Friday, August 16, 2013

ఐదేళ్ళ పాటు కే .సి.ఆర్ గారి అద్వర్యంలో "ట్రయిల్ తెలంగాణా " నడపితే తెలుస్తుంది !

                                                                
                                                                 

 తెలంగాణా యువతలో, ఉద్యోగులలో , విద్యార్దులలో చాలా ఆశలు ,అపోహలు ఉన్నాయి  వాటిని క్లియర్ చెయ్యకుండా ఒక వేళా సమైక్య వాదులు అడుగుతున్నట్లు , రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినా , అది ఆందోళనా ప్రదేశ్ లాగే ఉంటుంది తప్పా , ఆంద్ర ప్రదేశ్ లాగా ఉండదు . ఎవరెన్ని చెప్పినా తెలంగాణా ప్రజల మనసులలోఆంద్రా వారి పట్ల ఉన్న బావాలు మారిపోవడం కష్టం . అటు సీమాంద్రులలో కూడా  విబజన గురించి ఉన్న బావోద్వేగాలు తొలగించడం కష్టం . ఎలాగూ  పదేండ్లు ఉమ్మడి రాజ్యదాని అంటున్నారు కాబట్టి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది .?

  తెలంగాణా ఏర్పడితే నిర్యుద్యోగం ఉండదని ,ఉపాది అవకాశాలు మెరుగవుతాయి అని తెలంగాణా వారు ఆశ పడుతున్నారు . తెలంగాణా నీటి వనరులతో సస్య శ్యామలం అవుతుందని రైతన్నల నమ్మక్కం . లేదూ  రెండు ప్రాంతాలకు నష్టమే అని ఆంద్రా వారి వాదన . తెలంగాణా ఏర్పడినాక రెండేళ్ళలో యువత ఆశలు తీర్చక పోతే ,మరొక  సామాజిక తెలంగాణా ఏర్పాటు కొరకు లడాయి తప్పదు . అంతా గందర గోళం అవుతుంది . కాబట్టి ఒక అయిదేళ్ళ పాటు "ట్రయిల్ తెలంగాణా " ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది ?

    k.c.r  గారి ఆద్వర్యంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మండలి ఏర్పాటు   చేయ్య్యాలి సీమాంద్రులకు చోటు ఉండరాదు . ఆ  మండలికి అన్ని విషయాలలో శాసన సబ కు ఉండే అధికారాలు ఇవ్వాలి . అలా ఐదేండ్లు పాలన కోన సాగించాక ఆ మండలి అద్వర్యంలో నే తెలంగాణా లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి . 2/3 వంతు ప్రజలు అనుకూలంగా ఉంటే "ట్రయిల్  తెలంగాణా " ను "రియల్ తెలంగాణా " గా ప్రకటిస్తూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చెయ్యాలి . అక్కడనుండి 5 యేండ్ల లోపు ఆంద్రా వారు రాజదాని ఏర్పాటు చేసు కోవాలి . మొత్తానికి అలా చేస్తే మనం ఊహించేది  అరచేతిలో స్వర్గమా , అసలు స్వర్గమా అనేది తేలిపోతుంది .

Tuesday, August 13, 2013

ఎదురు తిరిగిన ఉద్యోగి "నిజాం " అయ్యాడు . బాంచన్ కాల్మొక్త అన్నోడు "బానిస " అయ్యాడు!

  
                                                                     
  


  ఇది జరిగిన చరిత్ర . తెలంగాణా గడ్డ సాక్షిగా జరిగిన చరిత్ర . 17 వ శతాబ్ద మలిదశలో ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన వారు "అసప్ జాహి " వంశీయులు ,మొగలుల కొలువులో ఉద్యోగులుగా చేరారు . వారే మొగలులు బలహీనులై తమ రాజ్యాలను పరిరక్షీమ్చుకోలెని  తరుణంలో నిజాం లుగా  స్వతంత్రం ప్రకటించుకుని  హైదరాబాద్ రాష్ట్రానికి నవాబులయ్యారు . అంటే ఇక్కడ వారు సరి అయిన సమయంలో చూపిన తెగువ , దైర్య సాహసాలే వారిని పాలకులుగా చేసింది . కాని స్తానికంగ ఉన్నాప్రజలు  పామరులు కాబట్టి బానిసలు గా మిగిలి పోయారు తప్పా , బారత దేశం లో హైదరాబాద్ కలిసే దాక బంద విముక్తులు కాలేక పోయారు . అలాగే అటు తెల్లవారు సైతం ఈస్ట్ ఇండియా  కంపెనీ ఉద్యోగులుగా వచ్చి,స్తానిక రాజులు మద్య తంపులు పెట్టి, పరిపాలన హస్తగతం చేసుకుని చివరకు భారత దేశాన్ని తమ రాణీ పరిపాలన క్రిందకు  తెచ్చారు . ఇదే మన బానిస మనస్తత్వ ఘన  చరిత్ర. . ఆ తర్వాత మహానీయుల త్యాగ పలితంగా స్వాతంత్ర్యం వచ్చింది . అది వేరే విషయం . 

  ఇక్కడ నేను ప్రస్తావిస్తుంది ఏమిటంటే , ఉద్యోగులలో ఉండే ఆత్మాభిమానం , స్వాతంత్ర కాంక్ష సామాన్య జనంలో కాని , వారిని ఏలే నాయకులలో కాని ఉండవా ? ఇప్పుడు రగులుతున్న సీమాంద్రా ఉద్యమంలో కాని ,పోయినేడు రగిలిన తెలంగాణా ఉద్యమంలో కాని ఉద్యోగులదే ప్రదాన పాత్ర . వారిలో కొంత మంది రాబోయే ఎలెక్షన్లలో పోటి చేసి పాలకులుగా మారనున్నారు . కాని రాజకీయ నాయకులు మాత్రం "అమ్మా ,అమ్మా , "అని డిల్లి అధిష్టానం చుట్టూ తిరుగుతూ ,తెలుగుజాతి పరువును ,అత్మాభిమాన్నాన్ని , ఈ  జాతి గురించి ఏమి తెలియని ఒక "అమ్మ "చేతిలో పెట్టారు . ఆవిడ  గీసిన గీత దాటడానికి ఒంటిమీద బట్టలు తడుపుకునే వారు , ఆమెను ఏమి అనలేక జనాఆగ్రహాన్ని  చూపించి , తమ విన్నపాలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ,బాంచన్ కాల్మొక్త వారసులు .  

 ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో అటు ఆంద్రలో ,ఇటు తెలంగాణా లో పౌరుషాన్ని చూపిస్తున్న ఉద్యోగులే నాయకులై తెలుగు సీమ ను ఏలేటట్టు ఉన్నారు . అదే జరిగితే చరిత్ర పునరావృత మయినట్లే . కాక పోతే ఒకటే తేడా !. వారు విదేశియులు , వీరు స్వదేశియులు అంతే.  హట్సాప్ అత్మాభిమాన ఉద్యోగులారా !

Monday, August 12, 2013

మీరు తెలంగాణా గురించి అడగకండి. వారిని హైద్రాబాద్ అడగకుండా చేస్తాం!


                                                                         



  మీరెదైనా సమస్య ఉంటే ఆయన గారి కమిటీకి చెప్పంది. మీకు పూర్తి స్వెచ్చ ఉంది. మీ సమస్యలు చెప్పటానికి. అయిందేదో అయిపోయింది. ఇక సమైఖ్య ఆంద్రప్రదేశ్ గురించి మరిచి పొండి.మీరడిగినట్లు సమైక్య ఆంద్ర ఉంటుంది ఆంద్రప్రదేశ్ రూపంలో.అందులో తెలంగానా మాత్రం ఉండదు. మీరు ఇచ్చే స్లోగన్ లు అన్నీ సమైక్య ఆంద్రా, సమైక్య ఆంద్రా అన్నారు కాని ,పూర్తిగా సమైఖ్య ఆంద్రప్రదేశ్ అన్నారా? లేదు! ఎక్కడో ఒకటీ, అర  అని ఉంటారు. మరి మీకే సమైఖ్య ఆంద్రప్రదేశ్ ఆంటానికి బద్దకమైనప్పుడు, డిల్లీ వారికి మాకెంత ఉండాలి. అందుకే మీరు కోరినట్లే సమైక్య ఆంద్రా ఉంచాం. తెలంగాణా విబజించాం. మీ ఆంద్రా  పార్టీలు లాంటి ది కాదు,మా డిల్లీ పార్తీ. ఒక్క సారి మాట ఇస్తే మా మాట మేమే వినం. ఆప్ట్రాల్ ఆంద్రా వాలాలు. మీరెంత!

  ఈ రోజు మీ సీతయ్య తెలుగులో మట్లాడతాను అని అంటే మాత్రం రాజ్యసభలో మా స్పీకర్ ఏమన్నాడు? ముందుగా తెలియ చెయ్యకుండా మీ మాత్రుబాషలో మాట్లాడడానికి వీలు లేదన్నాడా, లేదా! అదీ మీ పరిస్తితి దేశ చట్ట సబలలో. !హిందీ,ఇంగ్లీష్ తప్పా భారత భూమిలో భారతీయ ప్రజలు మాట్లాడాడానికి ముందస్తు అనుమతి కావాలి.లేకుంటే ఎప్పుడూ పడితే అప్పుడు ట్రాన్స్లేటర్ ఉండదు. మీరు చెప్పేది మాకర్దం కాదు. అందుకే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకే బాష మాట్లాడే వారు శత్రువులు. అందుకే వారిని విడదీస్తుంటాం. అన్య బాష ల వారి మద్య సౌబ్రాతుత్వం పెంచుతుంటాం. ఎవడు ఎటు పోయినా మాకు పెద్దగా పట్టింపు లేదు. సీట్లు ఎన్ని వచ్చాయా అనేదే ముఖ్యం. దానికోసం ఎవరినైనా చీల్చేస్తాం. ఇది మా నైజం. మాకు తెల్లోడు నేర్పిందదే! మా నుండి మీరు నేర్చుకోబోయేది అదే. అందుకే వారికి కావలసిన తెలంఘాణా వారికి ఇచ్చాం. మీకు కావల్సిన హైద్రాబాద్ లో వాటా మీరు తీసుకోండి. తెలంగాణా విషయంలో మీరు మాట్లాడవద్దు. హైద్రాబాద్ యు.టి. విషయంలో రేపు వారిని మాట్లాడకుండా చేస్తాం. ఆంటొనీ కమిటీ వేసిందే అందుకు కదా! మొత్తానికి" తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను" అని" ప్రత్యేక రాష్ట్రం అడిగినోడే కోల్పోతాడు హైద్రాబాద్".ఇదే మేము ఇచ్చే తీర్పు!      

Saturday, August 10, 2013

తీర్పు చెప్పినాక ,సమస్య గురించి అడిగే "తిక్కల పంచాయతి " ఎక్కడైనా ఉందా ?



  ఎక్కడో ఎందుకు ! ఇప్పుడు రాష్ట్రాన్ని ఆందోళన పదం వైపు నడిపిస్తుంది ఆ తిక్కల నిర్ణయాలే . తెలంగాణా  విషయం అరవై ఏండ్ల నాటిదట . ఆమె తాత గారు ,అత్తగారూ ,భర్త గారు ఎవరూ ఆ సమస్యని తేల్చ లేక పోయారు .ఆమె గారు కూడా  గత పదమూడేళ్ళుగా ఎన్నికల్లప్పుడు మాత్రమే రంగం మీదకొచ్చే తెలంగాణా సమస్యను సీరియస్ గా పట్టించుకోలేదు.నాలుగేళ్ల క్రితం అందరి అభ్ప్రాయం అడిగితే ,ఆ..  అరవై యేండ్ల గా ఇవ్వనిది , రోజు ఇచ్చి చస్తారా అని ,డ్రామా అంగీకారాలు తెలిపారు . ఇప్పుడెందుకో అధిష్టాన దేవతకి ఆ సమస్యను తీర్చాలనుకుందట . తీర్చాలనుకున్నపుడు అందులోని కష్ట నష్టాలు , ఇరువైపులా ప్రజలు బావోద్వేగాలు  అన్ని పరిగణనలోకి తీసుకుని, ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు వాళ్ళ ఎవరికీ నష్టం జరగదని అభిప్రాయానికి వస్తే ,అప్పుడు ఏర్పాటు నిర్ణయం ప్రకటించాలి .ఒక సారి ప్రకటించాక ఇక సమస్యలు తెలుసుకునేదంటో  ఏమి ఉండదు. అదీ పద్దతి .
  అంతే కాని ,తెలంగాణా విభజన నిర్ణయం ప్రకటించి ,మల్లీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుఖోండని "ఆంటోనీ " గారి కమిటీ వెయ్యడమేమిటీ ? తిక్కల నిర్ణయం కాకపోతే ! ఇప్పటికైన పార్టీలు ముసుగు తొలిగించి తమ మనసులోని అసలు మాట చెపుతారని గ్యారంటీ ఉందా ? లేదు . మరి ఎందుకు పనికి మాలిన కమిటీలు . ఏదైనా ఒక్క విషయం స్పష్టం . రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ నిర్ణయం . దానిలో ప్రజా అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలనుకుంటే , పార్తీలను కాదు డైరెక్ట్గా ప్రజలను అడగండి ,రాష్ట్ర విభజన అంగీకారమా ,కాదా ? అని . మెజార్టీ ప్రజల అభ్ప్రాయానికి కట్టుబడండి . దీనికి రెఫరెండం అవసరమైన వెనుకాడవద్దు . కాదూ , రాజ్యాంగ ప్రకారం చేదామనుకుంటే ,అసెంబ్లి తీర్మానం ,పార్లమెంటులో బిల్లు పెట్టి మీ కోరిక నెరవేర్చుకొండి అప్పుడు ఎవరు అవునన్నా ,కాదన్నా చెయ్యగలిగేది ఏమి ఉండదు . అంతే కాని తిక్కల పంచాయితి పెట్టి ప్రజలను ఎందుకు బలి చేస్తారు .  

Friday, August 9, 2013

ఇంటి కుక్క , ఇంటి కుక్క ... అన్న చందానా ....

నేను ఇందాక ఒక బ్లాగులో రాయలసీమ యాసలో "బేట్రాయి సామి దేవుడా " అన్న మకుటంతో ఉన్న జానపద పాట చూసాను . చాలా బాగుంది .దశవతార వర్ణన వారి మాండలికంలో చక్కగా కూర్చారు . నేను కవిని కాను . ఆ సంగతి నాకు తెలుసు . కాని కదిరి నరసింహుడి ఉద్దేశించి పాడిన ఆ జానపదం చూసాక నాక్కూడా ఎదో ఒకటి ఆ స్వామీ ని అడగాలనిపించి ఇలా అడిగాను (రాసాను ).బాగున్నా ,బాగోకున్నా లైట్ తీసుకోండి  నేను ఇంతకు ముందు "కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"? అని  ఒక టపా పెట్టాను . ఇంట్రస్ట్ ఉంటే లింక్  చూడండి
 http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_10.html


బేగి రా సామి దేవుడా -మమ్ము కాపాడ 
బేగి రా సామి దేవుడా
కల్కీ అవతారుడా !కదరి నరసింహుడా 
జల్దీగా వస్తువని నమ్మి నేనుంటిరా                         I బే I 

సరాజ్యం వచ్చెనని -అంతా మనదేనని 
అయిద్రబాద్ కొస్తిమి 
అరవై యేండ్లు గడచినాక ,నీది గాదు 
జాగాoటే నేనేడ  బోదురో !                              I బే I 


వెనుక ముందు కానక  _ఒక్క చోట కూడ బెట్టి 
నడమంత్రపు నగరి చేస్తే ,
నట్ట నడుమ లొల్లి ఎంది  ,బిస్తర్తో  
బిచాణా లేప మంటురేందిరో                                       I బే I 


తన్నులు తన్నిన నవాబుని      తాత అనబట్టే   ,
తమ్ముడైన నన్ను, కాదు పొమ్మన బట్టే ,
తెలుగోడు ,తెలుగోడు ఒకటి కాదన బట్టే  
తెలుగు తెల్యనోడిని బాయి  బాయి  అనబట్టే                   I బే I 

ఇంగ్లిషోడి  కాలంలో కల్సి బ్రతకలెకపొయే ,
తెలుగోడి పాలనలో తంపులతో విడిపోతే ,
ఎప్పటికైనా మన బతుకింతేనా ,ఇంటి కుక్క ,
ఇంటి కుక్క ... అన్న చందానా ....                         I బే I     



















Thursday, August 8, 2013

తలా తోకా లేని వీరబోగ వసంత రాయలుకు పోటిగా అవి మాత్రమే ఉన్న "వీర బ్లాగుడు" రయిటర్ ప్రత్యక్షం.



                                                       



  నేను బ్లాగు ప్రారంభ డశలో " డిసెంబర్ 21,2012 యుగాంతం" అనే దానికి కొన్ని ఆంశాలు తీసుకుని ఈ బ్లాగులో టపాలుగా ప్రచురించాను. ప్రపంచ వ్యాప్తంగా యుగాంతం మీద ప్రజకు ఉన్నట్లే మన వారికి ఉన్న ఆసక్తి తో కావచ్చు, లేక కొంత హ్యుమరస్ టచ్ ఉండటం చేత, నా పోశ్టులను ఆసక్తిగా వీక్షీంచారు. వారికి నా దన్య వాదాలు. నేను వీరబోగ వసంత రాయలు గురించి కాని, కల్కి అవతారం గురించి కాని ఏ గ్రందాలు సీరియస్ గా చదివి చెప్పలేదు. కేవళం గూగుల్ సెర్చ్ ఆదారంగా ఏ రోజు టపా కోసం ఆ రోజే పరిశిలించి రాసిన టపాలు అవి.నిజంగా కల్కి అవతారం కాని , వీరబోగ వసంతరాయలు అవతారం కాని హిందూ మత విశ్వాసాలు నుండి పుట్టినవి. కాని హిందూ మతం కి వ్యతిరేకంగా ప్రవచనాలు చేస్తూ, తమ మతమే గొప్పదని ప్రచారాలు చేస్తున్న వారు సైతం ఎంతవరకూ వెళ్ళారంటే హిందూ మత గ్రందాలలో చెప్పిన ఆ అవతార పురుషులు కూడా తమ వారేనని, వారి గురించే హిందూ మత గ్రందాలు ఘోషించాయి అని ఆకుకు అందని పోకకు పొందని ఉపమానాలతో బాష్యాలు చెపుతూ అనేక వెబ్ సైట్లలో తమ స్వీయ  పరిశోదనలు వెళ్ళక్రక్కారు. అవ్వన్నీ చదవి నాకు నవ్వు వచ్చింది. ఒక పక్కేమో హిందూ  అవతర సిద్దాంతం హంబగ్ అంటారు. ఇంకొక ప్రక్క హిందూ గ్రందాలలో చెప్పింది అన్య మత ప్రవక్తలు గురించే అంటారు. ఈ విదంగా సాద్యమైనంత వరకు తమ మతాలను స్వికరించిన హిందువులను సంత్రుప్తిపరచడానికి, లేక మరింత మంది హిందువులను మత మార్పిడి చెయ్యడానికి విశ్లేషణలు, పరిశోదనలు పేరుతో  ఈ వంకర సంకర రాతలు మొదలు పెట్టి ఉంటారని నా నిచ్చితాభి ప్రాయం.


  ఈ మద్య ఒక బ్లాగ్ మిత్రుడు కల్కి అవతారం గురించి వాస్తవాలు చెపుతానంటూ ఒక సీరియల్ టపా రచన మొదలు పెత్టాడు. అందులో నా టపాలు గురించి ఎవరో అడగగా, నావి తలా తోక లేని టపాలు అని తనవి ఆ రెండూ మాత్రమే ఉన్న వాస్తవ విషయాలు అన్నాడు. సరే ఆయన గారిది ఆయనకి గొప్ప కావచ్చు. కాని నాది తలా తోక లెనిది అనడం ఎందుకు? నేను రాసింది సీరియస్ మేటర్ ఏమి కాదు. వాస్తవం అంటూ ఎవరికి చెప్పలేదు.ఇప్పుడు వాస్తవాలు చెప్పే వారు వచ్చారు కాబట్టి ఇక వీక్షకులు హాపీసూ.కాకపోతే చిన్న డౌట్ ఏమిటంటే ఆయన గారి బ్లాగులో బికినీ బామలు అడ్వర్టైస్మెంట్లు సైతం దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి నా టపాలు కంటే ఆయనవి కొంచం రంజుగా కూడా ఉండొచ్చు. సీ అండ్ ఎన్జాయి.     

Wednesday, August 7, 2013

"బాంచన్ నీ కాల్మొక్తా" అంటేనే రాష్ట్ర విభజన ప్రకటించారట !

                                                                     
                                                          

   "బాంచన్ నీ కాల్మొక్తా" అనే బానిస బావజాలం తెలంగాణా లో నిజామ్ ప్రభువులు కాలంలో ఉండేది. అప్పటి తెలంగాణా భూస్వామ్య వ్యవస్తలో సామాన్య ప్రజలు ఎవరైనా సరే, దొరల ముందు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు బాంచన్ నీ కాల్మొక్త అని మాత్రమే తమ గోడుని చెప్పుకునే వారట! అలాంటి పద్దతి ఇప్పటికి తెలంగాణాలో కొన్ని ఏరియాలలో ముసలి వారు పాటిస్తూ ఉండవచ్చు. అంటే తమ ఊరి దొరల క్రింద తాము ఎప్పటికీ బానిసలమేనని, దొరని కాదని తాము ఏమి చెయ్యలేమని, తాము దొరల మోచేతి నీరు త్రాగుతూ బ్రతుకుతున్నామని సవినయంగా మనవి చేసే అలవాటైన ఊత పదం "బాంచన్ నీ కాల్మొక్త".

  అయితే దొరల రూపం మారింది. అలాగే బానిసత్వ రూపం మారింది. కాని బానిస మనస్తత్వం పోలేదు. తెలంగాణాలో కమ్మూనిస్టుల పుణ్యమా అని బాంచన్ నీ కాల్మొక్త అనే వారు విప్లవ వీరులు అయ్యారు. ఎవరినైతే దొరా అని సాగిల పడ్డారో వారినే నరికి వేశారు. అక్కడ ప్రజలు తెలంగాణా ఏర్పాటు కోసం కూడా ఎవరినీ "బాంచన్ నీ కాల్మొక్త" అని ప్రాదేయపడ్డ దాఖాలాలు లేవు. కాని ఆ సంస్క్రుతిని సీమాంద్ర మంత్రులు పాటించినట్లు తెలుస్తుంది.

 N.T.V     వారి కదనం ప్రకారం సీమాంద్ర మంత్రులకు, రాష్ట్ర విబజన గురించి కొన్ని నెలల ముందే తెలుసట! వారికి అన్ని తాయిలాలు ఇచ్చాకే సోనియా గారు రాష్ట్ర విబజనకు తెర తీసారట! ఆంద్రా ప్రజలు తెలంగాణా ప్రజలు లాగా ఉద్యమాలు చేయలేరని, ఒక వేలా చేస్తే గీస్తే మంత్రులైన తామే ఆ ఉద్యమాలను లీడ్ చేయాలి అని, తాము ఒప్పుకుంటే ఆంద్రా ప్రజలంతా రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని సీమాంద్ర మంత్రులు నమ్మకంగా చెప్పిన మీదటే ఇద్దరికి మంత్రి పదవులు, మరికొంత మందికి ప్రమోషన్లు ఇచ్చి, రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధిష్టానం వారు. ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా వీదుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ఎక్కడ అదిష్టాన దేవత ఆగ్రహిస్తూందో అని, రోజు ప్రజల మనో బావాలు చెప్పే వంకతో వెళ్ళి ,"అమ్మా ఇవన్నీ ప్రతిపక్షాలు ఆదిస్తున్న డ్రామాలు. ప్రజలకు హైద్రబాద్ లో వాటా ఇస్తే చాలు అన్నీ అవే సర్దుమనుగుతాయి "అని సర్ది చెప్పి వస్తున్నారు. అందుకే ఎంత సేపు "విభజన అయిపోయింది, దాని గురించి కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఉంటే కమిటీకి చెప్పుకోండి" అని సోనియా గాందీ గారు అంటుంటే అవే చిలక పలుకులు మంత్రులు ప్రజలకు చెపుతూ తమ బానిస నైజాన్ని చాటుకుంటున్నారు.

 కాబట్టి సీమాంద్రులారా! మీకు తెలంగాణా ప్రజలు శత్రువులు కారు. అలాగే, ముక్కు సూటిగా మాట్లాడే ఏ నాయకుడు శత్రువు కాడు. తెలుగు జాతి ఐఖ్యతను బలిపెట్టి, తుచ్చమైన పదవులు పొంది మిమ్మలను మబ్య పెడుతున్న శీమాంద్ర మంత్రులే తెలుగు జాతికి ప్రదమ శత్రువులు. వారి కల్ల బొల్లి మాటలను కాదు నమ్మాల్శింది. వారి చేతలను మాత్రమే విశ్వసించండి. అవసరమయితే మరొక నూతన రాజకీయ పార్టి క్రింద ఏకం కండి.ఆ నాడు అన్న నందమూరి విషయంలో ఎలాగైతే డీల్లీ పాలకులకు బుద్ది చెప్పారో,ఆ తరహాఅ లోనే తెలుగు జాతి ఐఖ్యతను చాటండి. అంతవరకు విశ్రమించకండి. ఇది తెలంగాణా వారికి వ్యతిరేఖంగానో, ఆంద్రా వారిక్ అనుకూలంగానో చెపుతున్నది కాదు. తెలుగు జాతి పరువును దీల్లీ పాలకుల పాదాల ముందు పెట్టి పదవులు పొందిన నాయకుల నీచ మనస్తత్వానికి వ్యతిరేకమ్ గా మాత్రమే ఒక తెలుగు వాడిగా నా  స్పందన. రాష్ట్ర విభజన అయినా సరే అది అన్నదమ్ముల పంపకం లా ఉండాలి తప్పా,డిల్లీ పాలకుల కోసం  జాతి  పరువు బజారుకీడ్చేలా ఉండరాదన్నది నా నిశ్చితాభిప్రాయం.        
        

Tuesday, August 6, 2013

సీమాంద్ర అడుక్కు తినే వాళ్ళ J.A.C కూడా ఉద్యమం చేస్తుందట !



                                                                


   ఇన్నాళ్ళు తెలంగాణా కోసం రకరాల J.A.C. లు తెలంగాణా లో ఉద్యమం సాగించాయి  వాటి క్రుషి పలితమో ,సోనీయమ్మ కరుణ పలితమో తెలంగాణా ప్రత్యేక రాష్త్ర ఏర్పాటు ప్రకటించడం జరిగింది .ఇప్పుడు ఉద్యమ ఊపు సీమాంద్రలో షురూ  అయింది . తెలంగాణాలో ఏ విదంగా ఉద్యమాలు చేసారో అదే విదానం సీమాంద్రలోను "సమైఖ్యాంద్ర " కోసం కోన సాగుతుంది . మంత్రుల ఇళ్ళ ముట్టడి దగ్గర్నుంచి రోడ్ల మీద వంటా వార్పూ దాకా అదే స్టైల్ . కాకపోతే సీమాంద్ర ఉద్యమంలో అన్ని వర్గాల j.a.c.  లతో పాటు బిచ్చగాళ్ళ J.A.C.  అదేనండి అడుక్కు తినేవాళ్ల J.A.C. కూడా  ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుందట !.

అది విన్న నాకు ఆశ్చర్యం వేసింది . ఇదేమిటబ్బా ! తెలంగాణా ఏర్పడితే సీమాంద్రా బిచ్చ గాళ్ళకి కలిగే నష్టమేమిటా అని ,తెగ ఆలోచించగా, ఆలోచించగా టక్కున ప్లాష్ అయింది సమాదానం . అసలు సీమాంద్రా వారు ఉద్యమం చేసేదే హైదరాబాద్ కోసం . హైదరాబాద్ తమ చేజారిపోతే , ఉద్యోగ అవకాశాలు లేని తమ పిల్లలు సీమాంద్రాలో బొచ్చె పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందని సీమాంద్రుల వాదన . మరి అదే నిజమయితే సీమాంద్రలో ఇప్పుడ్డున్న అడ్డుక్కు తినే వారికి హెవీ కాంపిటీషన్ ఏర్పడే ప్రమాదముంది కాబట్టి , ముందుగానే జాగర్తపడి ,ఉద్యమం లో పాలు పంచుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపు చేస్తే , తమ వృత్తికి బంగం కలగదని , ముందు చూపుతో ,అడుక్కు తినే వారంతా J.A.C. గా ఏర్పడి ఉద్యమం చేస్తున్నారన్న మాట !

 చూసారా ,అడుక్కు తినే వారైన వారికున్న ముందు చూపు ఎంత గొప్పదో! కనీసం వీరికున్న పాటి ముందు చూపు సీమాంద్ర రాజకీయ నాయకులకు లేదాయే! సీమాంద్ర ప్రజల మెడలు సోనీయా చేతిలో పెట్టి తమాషా చూస్తున్నారు . సిమాంద్ర ప్రజలు ఇక రాబోయే ఎలక్షన్ లలో రాజకీయ నాయకులని బదులు అడుక్కు తినే వారిని నిలబెట్టి గెలిపిస్తే కనీసం నిరుద్యోగులకు అడుకునే రాత తప్పిస్తారు .విష్ యూ బెస్ట్ ఆప్ లక్ .


Monday, August 5, 2013

అర్దరాత్రి చెల్లెలునే బయటకు గెంటిన వాడు ఆంద్రోళ్లను గెంటడని గ్యారంటీ ఏమిటి?



                                                                       


  తెలంగాణా ప్రజల మీద ఆంద్రావారికి అనుమానాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ , కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి మీద బోల్డన్నీ అనుమానాలున్నాయి  అరే ! తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించి రెందు రోజులు కాక ముందే చెల్లెలు రాములమ్మను అర్ద రాత్రేళా సస్పెండ్ చేసిండా ! అంటే ఏమిటి ? ఆడబిడ్డను  అడగకుండా బయటకు పంపిండు కదా!  ఆడబిడ్డనే అర్దరాత్రి బయటకు పంపినోడు , అగర్బ శత్రువులు లా చూసే వారిని ,అదేనండి ఆంద్రోలను బయటకు పంపకుండా ఉంటాడా ? అదిగో ఆ డౌట్  తోటే ఆంద్రోళ్లంతా ఆందోళన చేస్తున్రు . లేకుంటే విదేశాలు పోయి బ్రతికేటొరికి తెలంగాణా లో బ్రతకడానికి భయమెందుకు ?

  పాపం రాములక్క !  ఏమన్నది ! జై తెలంగాణాయే అన్నది కాని , జై సమైఖ్యాంద్ర అనలేదు కదా.  వేళా కలవకుంట్ల చంద్ర శేఖర్ గారి పొటోలు తీసి వేసి ఇందిరమ్మ పొటోలు తన ఆఫిసుకాడ పెట్టిందనుకో . అందుకు రీజన్ అడిగి నోటీస్ ఇవ్వాలే కానీ , చెప్పా చెయ్యకుండా అర్ద రాత్రి గెంటుతావా పార్టీ లోంచి . ఆడబిడ్డకు ఎంత అవమానం ,
ఎంత అవమానo . అయ్యో ,రాములక్కా , నీ కెంత కష్టం వచ్చిందే !. తెలంగాణా కోసం అన్న అడుగు జాడల్లో నడచిన దానికి నీకు దొరికిన దొరికిన బహుమానం అవమానమేనా అక్కా !

  అసలు నాకు ఉన్న చిన్న అనుమానం ఏమిటంటే , అంత అవమానంగా , అక్కను బయటకు పంపితే , ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకని ?తెలంగాణా కోసం అక్క చేసిన త్యాగం అదే నండి, సినిమా బందూక్ వదిలేసి వచ్చి , బయట బందులలో పాల్గొని రియల్ గా జైలుకు వెళ్ళింది కదా ! ఆ విశ్వాసం అన్నకు లేకపోయినా , తమ్ముళ్ళకు ఉండొద్దా ? పాపం మనసాగబట్టక చివరకు కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిఅన్న కూతురు ఒచ్చి ఓదార్చిందట . అందుకే చెప్పేది ,అన్న అయినా ,తమ్ముడు అయినా వాళ్ళంతా మగాల్లే కాబట్టి వారికి ఆడవారి కష్టాలు తెలియవు మరి ! ఇకనైనా రాములక్కా , మగవాళ్ళ ను నమ్ముకోకుండా ఆడవాళ్ళని నమ్ముకుంటే మంచిది . 

Saturday, August 3, 2013

పెట్టుబడిదారుడు వద్దంటా ! పొట్టకూటి కోసం వస్తే ముద్దంటా !

               
                                                    



 అయ్యా హరీశ్ రావు గారు ! మీ చీర్ ఫుల్ పేస్ చూసి తెలంగాణాకి ముఖ్యమంత్రి మీరైతేనే బాగుంటుందని తెలంగాణా వాళ్ళు అనుకుంటున్నారు  కానీ నిన్న మీరన్న మాటలు చూస్తె తెలంగాణా అభివృద్ధి ఏదో ఆయేట్టట్టే అనిపిస్తుంది .
  ఎట్టెట్టా ! తెలంగాణా కి పెట్టుబడిదారులు  వస్తే వద్దంటావా ! పొట్టకూటి కోసం వస్తే రమ్మంటావా ! ఏ "తెలంగాణా " లో అటు మొదటి అక్షరం ,ఇటు చివరి అక్షరం తీసేసిన రాష్ట్రం గా మారుదామనుకుంటున్నావా ? అసలు ఒక పెట్టుబడి దారుడు వస్తే వేయి మందికి ఉపాది కల్పించే పరిశ్రమ పెడతాడు కాబట్టి రాష్ట్రం అభిరుద్ది చెందుద్ది . కాని వేల మంది పొట్ట కూటి  కోసం వస్తే ,తెలంగాణా కి ఏమి ఒరుగుద్ది . వలసవాదుల తాకిడి తప్పా! వారికి పుడ్ అని ,బెడ్ అని "k.c.r  గృహ కల్ప " అని రాష్ట్ర ఖజానా కి బొక్క అవ్వడమే కాక ,ఇక్కడి ప్రజలకు పని పాఠాలలో పోటీ .

  అంద్ చేత కమ్మూనిస్ట్  మాటలు కట్టి పెట్టి ,నూతన  రాష్ట్ర అభిరుద్ది గురించి మీకున్న విదానమేంటో , మీ మామ గారిని అడిగి చెప్పండి . లేకుంటే తెలంగాణా ప్రజలు ,మీ పట్ల వారికి ఉన్న విజన్ మార్చుకోవలసి ఉంటుంది మరి !