Saturday, May 4, 2013

కొట్టా, పెట్టని రాజు, కోటలొ ఉంటేనేం!పేటలో ఉంటేనేం!?



India Google Map.


china google map

                                                            

  మన కేంద్ర సర్కారు వారి తీరు అచ్చం అలాగే ఉంది. మన ప్రధాన మంత్రి గారు బహు మంచి వారు. ఎంత మంచివారు అంటే నోట్లో వేలుపెడితే కూడా కొరకలేనంతగా!. ఆయన తీరును చూసిన కొందరు, మిన్ను విరిగి మీద పడినా చలించని మనస్తత్వం అంటుంటే, ప్రతిపక్షాల వారేమో అంతకన్నా ఏమి చేస్తాడు "రబ్బర్ స్టాంప్" అధికారం ఉన్నవారు అంటున్నారు.ఈ దేశాన్ని ఏలుతున్న అధికార కాంగ్రెస్ "అధినేత్రి" గారు కూడా మన ఇందిరా గాంది గారి లాగా "డైనమిక్" కాదు కాబట్టి అటు కర్ర విరుగకుండా, ఇటు పాము చావకుండా పాలనా రథం నడిపిస్తున్నట్లుంది. ఇక ఈ మద్యే "కాబోయే దేస్ కీ నేత" అని పిలువబడుతున్న రాహుల్ గారు కూడా అప్పుడప్పుడు వివాద స్పద వ్యాఖ్యలు చేసి,ప్రతి పక్షాల చేత పిల్ల వాడి మాటలు అనిపించుకున్నాక, ఏ పనులు చేస్తే పెద్దవారి పనులు అవుతాయా అని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుంది. ఇదీ ఇక్కడ మన పాలక పక్షం పరిస్తితి.

  ఇది చూస్తున్న పొరుగుదేశాలకు ఏమి మాయదారి ఆలోచనలు పుడుతున్నాయో కాని, వారికి ఇండియా అంటే ఖాతరు లేనట్లే ఉంది. ఒక పక్కా చైనా మన భూబాగం లోకి కిలోమీటర్ ల వంతున చొచ్చుకుని రావడమే కాక ఇది మా దేశంలో బాగమే అని భుకాయిస్తుంటే,కేంద్ర సర్కార్ చెష్టలుడిగి నామ మాత్ర నిరసనలతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లుంది.ఒక్క సారి పైన ఇచ్చిన మన దేశం ఒక్క మాప్, చెనా దేశం వారి మాప్ చూస్తే వారు మన దేశ భూబాగాన్ని తమ భూబాగం గ ఎలా ప్రకటిస్తున్నారో అర్థం అవుతుంది. సాక్షాతు మన రక్షణ మంత్రి,  మన అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తే వారు అబ్యంతరం చెప్పారంటే, పరిస్తితి ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు

   ఇంకొక పక్క, ఇండియన్స్ అందరు ఒక్క సారిగా ఉమ్మేస్తే, ఆ ఉమ్ము సునామికే కొట్టుకుపోయే పాకిస్తాన్, ఇరవైయేండ్లు పైనా తప్పుడు సాక్శ్యం, అది కూడా నిందితుడిని హింసించి ఒప్పించిన నేరాంగీకారా ఒప్పుదల వాంగ్మూలం ఆధారంగా, ఉరిశిక్ష వెయ్యడమే కాక, వేసిన క్షమా బిక్ష పిటిషన్ లను కొట్టివేసి, చివరకు ఆ దేశ న్యాయసూత్రాలకు కూడా విరుద్దంగా,క్రూర మత విశ్వాసాలకు అనుకూలంగా కొట్టి చంపారు. చివరకు వారు ఈ దేశ వాసుల మనోబావాలను ఎంతగా గాయపరచారంటే,సరబజిత్ సింగ్ గారి శరీర బాగాలను కూడా కొన్నింటిని తొలగించి, ఇండియాకు పార్థివ దేహాన్ని పంపారంటే, ఈ దేశం పట్ల వారికున్న క్రూర ద్రుక్పదం అర్థ మవుతుంది. ఇది ఖచ్చితంగా మన మత విశ్వాశాలను తివ్రంగా కించ పరిచే చర్యే.

  మరి పైన చెప్పిన పొరుగుదేశాల లెక్కలేని   తనానికి కారణాలు ఏమిటి? మనం ఎంతమంది  ఉన్నాము    అని కాదు, మనలో ఎంత దమ్ము, పౌరుషాలు ఉన్నాయి అనేదే  పాయింట్ .   మన పౌరుషాన్ని ప్రతిబింబించే మన నాయకులు ఇలా దేనికి చలించని తత్వం చూశి మనం మెచ్చుకోవచ్చు గాక, పొరుగువాడు ఇంకొకరకంగా అర్థం చేసుకోబట్టే, ఈ రకమైనా దుష్పరిణామాలు ఏర్పడుతునాయి అని అనుకోవాల్శి వస్తుంది.  కొట్టా, పెట్టని రాజు, కోటలొ ఉంటేనేం!పేటలో ఉంటేనేం! అని ప్రజలు అనుకుంటే మాత్రం రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ వారికి "పీడ కలలు" గా మారుతాయి.             

Thursday, May 2, 2013

మనకు ముద్దంటే సెక్స్! వారికి జస్ట్ ఫ్రెండ్ టచ్!

                                                               


                                                        

  మన బారతీయుల శ్రుంగార బావాలు గురించి మన వాళ్ళకు ఎంతో తెలుసో తెలియదు కాని, ఆసియా అభివ్రుద్ది బ్యాంక్( A.D.B   ) వారికి మాత్రం బాగా అర్థమయిందనే చెప్పాలి. గురువారం డిల్లీలో ప్రారంభమైన, ఆసియా అభివ్రుద్ది బ్యాంక్(A.D.B    ) వాశిక సమావేశాలకు హాజరయ్యే మహీళా  ప్రతినిదులకు వస్త్రధారణ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిబందనలు పెట్టింది. వాటిని పాటిస్తే మన దేశంలో స్త్రీల మీద లైంగిక దాడులు తగ్గవచ్చేమో అని చాల మంది బారతీయులు అభిప్రాయపడుతున్నట్లు కూడA.D.B   తెలిపింది.

   తక్కువుగా, కురచగా ఉండే దుస్తులు దరించడం, బారత దేశంలో లేని పోని కాంప్లికేషన్ లకు దారి తీయవచ్చట! ఎందుకంటే మన వాళ్ళకి కుతూహలం(?), ఎక్కువట!. బహూశ ఆ కుతుహలం మనస్సులో కామ హలాహలం  నింపి లైంగిక దాడికి పురిగొల్పుతుందేమో.!అలాగే విదేశాలలో ముద్దు పెట్టుకోవడాన్ని, ఆత్మీయత వ్యక్తపరిచే విదానంగా బావిస్తే, మన దేశంలో అది సెక్స్ కోరికను వ్యక్త పరచే విదానం అని A.D.B    తెలిపింది.

   ఏది ఏమైనా ఇక్కడి ప్రజలు "హుందాగా" ఉండే వస్త్రదారణను అభిమానిస్తారని,ఈ మద్య  బారత దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న స్త్రీల మీద అత్యాచారలకు "వస్త్ర దారణ" కూడా ఒక కారణమని  A.D.B  అభిప్రాయ పడటం సాంప్రదాయ వాదులకు రుచించినా, స్త్రీ వాదులకు మాత్రం కోపం తెప్పించక మానదు.
 మరిన్ని వివరాలకు లింక్ మీద క్లిక్ చెయ్యండి     
 http://www.thehindubusinessline.com/news/adb-issues-dress-code-for-women-delegates/article4676117.ece     

Tuesday, April 30, 2013

ముఖ్య మంత్రి గారూ, "బంగారు తల్లి"కి లక్షలు కంటే బయట "రక్షణ"ముఖ్యం.

                                                               

                                                                       

  అయ్యా ముఖ్య మంత్రి గారూ, తమరు నిన్న ఆంద్ర ప్రదేశ్ లోని ఆడపిల్లల కోసం "బంగారు తల్లి" అనే పదకాన్ని ప్రవేశ పెట్టి, వారికి ప్రోత్సాహక బహుమానంగా, బిడ్డ పుట్టినది మొదలు 21  వ సంవత్సరములు నిండేవర్కు సుమారు రెండు లక్షల పై చిలుకు ముట్టేట్టట్లు చట్టం చేస్తామనడం అందరికి ఆనందం కలిగించే విషయమే. కాని మీకు తెలుసు ప్రస్తుతం ఆడపిల్లల్ని వేదించే సమస్య "రక్షణ". కామ ప్రకోపిత మ్రుగాళ్ళ నుండి రక్షణ. అది కరువై ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని అత్యంత దీన పరిస్తితులో ఆడపిల్లలు ఉన్నారు అనేది మీరు కాదనలేని విషయం.

   తల్లి తండ్రులకు చెప్పుకుని రక్షణ పొందలేని స్తితిలో ఈ రాష్ట్రంలో కొంత మంది ఆడపిల్లలు, అది ముఖ్యంగా మీరుండే హైదరాబాద్ లోనే ఉన్నారని, వారు విదేశి "షేకులకు"," వన్ మంత్ వైఫ్" లుగా మారి చివరకు ఏమవుతున్నారో తెలియని పరిస్తిలో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. ఇది వారి వారి, అమ్మా బాబుల దన్నుతోనే జరుగుతుందని తెలిసి, మీ ఏలుబడిలో ఇటువంటివి కూడా జరుగుతున్నాయా అని ఆశ్యర్యపోతున్నాం.

  ఇకపోతే పసిపిల్ల నుండి, పండు ముదుసలి వరకు వావి వరసలు మరచి, పరమ నీచంగా వారి మీద ఎక్కడబడితే అక్కడ, చివరకు మరుగుదోడ్లలో కూడ "లైంగిక దాడులు జరుపుతున్న "కామ కీచకులు" నుండి రక్షించే వారెవరో తెలియక "ఓరీ బగవంతుడా! మమ్మల్నెందుకు మమ్మల్నెందుకు ఈ గడ్డ మీద ఆడబిద్దగా పుట్టించావు?మేమేమి పాపం చేశాం"అని మూగగా రోదిస్తుంటే అందరికి దిక్కనుకునే ఆ దేవుడు కూడా చేష్టలుడిగి చూస్తున్నాడు.మరి ఇటువంటి ఆక్రందనలు ఆ బగవంతుడి భూరూపమైన(రాజు దేవుడితో సమానం) తమకు వినిపించడం లేదా? పోని ప్రతిపక్షాలకు చెపుదామంటే వారు సీరియస్ గా పాదయాత్రలలో మునిగి పోయారు.వారు అధికారంలోకి వస్తే తప్పా ఏమి చెయ్యలేరట!. ఇక తెలంగాణా వారైతే వీటన్నిటికి మూల కారణం వలస పాలనే కాబట్టి, తెలంగాణా వస్తే తప్పా ఈ కీచక పర్వం ఆగదంటారు.

  మరి ఇటువంటి పరిస్తితులున్నఫుడు తమరు ఆడపిల్లలకు "రక్షణ" ఇచ్చే పదకాలు ప్రవేశ పెట్టకుండా, ఇరవైఒక్క సంవత్సారాల కాల పరిమితితో  "లక్షల" పధకం "బంగారు తల్లి" వల్ల ఒరిగేదేముంది?. మీరిచ్చే ఆ బహుమతిని అందుకోవడానికైనా స్వేచ్చగా ఆడపిల్లలు బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళగలరా? అందుకే ముందు రక్షణ ఇవ్వండి. ఆ తర్వత ఏమిచ్చినా ! వాటిని అందుకోవడనికి "నిర్భయం"గా ముందుకొస్తారు.  అందరికీ సంతోషమే

దీనికి మేము సర్వదా క్రుతజ్ణులమై ఉండగలము. 

                                                                   ఇట్లు
                                                ఆంద్ర ప్రదేశ్   ఆడపిల్లల  శ్రేయోభిలాషులు   
                                                         

Monday, April 29, 2013

జగన్ గారు అదికారంలోకి వస్తే "చంద్రబాబు" గారి కి చెరసాల తప్పదా?

                                                                       
  ఇది కేవలం ఊహ జనితమైన ప్రశ్న అని కొట్టివెయ్యడానికి వీలు లేనిది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్తితులను లోతుగా పరిశీలిస్తే తప్పా ఇది బోదపడదు.

  ఉదాహరణకు మన పొరుగున ఉన్న తమిళనాడు నే తీసుకోండి. అక్కడ ప్రాంతీయ పార్తీలదే అధికార పీటం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బి.జె,పి లు చెరొక ప్రాంతీయ పార్టీలకు కొమ్ము కాస్తాయి. అక్కడ ప్రాంటీయ పార్టీ అధినేతలైన జయలలిత, కరుణానిది గార్ల మద్య పచ్చ గడ్డి కాదు కదా ఏ గడ్డి వెయ్యకున్న భగ్గుమంటుంది. కరుణానిధి అధికారం లో ఉన్నప్పుడు అసెంబ్లీలో జయలలిత చీర గుంజి పరభవించారని పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చాక కరుణానిది ని పంచ ఊడిపోతున్నా కట్టుకునే అవకాశం ఇవ్వకుండా పోలిసులు అరెస్ట్ చేసి హింసించారని దుమారం చెల రేగింది. ఇదంతా ఒకరి పై ఒకరు వ్యక్తి గత, పార్టీ గత కక్షలతోనే చేయించారని తమిళ పత్రికల బోగట్టా!

  ఇప్పుడు మన రాష్ట్రం లో కూడ అదే సీనులను మనం చూడ వచ్చనుకుంటా!. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వలన ఈ రాష్ట్రంలో రెండవ ప్రాంతీయ పార్టీ అవిర్భావం జరగటం, దానికి ఆయన కుమారుడు అధిపతి కావటం,చక చకా జరిగిపోయాయి. కాని ఆయన గారి ఖర్మ బాగోక అవినీతి కేసులలో విచారణ నిందితుడిగా జైల్ కెళ్ళవలసి వచ్చింది. ఇదంతా ఒక కుట్ర అని, ఆ కుట్ర వెనుక  అధికారపక్షం మాత్రమే కాక, చంద్రబాబు గారి హస్తం కూడ ఇందులో ఉందని జగన్ గారి వర్గం బలంగా విశ్వసిస్తుంది. దీని తార్ఖాణంగా "చిదంబరం, చంద్రబాబు" ల సీక్రేట్ మీటీంగ్ ని వై.కా.పా. వర్గాలు ఉటంకిస్తాయి. కాబట్టి ఇప్పుడు జగన్ గారి వర్గానికి టార్గెట్ టి.డీ.పి. దాని అదినేత చంద్ర బాబుగారు మాత్రమే అన్నది తేటతెల్లం. మరి దీనికి ప్రతీకారం ఎలా తీర్చుకోవడం?.ఇది జగన్ వర్గాన్ని నిద్రపోనివ్వని సమస్య!

  ఇక ఈ రెండు పార్టీలు, రాష్ట్రంలోని రెండు బలమైన సామాజిక వర్గాల అధికార ఆకాంక్షలకు ప్రతీకలు. పైకి ఎవరేమి చెప్పినా సగటు పార్టీ కార్యకర్తలు ఇదే బావాన్ని కలిగి ఉన్నారు.కాబట్టి ఈ పార్టీల మద్య  అన్ని విషయాలలో పోటీ డీ,అంటే డీ అన్నటే ఉంటుంది. అందుచేత అవినీతి ఆరోపణలతో జైలు పాలైన జగన్ గారి సహజ కోపం చంద్రబాబు గారు ఏదో రకంగా చెరసాల కు వెళితే తప్పా చల్లారదు. అందు చేత ఒక వేళా జగన్ అధికారం లోకి వస్తే "టీ.డి.పి" అధినేత కు ఆరళ్ళు తప్పవు అనుకుంటా!       

Sunday, April 28, 2013

"తెలంగాణా " వస్తే "దేవాదాయ శాఖ" రద్దట!


                                                              
                                                          
  మొత్తానికి సంచలన నిర్ణయాలు ప్రకటీంచడంలో కె.సి.అర్. గారికి ఉన్న దమ్ము ఎవరికి ఉండదనుకుంటా! సాంప్రాదాయ పార్టీలైన వారెవ్వరికి అసలు ఈ ఆలోచన కూడ వచ్చి ఉండదు. ప్రబుత్వం ఖజానా నుండి ఒక్క రూపాయి కూడ దేవాలయాలకు ఇవ్వనవసరం లేకుండా, దొడ్డి దారిలో దేవుడి సొమ్మును ప్రభుత్వ శాఖలకు,రాజకీయ అవసరాలకు వినియోగించుకునేందుకు ఒక"వర ప్రసాదిని" లా ఉపాయోగ పడుతున్న హిందూ దేవాదాయ మంత్రిత్వ శాఖను రద్దు చెయ్యాలంటే ఎంత సాహసం ఉండాలి?

   దీని వల్ల దేవాదాయ వనరుల మీద పూర్తీగా హిందూ మతానికి చెందిన సంస్తలు స్వయం ప్రతిపత్తి తో కూడిన ఆజమాయిషి కలిగి ఉండి, పూర్తిగా స్వాతంత్రం పొందుతాయి. దేవాలయ వ్యవస్త కు స్వర్ణ యుగం అంటే కాకతీయుల కాలమనే చెప్ప వచ్చు. ఆ రోజుల్లో దేవాలయ "బాంక్" లు రైతులకు సైతం అప్పులిచ్చేటంత ఆర్థిక స్వయం సమ్రుద్ది కలిగి ఉండేవట. దిక్కు మాలిన నైజాం ప్రబుత్వం వచ్చాకే వాటికి దుర్దశ మొదలై, ఇప్పటి పాలకుల చేతిలో పూర్తిగా నాశనం అయిందని చెప్ప వచ్చు. ఊరిలో పని పాట లేకుండా తిరిగే బలాదూర్ గాళ్ళు,ఏ మాత్రం నైతిక చింతన లేని వాళ్ళు, దేవాలయాలకు దర్మకర్తలుగా చేసిన పాపం ఈ సర్కార్ కి ఉంది. ఇక పూర్తీగా అవినీతి మయమైన  దుస్తితి నుంచి తప్పించడానికి ఆ శాక రద్దు ఒకటే తక్షణ కర్తవ్యం. సరి అయిన నియంత్రణ కొరకు ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్త ఉంటే చాలు. పైసా ఇవ్వని ప్రభుత్వ నియంత్రణ అనవసరం.

  ఈ విషయం లో సాహసోపేత నిర్ణయం తీసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితికి,కె.సి.అర్ గారికి,హిందూ సంస్తలు అభినందనలు తెలపాల్శిన అవసరం ఉంది.  

Friday, April 26, 2013

మంత్రాలకు పిల్లలు పుడితే, మగవాళ్ళెందుకు?

                                                                    
                                                          
  ఈ మద్య ఖమ్మం జిల్లాలో  ఒక సంఘటన  జరిగింది. గుడి పూజారి ఒకాయన తాను మంత్రాలతో  సంతాన బాగ్యం కలిగిస్తాను అని ప్రచారం చేసుకున్నాడట! అలా ఆ పేరు మోసిన పూజారి గారి "సంతాన సాఫల్య కేంద్రానికి" ఒక వివాహితను తీసుకు వచ్చిన కుటూంబ సబ్యులు ఆమెకు సంతాన బాగ్యం కలిగించమని ప్రాదేయ పడగా అందుకు పదివేలు కర్చవుతుంది అన్నాడట. సరే అని వారు ఆ పది వేలు ముట్ట చెప్పాకా సదరు మహిళను చీకటి పడ్డాకా రమ్మన్నాడట. అలాగే అని చెప్పి వారు చీకటి పడ్డాక ఆమేను తీసుకుని ఆ పూజారి దగ్గరకు వెలితే, పూజల పేరుతో ఆమేను ఒంటరిగా గదిలోకి తీసుకు వెళ్ళి అత్యాచారం చెయ్యబోయాడట! ఆ దెబ్బతో పిల్లలు ఎలా కలుగుతారో జ్నానోదయమైన ఆమే ,తేరుకుని కేకలు వెయ్యగ సదరు పూజారి పారిపోయాడట!

  అయ్యా ఇదీ కథ లాంటి నిజం. అసలు ఇటువంటి జనాల్ని చూస్తుంటే, మన వెనుకటి వాళ్ళ కున్న శాస్త్రీయ ద్రుక్పదం నేటి తరం వారికి లేదనిపిస్తుంది. వెనుకటి కాలంలో  "కుల గురువు" అనే వారు ప్రతి కులానికి ఉండే వారట. కులంలో ఎవరఈనా సంతాన బాగ్యం లేకపోతే, ఆ కుల గురువునే "కుల పురుషుడు" గా ఆరాదించి అతనితో సంతానం పొంది కుటుంబ అబిరుద్ది చేసుకునే వారట. సరే ఈ విదానంలో నైతిక దర్మం మాట కాసేపు ప్రక్కన పెడితే, పిల్లల్ని కనాలంటే పురుషుడు అవసరం తప్పని సరి అనే ఇంగిత జ్నానం వారిలో ఉంది. అసలు నన్నడిగితే నమ్మక్కం లేని "సంతాన సాఫల్య కేంద్రం" లకు పోయి లక్షలు వదిలించుకుని  తెలియని వారసత్వాన్ని ఇంట్లోకి తెచ్చుకునే దాని కంటే యోగ్యుడైన "కుల గురువు" పద్దతే స్వచ్చమైనది అనుకుంటా. !   

Wednesday, April 24, 2013

పర్యాటకం అంటే "దానికి రమ్మని" అర్దమా?

                                                               

 ఈ రోజు పేపర్లో చూశిన ! బలే మజా వార్తొచ్చింది! మన బాగ్య నగరం "సెక్స్ పర్యాటక కేంద్రం గా" బడాశేట్లను ఆకర్షిస్తుందట! కాసుల్లున్నోడికి  "కామితార్దము" లు తీర్చుదరట ఇచ్చట!. దానికోసం వ్యభిచారానికి కొత్త బాష్యం చెపుతూ ఇక్కడ ఏజంట్లు,వెలిసారట. విమానాలలో దిగుతున్న షేకులు కు సలాం చేస్తూ, తమ పేదరిక దౌర్బాగ్యాన్ని వారికి పక్కలుగా మార్చి, అది కూడ పర్యాటక అభివ్రుద్దికి తోడ్పడుతుందనే దగుల్బాజి తనాన్ని ఏమనాలి.?

  ఇలా అలోచిస్తున్న నాకు అసలు పర్యాటకం అంటే ఏమిటి అనే ఆలోచన వచ్చింది. నాకు తెలిసిన తెలుగు పంతులు గారిని అడిగా "పర్యాటకం" అనగానేమి అని. దాని అర్దాన్ని ఆయన నాకు విడమర్చి చెప్పేసరికి నాకు మైండ్ బ్లాంక్ అయింది! ఆయన చెప్పింది ఇది

         పర్రె+ ఆట కి కం.(రా.)= పర్యాటకం. నిజమే నా అనిపిస్తుంది.

Tuesday, April 23, 2013

మంత్రిని ఉరి తియ్యమన్న ముఖ్యమంత్రి అక్కడా! కళంకిత మంత్రులను కాపాడుతున్న ముఖ్యమంత్రి ఇక్కడ!

                                                                        
                                                                
                      

                                                                          
                                                                           

  లౌకికవాద పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి గారి సి.బి.ఐ. చార్జ్ షీట్ దాఖలు చేయ్యబడిన మంత్రులపై ఎట్టి చర్యలు తీసుకోకుండా "కళంకిత మంత్రులను కాపాడుతున్న ముఖ్యమంత్రి" గా కొనియాడబడుతుంటే, అక్కడ గుజరాత్ లో "మత వాది పార్టీ " గా ముద్రపడిన పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి "మోడీ" గారు మాత్రం తన కాబినెట్ మంత్రి గారికి క్రింది కోర్టు వేసిన శిక్ష  చాలదు "ఉరి" తీయాలని  సుప్రీం కోర్టును కోరవలసిందిగా అధికారులను అదేశించాడట!

 ఔరా! ఏమి ఈ విచిత్రం. లౌకిక వాదమంటే తప్పు చేసిన వాడిని , చెయ్యని వాడిని ఒకేరీతిగా చూడటమా! అలా చూడరు కాబట్టె మతవాదులంటె ఈ ఉదార పురుషులకు ఇంత లోకువా!.ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎవరు ఏమిటో "వారు చెప్పే శ్రి రంగ నీతులు బట్టి కాక, చేసే పనులు ద్వారా గుర్తించండి". లేకుంటె మనం చెయ్యగలిగేది ఏమి ఉండదు, వారు వేసే డ్రామాలు చూడటం  తప్ప!  

Thursday, April 18, 2013

చీర" కట్టుకోవడం చేత కాని తనానికి నిదర్శనమన్న మహిళా మంత్రి!


                                                                   

                                                                       

  మంత్రులు అంటే ఎలా ఉండాలో , తెలిసికోవాలంటే మన రాష్ట్ర మంత్రులని కొంతమందిని చూసి నేర్చుకోవాలనుకుంటా! ఒక పక్క కళంకిత మంత్రులతో మన పాలనా వర్గం ఇలా తగలబడిందేమిటా అని బాదపడే వారికి మొన్న ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు వింటే నోరెళ్ళబెట్టక తప్పదు.

  సదరు మహిళా మంత్రిణికి అమె నియోజక వర్గానికే చెందిన ఒక మాజి మంత్రితో తగవులు ఉన్నాయి. వారిద్దరి మద్య అసలు గడ్డి వెయ్యకుండానే భగ్గుమంటుండవచ్చు. కాని అంత మాత్రానికే సదరు మాజి మంత్రి మగ తనాన్ని చాలెంజ్ చేస్తున్నట్లు "మగాడివైతే నా ముందుకు వచ్చి మాట్లాడు" అనాలా? అంతే కాదు తాను గౌరవప్రదంగా, సాంప్రదాయ చీర కట్టుకున్న విషయం కూడా మరచి" చేత కాకపోతే చీర కట్టుకుని ఉండు" అని అనడం ఎంతవరకు బావ్యం. అదే ఏ పురుషుడో ఈ మాట అని ఉంటే మహిళా సంఘాలు ఒక్క పెట్టున గోల చెయ్యరా?

   సాక్షాతు ఒక మహిళా మంత్రిణియే, చీర కట్టుకోవడాన్ని చేతకాని తనంగా అభివర్ణిస్తుంటే, సాంప్రదాయ స్త్రీ లోకంను అవమానించినట్లు కాదా? అంతెందుకు ముందు వెనుక కానక తనని కూడా సదరు మహిళా మంత్రి అవమానించుకున్నారు.ఎందుకంటే ఆమె అప్పుడు చీరను కట్టుకుని అన్ని మాటలు అంటున్నారు మరి!

ఒక  వ్యక్తి యొక్క సంస్కారం అంచనా వేసేది వారు ఉపయోగించే బాషయే!    అసలు ఒక మంత్రి హోదాలో ఉండి పుబ్లిగ్గా ఒక మాజి మంత్రి మగతనాన్ని కించ పరిచేలా మాట్లాడడం సబ్య సమాజం హర్షించదు. ఆ తర్వాత మన సాంప్రదాయం  అయిన చీర కట్టుడుని అలా చేతకాని తనంగా అభివర్ణించడం అసలు బాగో లేదు.మన సంస్క్రుతికి ప్రతీక స్త్రీలు అని మనం బావిస్తుంటాం. ఆ బావనలు తప్పు అనేలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారు ప్రవర్తించడం కడు అక్షేపణీయం.  

Wednesday, April 17, 2013

వై.కా.పా పార్టీ వారికి తగ్గుతున్న జనాదరణ సూచిక దేనికి సంకేతం?

                                                                                                    
  సంవత్సరం క్రితం వై.కా.పా పార్టీ వారికి ముప్పై పైనే పార్లమెంట్లు సీట్లు వస్తాయని, సర్వే లు తేలిస్తే, ఇప్పుడేమో అది కాస్తా పన్నెండు సీట్లుగా తగ్గి పోయినట్లు ప్రస్తుత సర్వేలు చెపుతున్నాయి. సంబదిత పార్టీ వారి ఆలోచన ఎలా ఉన్నా, సి.బి.ఐ. వారు వేస్తున్న చార్జ్ షీట్లను, అందులోని అభియోగాలను జనం నమ్ముతున్నట్లే కనిపిస్తుంది.

  అందుకే ఏ నిర్ణయమైనా ఆవేశంతోనో, వీరాభిమానంతోనో తీసుకోకూడదు. ఆలోచించి తీసుకునే నిర్ణయమే సత్పలితాలను ఇస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి స్తాయిలో పదవి కావాలనుకున్న వ్యక్తి మీద తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఉన్నపుడు వాటిని సత్వరమే పరిష్కరించడం ఉత్తమం. దాని వలన ప్రజలు ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగి మీద వచ్చిన అవినీతి ఆరోపణల లాగా "జగన్" గారి కేసును పరిగణించకుండా సత్వరమే చార్జ్ షీట్లు దాఖలు చేసి, నేర విచారణ కొన సాగించాలి.

  ఒక వేళా అతడు నిర్దోషి అయితే, తక్షణమే విడుదల చేసి,  సి.బి,ఐ. ని తగిన నష్టపరిహారం జగన్ కి చెల్లించ వలసిందిగా ఆదేశించ వచ్చు. లేకా అతడు దోషిగా రుజువు అయ్యే పక్షంలో తగిన శిఖ్షలను విదిస్తే, తెలుగు ప్రజలు ఒక నేరస్తున్ని అధికారపీటం మీద కూర్చో పెట్టే పాపం నుండి విముక్తులను చేసిన వారవుతారు.

  ఏది ఏమైనా అతని మీద మోపబడిన నేర అభియోగ తివ్రత ద్రుష్ట్యా, జగన్ గారి కేసులను తక్షనమే పరిష్కరించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.