సింహాచల వరాహ నరసింహ స్వామి.
నెను ఎదో కుతూహలమొ, మత ప్రచారం లో బాగమనుకోండి, ఒక పరిశోదన మొదలుపెట్టి దాని సారాంశాన్ని, ఈ బ్లాగులో యుగాంతం డిసెంబర్ 21,2012. అనే శిర్షిక క్రింద సీరియల్గా ప్రచురించటం జరిగింది. దానికి సంబందించి నా పరిశోదనా సారాంశాన్ని, మొత్తం చివరి టపాలో ప్రచురించటం జరిగింది. దానిలో వీరబోగ వసంత రాయలు గురించి పది విషయాలు చెపుతూ, ఆయన నాస్తికులతో భావ యుద్దం చేస్తాడు అని కూడ చెప్పటం జరిగింది. అంతే! "గాడ్" అనె అయనకు కోపం వచ్చినట్ట్లుంది.నన్నూ, నా మతాన్ని ఆయన బ్లాగులో స్పెషల్ టపా పెట్టి ఆక్రోశాన్ని వెళ్ల గ్రక్కాడు.
నా మతం "పందులకు పసుపు" రాసేదట!అంటే మనం వరాహా అవతారాన్ని పూజించడాన్ని అయన ఆ విదంగా గేలి చెసాడు.నిజమే పందిలో ఉండేది "ఎలక్ట్రాన్, ప్రొటాన్, నుట్రాన్ లే, మనిషిలో ఉండేవి అవే. అందుకే మాకు దేవుడు అంటే "ఇందుగలడు, అందులేదని కాక సర్వాంత్ర్యామి". కాని "సైన్స్ గాడ్" కి అలా కాదేమో. మేము మతమ్ లోని విజ్ణానాన్ని దర్శిస్తుంటే, ఈ సో కాల్డ్ గాడ్ సైన్స్ అనే పేరుతో మూర్కత్వాన్ని పోగేసుకుంటున్నాడు.
వీళ్లన్ని చూస్తుంటె వీరబోగ వసంతరాయలు గురించి నేను చెప్పిందే జరుగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. లేకుంటే నేను వదిలిపెట్టినా ఆ టపాని ఈ నాస్తికులు ఎందుకు వదలిపెట్టకుండా ఏదో రకంగా కెలుకుతున్నారు?. ఒక వేళా వీరబోగ వసంతరాయలు గురించి నేను చెప్పినది వీరు నమ్మి ఉండాలి. ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు అనే మాటలను పట్టుకుని యెందుకైనా మంచిదని ముందే ఎదురు దాడి మొదలు పెట్టారా!. అయ్యా నేను చెప్పింది కల్కి పురాణం లోని అంశాలే. నా పరిశోదనలో ఒక్కట్టి నేను కల్పించి చెప్పలేదు. ఈ విదంగా ఉండొచ్చు అని మాత్రమె చెప్పాను. ఒక వేళ సైన్స్ వాదులు నమ్మకపోతే దానిని రాదాంతమ్ చెయ్యల్సిన అవసరం లేదు. నేను ఒక సారి కాకపోతే వంద సార్లు, రీపోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది నా మత ప్రచారం లో బాగమ్ కాబట్టి. ఇంకొంత మంది అయితే ఒక పక్క నాది పిచ్చి అంటూనే వీరబోగ వసంతరాయలు గురించి పర్సనల్గా, 'ఈ మెయిల్' చెయ్యమని అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటె ఎవరికైనా ఏమనిపిస్తుంది. నా సబ్జెక్ట్ జనాల్కి బాగానే ఎక్కింది అని. ఇక పోతె నమ్మక్కమంటార, సైన్స్ గాడ్ లే స్పందిస్తుంటే, మిగతా వారి సంగతి చెప్పాలా!ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html మీద క్లిక్ చెస్తే మీకే తెలుస్తుంది వారు ఎందుకు ఎగిరెగిరిపడుతున్నారో,