్క దారి పట్టించి అసలు నెరస్తులను రక్షించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది . ఈ  కేసులో కలుగుతున్న అనుమానాలేమిటంటే ---

    ఎస్తేర్ అనూహ్య ముంబాయి T.C.S కంపెనీలో ఉద్యోగిని . ఆమె గత క్రిస్టమస్ కి తన స్వస్తలం మచిలీ పట్నానికి  వచ్చి , తిరిగి జనవరి మూడవ తారికున బయలు దేరింది . 4 వ తారికున హైదరాబాద్లోని ప్రెండ్స్ తో పార్టి లో పాల్గొని ఆ సాయంత్రం ముంబాయికి రైలులో బయలు దేరింది . 5 వ తారీకు తెల్లవారు జామున ముంబాయిలో దిగిన తర్వాత కొంత సేపు వెయిటింగ్ రూమ్ లో ఉండి అ తర్వాత ఒక వ్యక్తికీ తన బ్యాగ్ ను ఇచ్చి , తానూ సెల్ పోన్లో మాట్లాడుతూ బయటకు వేలుతుండడం క్లియర్ గా రైల్వే స్టేషన్ లోని సి.సి. పుటేజ్ లలో కనిపించింది . అయితే ఆమె తో పాటు పుటేజ్ లలో కనిపించిన వ్యక్తే ఈ రోజు పోలీసులు చెపుతున్న
   సనప్  పాత నెరస్తుడట.పార్ట్ టైం కాబ్ డ్రైవర్ గా ఉన్న అతనికి అనూహ్యను తీసుకు వెళ్ళిన రోజు మాత్రం కాబ్ లెదట . తను కాబ్ డ్రైవర్ ని అని చెప్పి ఆమెతో 300 రూపాయల బేరం కుదుర్చుకున్న అతను  బయట వరకు ఆమెను తీసుకువచ్చిన తర్వాత , తన దగ్గర కాబ్ లేదని మోటార్ సైకిల్ మిద డ్రాప్ చేస్తాను అంటే మొదట్లో అనూహ్య ఒప్పుకోలేదట . అ తర్వాత ఆతను అనుమానం ఉంటె నా సెల్ తీసుకుని మిరేవరితోనైనా పోన్ చేసి విషయం చెప్పండి, కాని నన్ను మాత్రం నమ్మండి , మిమల్ని నమకంగా ఇంటి దగ్గర దిగబెడతాను అంటే , దానికి ఆమె కూడా అతని పోన్ తీసుకుని ఎవరికో పోన్ చేసినట్లు నటించిందట కాని నిజంగా చేయలేదట . గుడ్డిగా అతనిని అనుసరించి హత్యకు గురి అయిo దట . ఇది పోలిస్ వారి కహాని . ఈ కహాని లో   కలుగుతున్న అనుమానాలేమిటంటే -

  (1).  ముక్కు ,  ముఖం తెలియని వాడు కాబ్ ఉందని చెప్పి బయటకు తీసుకు వచ్చి , అక్కడ మోటార్ సైకిల్ చూపించి దాని మిద దిగబెదతాను అంటే అ ఇంజనీర్ నమ్మి గొర్రె పిల్లలా అతని వెంట వెళ్ళిందా ?

 (2). "నా మిద అనుమానం ఉంటె మిరేవరికైనా నా సెల్ లోనే నా గురించి సమాచారం ఇచ్చాకె నాతొ రండి"అని అతడు అంటే సరే అని సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడినట్లు నటించాల్సిన అవసరం ఆమెకు  ఏమిటి? ఖచ్చితంగా ఆమె తనకు తెలిసిన వారేవరితోనో మాట్లాడి , వారు పర్వాలేదు అతనితో వెళ్ళమని రికమెండ్ చేసాకే వెళ్లి ఉండాలి . అ నిందితుడు కూడా  ఆమెకు తెలిసిన వ్యక్తీ చెపితేనే ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చానని , కావాలంటే అతనితో/ఆమె తో మాట్లాడండి అని తన సెల్ ఇచ్చి ఉండాలి . అ విషయాన్ని ఆమె అతని సెల్ ద్వారా కన్పర్మ్  చేసుకున్నాకే అమాయకంగా అతనిని అనుసరించి బలి అయి పోయి ఉంటుంది .
(3). ఈ  కేసులో ముంబాయి పోలీసులను ఇమ్ప్లూయన్స్ చేయగలిన వారి హస్తం ఉంది ఉండాలి .వారికి ఆ అమ్మాయికి ఏదో బేదాభిప్రాయాలు ఉంది ఆమె బ్రతికి ఉంటె తమకు ముప్పు అని ముంబాయి పాత నేరస్తులతో ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండాలి . తమక్జు ఉన్న ఇన్ప్లోయన్స్ తో కేసుకు మసి పోసి మారేడు కా య చేసి , పాత నేరస్తులకు కేసు అంట గట్టి , తము తప్పించుకునే ప్రయత్నం అని అనిపిస్తుంది తప్ప, పోలిస్ వారి కహాని ఎ మాత్రం నేమ్ విదంగా లెదు.
        ఈ కేసును నిజాయితిగా సి.బి.ఐ వారి చేత దర్యాప్తు చేస్తే తప్పా నిజాలు నిజాలు వెలుగులోకి రావు . అ  దిశగా ఆమె సంబదికులు చర్యలు తీసుకోవాలి . అవసరమైతే తెలుగు  ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .

Wednesday, February 26, 2014

ఖమ్మం జిల్లా మంత్రి ,శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి &అదర్స్ మిద మద్యం సిండికేట్ కేసు పెట్టాల్సిందే అన్న హై కోర్టు !

                                                         


రూల్ ఉంటె కోర్టుకు పో ! లేకుంటే మంత్రి దగ్గరకు పో ! అనేది లౌక్యం తెలిసిన కార్య సాధకుల మాట!. ఆ  మాట అక్షరాల నిజమేనని రుజువైంది ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి . కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన సంగతి ఎలా ఉన్నా ,బడా  బడా నిందితులు మిద చట్ట పరమైన చర్యలు తీసుకున్నది మాత్రం అయన గారి హయాంలోనే . అయితే అయన గారి నిజాయితిని కూడా సవాలు చేసేలా తయారయింది 2012 లో A.C.B  వారు జరపిన మద్యం సిండికేట్ కెసు. ఈ  కేసులో 12 మంది M.L.A  లతో పాటు ఇద్దరు మంత్రులు శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి , మోపిదేవి వెంకట రమణతో సహా చాలా మంది అధికార అనదికారులమిద విచారణ జరిపారు . అయితే సరి అయిన ఆదారాలు ఉన్నా ప్రజా ప్రతినిధులు మిద కేసులు నమోదు చేయకుండా , రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నిరు గార్చడానికి చూస్తున్నారని A.C.B మిద ఆరోపణలు వచ్చాయి .

   చివరకు ఆ ఆరోపణలు ఆదారంగా హైకోర్టులో ఒక ప్రజా హిత వ్యాజ్యం దాఖలు కాగా , దానిని పరిశిలిoచిన ఆంద్ర ప్రదెస్ హై  కోర్టు వారు ఆదారాలు ఉన్న వారి మిద కేసులు నమోదు చేసి 3 నెలలలో విచారణ పూర్తీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ  చేసింది . ఇన్నాళ్ళు ఆగి తీరా ఎన్నికల ముందు ఇలా హై  కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు కాని ,  చైతన్యం కల ప్రజలు ఉన్న సమాజంలో పాలకులు తాము ఏమి చేసినా అడిగే వారు ఉండరు అనుకోవటం పొరపాటే . ఆదారాలు ఉంటె ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు . నిందితులు కోర్టుల్లో విచారణ ఎదుర్కుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపిoచు కోవలసిందే  అని పై ఉదంతం తెలియ చేస్తుంది .
  ఈ విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది విడియో ను చూడండి
                  
            

Tuesday, February 25, 2014

మాట తప్పి , ఆంద్ర ప్రదేశ్ లోకే అడుగుపెడుతున్న "తెలంగాణా దొర " గారికి స్వాగతం! సుస్వాగతం !

                                                                   


మొన్నతెలంగాణా   దొర  విమానం ఎక్కి డిల్లికి పోయాడు . బేగం పేట విమానాశ్రయం దగ్గరకు పోయేసరికి ఆయనకి ఒక పోన్ కాల్ డిల్లి నుంచి వచ్చింది . ఈయన దగ్గర M.P  సీటు ప్రామిస్ తీసుకున్న డిల్లీ  నాయకుడు ఒకరు ,  దొర గారికి డిల్లి ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నాడు . ఆ ఇంఫార్మరే పోన్ చేసి మరి చెప్పాడట ! ఈ పార్లమెంట్ సెషన్ లోనే తెలంగాణా బిల్ పాస్ చెయ్యాలని మేడం హుకుం జారీ  చేసేసారట ! అందుకే ఇక తెలంగాణా O.K అని సమాచారం . ఆ మాట వినగానే ఒళ్ళంతా పులకరించింది తెలంగాణా దొరకి . అంతే ! అప్పటికప్పుడు అక్కడున్న మీడియా వారి ముందు వీర ప్రతిజ్ఞ చేసేసాడు . "నేను అడుగంటూ తిరిగి హైదరాబాద్ లో పెడితే "తెలంగాణా రాష్ట్రం " లోనే తప్పా ఆంద్ర ప్రదేశ్ లో కాదు " అని . ఆ మాట విని తెలంగాణా ప్రజలు సంతోషించారు .

   కాని అదే తెలంగాణా దొర ఈ  రోజే డిల్లి నుండి హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు . ఆయనకు తెలంగాణా చరిత్రలో ఎవరికీ పలకని ఘన స్వాగతం పలికేందుకు అయన గారి పార్టి సంసిద్ధులు అవుతున్నారు . మంచిదే ! కాని అయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి ? చేస్తున్న పని ఏమిటి? అయన తిరిగి అడుగు పెడ తానన్నది తెలంగాణా రాష్ట్రంలో . కాని అడుగు పెడుతున్నది ఆంద్ర ప్రదేశ్ లో . కనీసం టెక్నికల్ గా కూడా తెలంగాణా ఎర్పడలేదే ! దానికి రాష్ట్రపతి గారు అప్పాయింటెడ్ డేట్ ను ప్రకటించాల్సి ఉంది కదా ! ఆ  రోజు నుంచి కదా తెలంగాణా ఏర్పాటు ! మరి ఈ నాలుగు రోజులు డిల్లిలోనే ఉండీ రాష్ట్రపతి గారి చేత అ డేట్ ప్రకటింప చేసి , తెలంగాణా ఏర్పడిన తోలి రోజున తోలి అడుగు డిల్లి నుండి వచ్చి పెడితే ఎంత గొప్పగా ఉండేది ? ఇలా  ప్రతిజ్ఞా బంగం చేసి అయన రావడం! దానికి చరిత్ర లో గుర్తుంచుకునే స్వాగతం పలకడం ! చివరకు ప్రజలు అయన వాగ్దానా బంగాన్నే గుర్తుంచుకునే ప్రమాదం ఉంది .

  ఏదైనా దొర  దొరే ! అయన చెప్పిందే వేదం . అందుకే ఆయనకు స్వాగతం! సుస్వాగతం

Sunday, February 23, 2014

రాజకీయపార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయక తప్పేట్టు లేదు !.

                                                        
                                                           

ఆంద్ర ప్రదేశ్ లోని   రాజకీయ పార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేస్తే బాగుంటుంది కదా అని ఆ లోచిస్తున్నారట కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు!. ఇన్నాళ్ళు అంటే తెలుగు జాతికి ఒకే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నే ప్రాంతీయ పపార్టీలుగా  ఉంటూ తెలుగు ప్రజలు అందరికి సేవ చేసే బాగ్యం దక్కినందుకు పొంగిపోతూ  ఉండేవారు . ఇప్పుడు హఠాతుగా  రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే సరికి వీరికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎదురయింది . అదేమిటంటే

   ఏదైనా ఒక ప్రాంతీయ  రాజకీయ పార్టి ఒకటి మించి వేరే రాష్ట్రాల్లో అదే గుర్తుతో పోటి చేయాలంటే దానికి జాతీయ స్తాయి గుర్తింపు కావాలి . మరి అలా ఉండాలంటే కనీసం 4 రాష్ట్రాలలో సదరు పార్టికి చట్ట ప్రకారం ప్రాతినిద్యం ఉండాలి . కాని ఇప్పుడు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వలన కంపల్సేరిగా  ప్రాంతియ పార్టీలు రెండు రాష్ట్రాలలోను పార్టీని నడపాల్సిన పరిస్తితి. మరి అటువంటప్పుడు రెండు రాష్ట్రాలలోను ఒకే గుర్తు మిద పోటి చేయాలంటే అ దానికి జాతీయ పార్టి గుర్తింపు కావాలి . అందువల్ల మరో రెండు రాష్ట్రాలు వాటికి కావాలి . ప్రాంతీయ పేరులు పెట్టుకుని ఇతర రాష్ట్రాలలో పార్టి ని విస్తరించలెరు . కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయం , సెంట్రల్  చట్టానికి సవరణలు చెయ్యడం లేదా ఉన్న రెండు రాష్ట్రాలను మరో రెండు ముక్కలు చేయడం . కాబట్టి రానున్న 10 సంవత్సరాలలో మరో 2 రాష్ట్రాలు తెలుగు నాట అవతరిoచ వచ్చు .

   మంచి కైనా చేడుకైనా నలుగురు ఉండాలి అంటారు . తెలుగువారి రాష్ట్రాలు కూడా నాలుగు ఉంటె మనకి జాతి య హోదా రాకపోయినా , పార్టీలకు ఒక జాతీయ గుర్తింపు  వస్తుంది కదా !

Saturday, February 22, 2014

రాజీవ్ గాంది ,సంజయ్ గాంది , గార్లు ఒక తండ్రి బిడ్డలు కారా ?!

                                                      
         
                                                                

ఇంతవరకు నాకు తెలియని అంశం . అపకొర్స్ తెలిసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదనుకోండి . కాకపొతే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది . రాజీవ్ గాంది , సంజయ్ గాంది  గారాలు ఇందిరా గాంది  గారి పుత్రులే కదా. మరి సంజయ్ గాంది  గారి కుటుంభం అంత నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది అని . అది ఇందిరా గాంది , మేనకా గాంది  గారలు మద్య ఉన్న బెదాభిప్రాయాలు అనుకున్నాను కాని ఈ రోజు వారి తండ్రులు వేర్వేరు అని తెలిసాక బహూశా అదే కారణమై ఉంటుందనుకుంటున్నాను . నాకు ఆ సంగతి తెలిపినడది  పైన చిత్రంలో ఉన్న నెహ్రూ గారి వంశ  వృక్షమే . నెహ్రూ గారిది కాశ్మీరి  బ్రాహ్మణ వంశం అంటారు చాలా మంది. అది నిజం కాదని వారిది లౌకిక వoశ మని పై పట్టిక ద్వారా తెలుస్తుంది .అందుకే వారికి హిందూ అంటే సరిపడదు అనుకుంటా !

Friday, February 21, 2014

బ్రహ్మం గారు చెప్పిన "కాలజ్ఞానం" నిజమయినా కాకకపోయినా" కల్కిఖడ్గం" చెప్పిన భవిష్య వాణి మాత్రం నిజమయింది !.

కల్కిఖడ్గం

                                                         

నేను ఈ బ్లాగు మొదలు పెట్టడమే భవిష్య ద్రష్ట లు చెప్పిన ఒకానొక విషయం మిద . అదిఏమిటంటే డిసెంబర్ 21, 2012 న యుగాంతం అని . మొదట్లో నా బ్లాగు పేరు కూడా అదే . ప్రపంచంలో చాలా దేశాలలోని ప్రజలు దానిని నమ్మిన వారు ఉoడొచ్చు. కాని దాని గురించి కోట్లాది మంది ప్రజలు మాత్రం ఉత్సుకత చూపించారు అనేది మాత్రం నిజం . నా బ్లాగులో మాత్రం నేను యుగాంతం గురించి కాదు కాని ఆ రోజు బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన వీరబొగ వసంత రాయలు వస్తాడు అని చెప్పాను. నా బ్లాగు పట్ల కూడా వీక్షకులు కొంత ఆసక్తి చూపారు . అయితే విరబొగ వసంత రాయలు అంటే ఉన్న అర్ధం వేరని అయన వచ్చింది నిజమే అని కొన్ని కారణాల వల్ల ఆయన్ని కనుకొవటం కష్టం అని నేను ప్రచురించిన టపా చూసి   వీక్షకులు నిరాశ చెంది , కేవలo నా బ్లాగు పాపులారిటి కోసం అ పని చేసాను అని అనుకున్నారు . O.K .  నాడు వీరభొగ వసంత రాయలు విషయంలో నేను చెప్పినది నిజం అయినా కాకపోయినా , ఇదే బ్లాగులో పిబ్రవరి 1, 2013 న నేను చెప్పినది మాత్రం నిజమైంది . అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు . నేను పిబ్రవరి 1,2013 న ఏమి చెప్పాను అంటే 
            
   "అదిష్టానం వాగ్దానాల మీద పార్టీలకు నమ్మక్కం లేదు. అందుకే అదిగో తెలంగాణా ఇదిగో తెలంగాణా అంటే అవన్ని పిల్లకాయ మాటలుగా బావించారు. అలాగే పార్టీ అభిప్రాయాలను, అంద్రా ప్రజల అభిప్రాయాలను బేఖాతరు చేసి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్తితిలోను "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు."  
                   అని చెప్పాను . మొన్న 20-2-2014 నాడు తెలంగాణా బిల్  సొనియా గాంధి గారి పట్టుదలతో ఉభయ సభలలొ ఆమోద ముద్ర పడింది . ఇక కేవలం లాంచన ప్రాయమైన రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది . కాబట్టి నేను చెప్పిన మాట నిజమయింది కదా! బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమయినా కాకకపోయినా కల్కిఖడ్గం చెప్పిన భవిష్య వాణి నిజమయింది !.వీరభొగ వసంత రాయలు రాకపోయినా ,కల్కి ఖడ్గం చెప్పిన విదంగా తెలంగాణాని  మాత్రం సోనియమ్మా ఇచ్చింది .

    
  1-2-2013 నాడు పెట్టిన టపా కోసం క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి .  

నాన్నా "తెలంగాణా" వచ్చే! http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

    

Thursday, February 20, 2014

ఈ పదేళ్ళ పందానికి తెలుగు రాజకీయ నాయకులు సిద్దమా !?

                                                             

అయిందేదో అయిపొయింది . మంచో , చెడో ,తను ఎంత పోరాడినా తను అనుకున్నది కానప్పుడు ఏది జరిగినా ఆ  దైవ నిర్ణయం అనుకుని ముందుకు సాగడమే జ్ఞానుల లక్షణం . తెలంగాణా కోసం కోట్లాది ప్రజలు కోరుకున్నారు అనేది వాస్తవo . శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ రానంతవరకూ తెలంగాణా సిమాంద్ర ప్రాంతం కంటే చాలా వెనుకబడి ఉందనే తెలంగాణాలోని అత్యదిక శాతం ప్రజలు అనుకున్నారు . అందుకే తెలoగాణా వేరు పడితే తప్పా అభివృద్ధి సాదిoచలెము అన్న తెలంగాణా నాయకుల మాటను సమర్దిoచారు. దానికి తోడూ రాష్ట్రంలోని ఎ రాజకీయ పార్టి (C.P.M తప్పా ) తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదు . కాబట్టే రాష్ట్ర విభజన సాధ్య పడింది . ఇప్పటికి సిమాoద్రా లోని సామాన్య ప్రజలలో విభజన అంటే ప్రజల మద్య ఎడబాటే అనే బావనతొ ఉండటం వలన శోక తప్తులై ఉన్నారు . కొంత మంది మాత్రమె హైదరాబాద్ ను U.T చేస్తే చాలు అనుకుంటున్నారు తప్పా , సామాన్య జనం మనస్పూర్తిగా విభజనను ఒప్పుకోవడం లేదు . అలాగే తెలంగాణా జిల్లాలోని  అత్యదిక శాతం ప్రజలు విభజన కావాలనే కోరుకుంటున్నారు . అయితే గడచినా 60 సంవత్సరాలుగా సిమాoద్రా నుండి లక్షలాదిగా ప్రజలు తెలంగాణా కు వచ్చి ఇదే తమ జన్మ భూమి అని స్తిర పడిపోయారు . విరెవ్వరికి మనస్పూర్తిగా రాష్ట్ర విభజన ఇష్టం లేదు . కాకపొతే తామున్న దగ్గర సమస్యలు కొని తెచ్చు కోవడం ఇష్టం లేక అందరితో పాటు తాము తెలంగాణా కు జై అంటున్నారు .

  సరే ఏదేమైతేనేం ఆర్టికిల్ 3 అనేది ప్రజల్ని విదదియలెదు . ప్రాంతాలను అది కూడా రాజకీయంగా విడదీయ గలుగుతుంది . సమర్ధులు పాలకులు గా ఉన్నంత కాలం సమైక్యంగా ఉంటారు  , పాలించే వారిలో చేవ చచ్చినప్పుడే  విడిపోతుంటారు అనేది చారిత్రిక సత్యమ్. కాని ఇప్పుడు మాత్రం ప్రజలు కాకుండా ప్రాంతాలను రాజకీయ నాయకులు విడగొట్టుకున్నార్రు . వారు తమ సమర్ధతను చూపించి తమ ప్రాంతాలను స్వర్గ దామం చెయ్యాలని ఉవ్విలూరుతున్నారు . వారి కోరికను కాదనడం ప్రజలకు పాడి కాదు. ఈ రోజు ఏ ఆర్టికిల్ ద్వారా విడి పొయామో అదే ఆర్టికిల్ కి తిరిగి కలిపే శక్తి ఉన్నాడని నేతలుకు తెలియంది కాదు . అందుకే ఈతెలంగాణా  సిమాంద్ర నేతలకు మద్య తెలుగు ప్రజలు ఒక పందెం  పెడితే ఎలా ఉంటుంది ?

  పందెం ఎందుకంటే , తెలంగాణా నెతలెమొ విడిపోతే బాగుపడతాం అంటుంటే , సిమాంద్ర నేతలేమో కలిసి ఉంటే నే బాగుంటాం అంటున్నారు . సామాన్యుడికి సమర్దుడైన నాయకుడి పాలనే కావాలంటున్నారు . మంచో , చెడో ఇంకా 10 ఏండ్లు  రాజధాని , హై కోర్టు , విద్యా అవకాశాలు ఉమ్మడిగా ఉండాల్సిందే . కాబట్టి ఈ 10 యేండ్ల లో ఎ రాష్ట్రం ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందో చూడాలి . ఒక వేల తెలంగాణా ఎక్కువగా  అభివృద్ధి చెందితే విడిపోయిన రాష్ట్రాలు యదావిదిగా ఉండాల్సిందే . లేదూ సిమాంద్ర ఎక్కువుగా అభివృద్ధి చెందితే మరల ఆర్టికిల్ 3 ని ప్రయోగించి రెండు రాష్ట్రాలను కలపాలి. ఇప్పుడు 10 ఏండ్లు విడిపోయినంత మాత్రానా నష్టం ఏమి ఉండదు . ఎందుకంటే అప్పటి దాక కేంద్రం వారు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి , 10 ఏండ్లు రాష్ట్ర విభజన వల్ల లాభమే తప్పా నష్టం ఉండదు .

  మరి పైన చెప్పిన విదంగా పందానికి మన రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా ? ఒప్పుకుంటే 2014 నాటికి తెలుగు రాష్ట్రాలు  ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు పొందుతాయి అనడంలో నాకైతే సందేహం లెదు.

Tuesday, February 18, 2014

రాష్ట్ర విభజన బిల్ ని హై కోర్టు ఆపినట్లేనా !?

                                                         



ఇప్పుడే అన్ని చానల్స్ లో ప్రసారం చేస్తున్న దాని ప్రకారం ఆర్టికిల్ 3 మిద హై కోర్టు న్యాయవాది శ్రీ P.V క్రిష్నయ్య గారు వేసిన పిటిషన్ ను ఆంద్ర ప్రదెశ్ కోర్టు వారు ఈ రోజు అడ్మిట్ చేస్తూ , కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలకు నోటిసులు జారి చేసింది అని తెలుస్తుంది . . మరి ఇటువంటి పరిస్తితుల్లో రాష్ట్ర విభజన బిల్ మిద చర్చలు కొనసాగించడం కరెక్టు కాకపొవచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ బ్లాగులో ఇంతకూ ముందు టపాలో నేను చెప్పిన కాంగ్రెస్ డ్రామా నిజమేనని రుజువైనట్లే ! దిని మిద ఏమి జరుగబొతు0దో ఇంకా కొన్ని గంటల్లోనే తెలస్తుంది ఆ తర్వాత ఎవరు ఏమి చేసారో ఒక స్పష్టమైన అవగాహన కు రావచ్చు . అంతవరకూ డ్రామాలను చూస్తూ ఉండడమే!
అప్ డేట్ : హై కోర్టు నోటిసుల  జారి విషయం గురించి తర్వాత చానల్స్ ప్రసారం చేయటం మానివేయటం చూస్తుంటే , బహూశా ఇది కూడా అబద్దమేనేమో ! ఏది ఏమైనా పార్లమెంటులో మూజువాణి వోటుతో తెలంగాణా బిల్ పాస్సయిoది.ఈ  దెబ్బతో ఏదో రకంగా తమ ఇన్నాళ్ళ కోరికను తీర్చిన సోనియా గాంది తెలంగాణా ప్రజల పాలిత దేవత గా మారితే , సిమాoద్రాలొ దెయ్యం గా మారింది .బిల్ ఎలాగు రాజ్య సభలో కూడా పాసవుతున్ది కాబట్టి రాష్ట్ర విభజన అయినట్లే!అయిందేదో అయింది ! ఇక సిమాoద్రా వారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయి కాంగ్రెస్ లాంటి చట్ట ఉల్లంగనలకు పాల్పడే పార్టీలను వారి ప్రాంతంలో మనుగడ లేకుండా చెయ్యడమే వారు చేయగలిగిన వివేకమైన పని. ఇక తెలంగాణా వారు "సంబురాలు " మొదలెట్టేసారు కాబట్టి అంతా హ్యాపిసె ! 

Monday, February 17, 2014

సరి అయిన బిల్లు ఏమిటో నాయకులకు తెలియదు! సరి అయిన సమయం ఏమిటో లాయర్లకు తెలియదు!

                                                     


ఆల్  ఇండియా గ్రేట్ డ్రామా కంపెని అయిన  కాంగ్రెస్ వారు ఆడుతున్న నాటకంలో  మంచి రసవత్తర సీన్  నడుస్తుంది . అయితే ఇంత పకడ్బంది నాటకం ఆడి వారు రుజువు చేయడలచింది  ఏమిటంటే తాము రాజ్యంగ పద్దతులు తెలియని మూర్కులమని , తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తప్పా , దాని పలితాలకు తాము బాద్యులం  కాదని తెలంగానా ప్రజలకు తెలియచెయ్యదమే . దిని వలన రాష్ట్ర విభజన బిల్ పాస్ చేసినా దాని పలితం మాత్రం మాత్రం తెలంగాణా ప్రజలకు దక్కుద్దా లేదా అనేది అనుమానంగా ఉంది . . ఈ అనుమానాలు కలగటానికి గల కారణాలు ఇవి
(1). తెలంగాణా బిల్ మిద ఇప్పటివరకు 3 పిటిషన్ లు సుప్రీం కోర్టులో వేయడం జరిగింది . ఆ  మూడింటిని కోర్టు వారు ఒకే ఒక కారణంతో తిరస్కరించారు . అది ఏమిటంటే పిటిషన్ లు విచారించడానికి ఇది సరి అయిన సమయం కాదు, అ సమయం వచ్చాక తప్పకుండా విచారిస్తo అని. దిని వలన అర్దమయ్యేది ఒకటే.. విభజన బిల్ మిద పార్లమెంట్ నిర్ణయం వెలువడ్డాక పిటిషన్ వేస్తె తప్పకుండా విచారణకు స్వికరిస్తామ్ అని ఒక అభయం సుప్రీం కోర్టు వారు ఇచ్చినట్లే కనబదుతు0ది. సుప్రీం కోర్టు లో ఏంతో అనుభవమున్న సీనియర్ లాయర్లు పోయిన సారి వాదించి నపుడు ఇదే విషయం సుప్రిం కోర్టు వారు చెప్పినప్పటికీ "సరి అయిన సమయం " అంటే ఏమిటో తెలియక సిమాంద్ర లాయర్లు "ముద్ద ముద్దకు  బిస్మిల్లా " అన్నట్లు , కేంద్రం ఒక స్తెప్ వేయగానే పిటిషన్ ఒకటి వేస్తూ "సమయం వచ్చిందా , రాలేదా ? అని టెస్ట్ చేస్తున్నారు . ఇది లాయర్ల పరిస్తితి !

 (2). ఇక పొతే నాయకులు విషయానికి వస్తే , అసెoబ్లికీ పంపాల్సింది బిల్లో , డ్రాప్ట్ బిల్లో వారికి తెలియదు . కొన్ని గంటలు చర్చ జరిపాక "తూచ్ ' ఇది డ్రాప్ట్ బిల్ " అని మూజు వాణి  వొటుతో తిరస్కరిస్తారు . 117 మంది సబ్యులు అనుకూలంగా ఉన్న బిల్ మూజువాణితో వోటు తో తిరస్కారానికి గురి అవుతుంటే నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకున్నట్లు మిన్నకుండి పోయారు  తెలంగాణ నాయకులు . పార్లమెంట్ మనదే అయినా , సుప్రీం కోర్టు మనది కాదు అన్న  జ్ఞానం లేకుండా పోయింది వారికి. ఒక వేళ తెలంగాణా బిల్ పార్లమెంటులో పాస్ అయినా కోర్టు వారు ఆపితే, దానివలన కాంగ్రెస్ కె లాభం . ఇచ్చిన మాటకు కట్టు బడి K.C.R గారు తమ పార్టిని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు . దాని వలన T.R.S నాయకులకు నష్టమైనా ,  K.C.R గారికి మాత్రం డిల్లీలో సోనియా గాంది గారి పర్మనెంట్ కోటరిలో మెంబర్ షిప్ లబిస్తుంది . ఎలాగు రాష్ట్ర విబజన ఆగింది కదా అని సిమాoద్రులు కిరణ్ గారికి జై అంటారు . కిరణ్ గారి ఖాతాలో జమ అయ్యే సీట్లు అన్ని అంతిమంగా కాంగ్రెస్ కు జమ అయ్యెవె ! ఇంత  మహత్తరమైన ప్లాన్ తో గొప్ప నాటకానికి తేరా తిసిందా కాంగ్రెస్ అనిపిస్తుంది . 
    (3) ఇక జాతీయ ప్రతి పక్ష హోదాలో ఉన్న B.J.P విషయానికి వస్తే, పార్లమెంటులో బిల్ ప్రవేశ పెట్టారో లేదో ఘనత వహించిన పార్లమెంటేరియన్ లకు తెలియదట ! బిల్ ప్రవేశం జరిగిపోయిందని అధికార పార్టి వారు అంటుంటే , "సభలో ఉన్న మాకు తెలియకుండానా ! అని బోల్డంత ఆశ్చర్య పోతున్నారు ప్రతి పక్ష నెతలు. చట్టాలు తయారు చేసే వారే , తమ పార్టి స్వార్దాల కోసం డ్రామాలు ఆడుతున్న దేశం లో ప్రజలకు దిక్కెవరు?
           ఈ డ్రామాల వల్ల  తెలుగు ప్రజలు చివరకు ఎ పరిస్తితులకు గురి అవుతారో రాబోయే వారం రోజులలో జరగబోయే పరిణామాలు నిర్ణయిస్తాయి .