Friday, December 28, 2012

ఎవరి బ్లాగు చూస్తే,"సైన్స్ గాడ్" మైండ్ బ్లాక్ అవుతుందో వారే వీరబోగ వసంత రాయలా?


                                                                  సింహాచల వరాహ నరసింహ స్వామి.          

  నెను ఎదో కుతూహలమొ, మత ప్రచారం లో బాగమనుకోండి, ఒక పరిశోదన మొదలుపెట్టి దాని సారాంశాన్ని, ఈ బ్లాగులో యుగాంతం డిసెంబర్ 21,2012. అనే శిర్షిక క్రింద సీరియల్గా ప్రచురించటం జరిగింది. దానికి సంబందించి నా పరిశోదనా సారాంశాన్ని, మొత్తం చివరి టపాలో  ప్రచురించటం జరిగింది. దానిలో వీరబోగ వసంత రాయలు గురించి పది విషయాలు చెపుతూ, ఆయన నాస్తికులతో భావ యుద్దం చేస్తాడు అని కూడ చెప్పటం జరిగింది. అంతే! "గాడ్" అనె అయనకు కోపం వచ్చినట్ట్లుంది.నన్నూ, నా మతాన్ని ఆయన బ్లాగులో స్పెషల్ టపా పెట్టి ఆక్రోశాన్ని వెళ్ల గ్రక్కాడు.

  నా మతం "పందులకు పసుపు" రాసేదట!అంటే మనం వరాహా అవతారాన్ని పూజించడాన్ని అయన ఆ విదంగా గేలి చెసాడు.నిజమే పందిలో ఉండేది "ఎలక్ట్రాన్, ప్రొటాన్, నుట్రాన్ లే, మనిషిలో ఉండేవి అవే. అందుకే మాకు దేవుడు అంటే "ఇందుగలడు, అందులేదని కాక సర్వాంత్ర్యామి". కాని "సైన్స్ గాడ్"  కి అలా కాదేమో. మేము మతమ్ లోని విజ్ణానాన్ని దర్శిస్తుంటే, ఈ సో కాల్డ్ గాడ్ సైన్స్ అనే పేరుతో మూర్కత్వాన్ని పోగేసుకుంటున్నాడు.

  వీళ్లన్ని చూస్తుంటె వీరబోగ వసంతరాయలు గురించి నేను చెప్పిందే జరుగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. లేకుంటే నేను వదిలిపెట్టినా ఆ టపాని ఈ నాస్తికులు ఎందుకు వదలిపెట్టకుండా ఏదో రకంగా కెలుకుతున్నారు?. ఒక వేళా వీరబోగ వసంతరాయలు  గురించి నేను చెప్పినది వీరు నమ్మి ఉండాలి. ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు అనే మాటలను పట్టుకుని యెందుకైనా మంచిదని ముందే ఎదురు దాడి మొదలు పెట్టారా!. అయ్యా నేను చెప్పింది కల్కి పురాణం లోని అంశాలే. నా పరిశోదనలో ఒక్కట్టి నేను కల్పించి చెప్పలేదు. ఈ విదంగా ఉండొచ్చు అని మాత్రమె చెప్పాను. ఒక వేళ సైన్స్ వాదులు నమ్మకపోతే దానిని రాదాంతమ్ చెయ్యల్సిన అవసరం లేదు. నేను ఒక సారి కాకపోతే వంద సార్లు, రీపోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది నా మత ప్రచారం లో బాగమ్ కాబట్టి. ఇంకొంత మంది అయితే ఒక పక్క నాది పిచ్చి అంటూనే వీరబోగ వసంతరాయలు గురించి పర్సనల్గా, 'ఈ మెయిల్' చెయ్యమని అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటె ఎవరికైనా ఏమనిపిస్తుంది. నా సబ్జెక్ట్ జనాల్కి బాగానే ఎక్కింది అని. ఇక పోతె నమ్మక్కమంటార, సైన్స్ గాడ్ లే స్పందిస్తుంటే, మిగతా వారి సంగతి చెప్పాలా!ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html మీద క్లిక్ చెస్తే మీకే తెలుస్తుంది వారు ఎందుకు ఎగిరెగిరిపడుతున్నారో,  

Thursday, December 27, 2012

. "స్తీ వాదం" అంటే రేప్ ని సమర్దించడమా! ?

                                                                    .
 నేను ఇంత కాలం స్త్రీ వాదం అంటే కెవలమ్ స్త్రీలకు వ్యతిరెకంగా సమాజమ్ లో జరుగుతున్న అన్యాయాలకు, స్త్రీలు మాత్రమె స్పందించాలని, స్త్రిలకు తమ ఇష్టం వచ్చిన విదంగా తిరిగే స్వేచ్చ కావాలని డిమాండ్ చేసేవారు అని అనుకున్నాను. కాని ఇందాక ఒక బ్లాగులొ ఒక మిత్రుడు ఒక స్త్రీవాది గురించి చెపుతూ ఆయన (స్త్రీ వాది )డిల్లీ రేప్ ఘటన గురించి చెప్పిన  అభిప్రాయం ఒకటి ఆ బ్లాగులో ఇచ్చాడు. అది చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది అంటే నమ్మండి. అది ఇదే.   
         "సామాజికంగా వెనుకబడిన ఇండియా లాంటి దేశంలో ఒకడితో డేటింగ్ చేసిన అమ్మాయిని ఇంకొకడు పెళ్ళి చేసుకోడని తెలిసి కూడా డేటింగ్‌ని సమర్థించేవాళ్ళు రేప్‌ని మాత్రమే హత్యతో సమానమైన నేరంగా ఎందుకు పరిగణించాలని అనుకుంటున్నారు? కార్మిక వర్గంతో గానీ స్త్రీవాదంతో గానీ సంబంధం లేని & పరువుమర్యాదల కోసం ప్రాకులాడేవాళ్ళ భావజాలంతో మాత్రమే సంబంధం ఉన్న ఈ కేస్ గురించి మార్క్సిస్ట్‌లు సీరియస్‌గా ఆలోచించడం అనవసరం. ఆ అమ్మాయి శరీరం ఆమె ఇష్టం కనుక ఆమె డేటింగ్ చేస్తుందని మీరు అనొచ్చు. ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు. నీతి అనేది తమకి ఒకలాగ, ఇతరులకి ఇంకొకలాగ వర్తించాలని అంటే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు."
       ఆ బ్లాగులోనే నాకు తోచిన సమాదానమ్ రాసి పడేశాను అది ఇది. అఫ్ కోర్స్. ఇది మామూలుగా చెప్పేదే అనుకోండి.
                   
 (1)డేటింగ్ అనైతికం అయితే రేప్ చట్ట వ్యతిరేకం. అనైతికాన్ని సమాజం శిక్షిస్తుంది (అమెకు వేరొకరితో పెళ్లి కాదు అనేది అదే), చట్ట ఉల్లంఘనను చట్టం శిక్షిస్తుంది.

 (2). డేటింగ్ వల్ల బౌతిక దాడి కాని, బావ దాడి(ఇష్టానికి వ్యతిరేకం)  కాని ఉండదు. రేప్ లో రెండూ ఉంటాయి.పాపం బాదితురాలు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది.

 (౩).ఒక వేళా డేటింగ్ చట్ట వ్యతిరేకం చేస్తే, నేరస్తులను చట్టానికి అప్పగించడమే ఇతరుల బాద్యత తపా, వారికి వ్యతిరేకంగా నేరాలు చెసే హక్కు ఎవరికి లేదు.

 (4). స్తీ వాదం అంటే రేప్ ని సమర్దించడమా! లేక రేప్ లు చేయించుకోవడమా? స్త్రీ వాదులకు పరువులు ఉండదా? అంతా ఓపెన్ మైదానమేనా?



  అయితే ఇక్కడ నేను సూటిగా ఒకటే ప్రశ్న ఆ సో కాల్డ్  స్త్రీ వాదికి వేయదల్చుకున్నాను. "మీరు నిజంగా స్త్రీ వాదాన్ని సమర్దించే వాల్లు అయితే, ఇదే మీ ఇంట్లో ఎవరికయినా జరిగితే ఇలాగే స్పందిస్తారా?
           నిజంగా ఆయన చెప్పినట్లు అంటె  డిల్లి కేసులో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి డేటింగ్ చేసి వస్తుంటే అది గమనించిన దుండగలు అమేను రేప్ చెసి ఉన్నట్లయితే ,ఈ దారుణం "స్తీ వాద ప్రబావమే" అని చెప్పక తప్పదు. "బౌతిక దాడి’ తో సమానంగానే "లైంగిక దాడి" ని చూడాలని స్త్రీ వాదుల అభిప్రాయం కాబోలు. ఎందుకంటే ఈ దాడిని అరికట్టె  పేరుతో సాంప్రదయ వాదులు ఎక్కడ విచ్చల విడి స్వేచ్చను నిరోదించమని ప్రబుత్వాలను డిమాండ్ చేస్తారో అని వీరి బయం.

  స్త్రీ వాదం పేరుతో అమాయకపు, నిర్బాగ్య స్త్రీలను వీదుల్లోకి తీసుకువచ్చి, తమ వ్యాపార సంస్క్రుతికి అనుగుణంగా వాడుకుంటున్న వ్యాపార వర్గాలకు, వారికి ఉపయోగ పడుతున్న ఈ సోకాల్డ్ "స్త్రీ వాదులకు" డిల్లీ లొ  లేచిన నిరసన జ్వాలలు ఏ మాత్రం రుచించటం లేదు. అందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చివరకు రేప్ లను కూడ సమర్దించే స్తాయికి దిగజారారు. ఇదే వీరి నిజ స్వరూపం. మన దేశ సంస్క్రుతిని నాసనమ్ చేసి, మన స్త్రీలను విదేసి వ్యాపార సంస్క్రుతి  కి అనుగుణంగా మార్చడమే "స్త్రీ వాదుల అజెండా". కాబట్టి ఇకనైనా కళ్ళు తెరుద్దాం. మన జాతిని,నీతిని, సంస్క్రుతిని కాపాడుకోవాల్శిన తరుణమ్ ఆసన్నమయింది. లేకుంటే నేడు "అమానత్" (డిల్లి బాదితురాలు) కి పట్టిన గతే ఈ దేశపు స్త్రీలకు పడుతుంది. ఈ దురాగతాలను ఆపుదాం.మనం స్త్రీ వాదులమ్ కాదు సమానత్వ వాదులమని చాటి చెపుదాం.  

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి మద్య తేడా ఏమిటో తెలుసా?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_5016.html
పూర్తి టపాకోసం లింక్ మిద క్లిక్ చెయ్యండి

Wednesday, December 26, 2012

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి మద్య తేడా తెలియనివారిని ఏమనాలి?


                                                                           

  ప్రతిష్టాత్మకమయిన,మన తెలుగు బాషా ఔన్నత్యాన్ని చాటే, "ప్రపంచ తెలుగు మహా సభలు" తెలుగు ప్రాంతంలో జరగటం ముదావహం.ఇవి ప్రపంచ సభలు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువార్కి అంటే, తెలుగు బాషను మాత్రు బాష గా ఉన్న వారందరికి సంబందించిన సభలు అని సాదారణ ప్రజలు అనుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రం లో ఒక భాగమయిన తెలంగాణా లోని ప్రజలు అనుకుంటూ ఉండవచ్చు. కాని తెలంగాణా విడగొట్టాలి అని పదియేండ్ల నుండి పోరాటం చేస్తున్న నాయకులు మాత్రం అలా అనుకోవటం లేదని అర్థమవుతుంది. వారు ’తెలుగు" అనేది తమది కాదని, అది పరాయి బాషని బావిస్తున్నట్లుంది. ఆంద్రా వాళ్ళ మీద కోపం "తెలుగు బాష" మీద చూపించడం ఎంతవరకు సమంజసం?

   అసలు వీరు చేసే ఒక వాదం ఆశ్చర్యం గా ఉండటమే కాక ప్రజలు ని అయోమయానికి గురి చేస్తుంది. తమది "తెలుగు తల్లి" కాదు అని తెలంగాణా తల్లి అని చెపుతూ ఒక కొత్త తల్లిని ఆవిష్కరింపచేశారు. తెలంగాణా తల్లి దేనికి ప్రతీకా, బాషకా? ప్రాంతానికా? స్పష్టత లేదు. తెలంగాణా వారు మాట్లాదేది తెలుగా? కాదా?.తెలంగాణా అంటే తెలుగుకి సంబందించిన పదం కాదా?ఆంద్రా అనేది మాత్రమే తెలుగుకు సంబందించినదా!ఏమిటీ విపరీత అర్థాలు?

  నాకు తెలిసీ "భరత మాత" అని దేశ భూ బాగానికి ప్రతీకగా ఆ తల్లిని ఆరాదిస్తున్నాం.అలాగే "తెలుగు తల్లి" అని మాత్రు బాషకు ప్రతీకగా పూజిస్తున్నాం. అలాగే "తెలంగాణా తల్లి" అని ప్రాంతీయ బూబాగానికి ప్రతీకగా తెలంగాణా ప్రజలు ఆరాదించ వచ్చు. కాని వారి మాత్రు బాష ఏమీటీ అనేది ఘనత వహించిన నాయకులు చెప్పాలి. వారు మాట్లాడేది తెలుగే అయితే "తెలుగు తల్లి" వారి తల్లి అవుతుంది. అటువంటప్పుడు వారు తిట్టేది వారి తల్లినేనా? కాదా? ఆత్మ విమర్శ చేసుకోవాలి. తల్లి ని తిట్టేవాడు ప్రజా నాయకులు అవుతారా?తెలంగాణా ప్రజలు  నిగ్గదీసి అడగాలి.ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది అంటే "అన్న దమ్ముల మీద కోపం అమ్మ మీద చూపించి నట్లుంది".
                శ్రి వేంకటేశ్వరుని పాద పద్మముల నగరి అయిన "తిరుపతి" పట్టణం లో నేడు మొదలవుతున్న మన బాషా ప్రపంచ మహా సభలు సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన  తెలుగు అన్నదమ్ములు, అక్కచెల్లెలందరకు శుభాభినందనలతో..........


అసలు ఇంతకీ వీరబోగ వసంత రాయలు అంటే ఎవరో తెలిసిందా?

http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

మతం లేనిది జంతువేనా!?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_24.htm
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి!

Monday, December 24, 2012

"మతం" అనేది మనుష్యులకు మాత్రమె ఉంటుంది, జంతువులకు ఉండదు.


                                                                    
 మానవ ఆలోచనా పరిణామ క్రమంలో ఏర్పడిందే మతం. అది ముఖ్యం గా ఈ స్రుష్టిని నడిపే శక్తి ఏదో ఉందన్న మనిషి ఆలోచనలోనుంచి పుట్టిందే . వెర్వెరు ప్రజలు వెర్వేరు పద్దతుల ద్వారా ఆ శక్తి ని కనుగొనాలని ప్రయత్నిస్తూ కొన్ని విదానాల ద్వారా దానిని సాదించవచ్చని నమ్ముతుంటారు. ఆ నమ్మకాలే మత విశ్వాసాలుగా రూపొందినాయి.

  కాబట్టి మతం అనేది మనిషి ఆలోచనా  లేక జ్ణాన పరిణామా క్రమం లోనిది. ఇది జంతువులకు ఉండదు.ఎందుకంటె వాటికి జ్ణానం లేదు కాబట్టి. జ్ణానం లేకపోవుట వలన అవి స్రుష్టితో  ప్రత్యక్ష సంబందం కలిగి ఉంటాయి. కాబట్టి మానవుడి లాగా అనవసర బాదలు అంటూ ఏమి ఉండవు. జరిగిందానికి విచారించే పని లేదు, జరగబోయే వాటికి వగచే పని అంత కన్నా లేదు.

  కాని మనం జ్ణానం అనే దానిని పొంది ప్రక్రుతి ని పరీశిలిస్తూ , తద్వారా జ్నానాభివ్రుద్ది సాదించి చివరకు ప్రక్రుతినే శాసిమ్చ గలం అనే స్తాయికి ఎదిగాం.అసలు ఏ దైవ బావనతో ప్రక్రుతిని పరిశిలించటం మొదలు పెట్టామో, ఆ దేవుడే లేదు, పో! అనే నమ్మఖ్ఖానికి కోంత మంది వచ్చేశారు. ఇప్పుడు ప్రపంచం లో దేవుడూ,మతం వద్దనే వారు ఇరవయి శాతం అంటే నూట ఇరవై కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా. అంటే ప్రపంచంలో హిందువుల కంటే వీరే అదికమట!

  మరి పైన నేను చెప్పిన నిర్వచనం ప్రకారం వీరికి మతమ్ లేదు కాబట్టీ వీరు "జంతువులా? అని మీరు అడగవచ్చు. కాదు వీరు మనుషులే . వీరు తమకు మతం లేదని గప్పాలు కోడుతుంటారు, కాని వీరు మత వాదులే. వీరిది "నాస్తిక మతం" . అంటే దేవుడు లేడనే నమ్మక్కం కలిగిన వారు. అసలు ఏ నమ్మక్కం లేక పోతే, వీరు పరిపూర్ణ జ్ణానులు అవ్వాలి. అప్పూడు తిరిగి ప్రక్రుతితో సంబందం ఏర్పడాలి. అప్పుడు వీరికి జంతువులకు పెద్ద తేడా ఉండదు. అవి జ్నానం లేనివి. వీరు పరిపూర్ణ  జ్ణానులు. ఇరువురూ ప్రక్రుతితో ప్రత్యక్ష సంబందం కలిగి ఉంటారు. సుఖ దుఖాలకు అతీతులు.కాని ఈ నాస్తికులు అలాంటి వారు కాదుగా! వారికి నమ్మకాలు ఉన్నాయి. జ్ణానం ఉంది.కాబట్టి  వారు మనలా నమ్మక జీవులే.   

800 హిందూ దేవాలయలను పడగొట్టించిన హిందూ వాది ఎవరో తెలుసా?

http://kalkiavataar.blogspot.in/2012/12/800.html
పూర్తి టపా కోసం లింక్ మీద్ క్లిక్కండి

Sunday, December 23, 2012

800 హిందూ దేవాలయలను పడగొట్టించిన హిందూ వాది ఎవరో తెలుసా?


                                                                       

 మీరు చెపితే నమ్మరు! బి.జె.పి. పార్టీని మత వాది పార్టి అని తెగ ఆడి పోసుకునే వారు సైటం నమ్మలేని నిజం ఇది. రోడ్ల అభిరుద్దికి ఆటంకం ఉన్నవని చెప్పి సుమారు ఎనిమిదివందల దేవాలయలను,  వందల మసీదులను పడగొట్టిoచిన ఘనత గుజరాత్ ముక్య మంత్రి "నరేంద్ర మోడి" గారికే దక్కుతుంది. హిందూ మతం అంటే అది ఒక జీవన విదానం అని, ఆదునిక అభిరుద్దికి అది ఆటంకం కాదు అని నిరూపించిన  హిందూ విశ్వాసి,"నరేంద్ర మోడి". అందుకే గుజరాత్లో ముస్లింలు సైతం ఆయనకు బ్రహ్మ రథం పట్టారు.

  వ్యక్తి తాను అనుసరించే విదానం వల్ల ప్రజలలో నమ్మక్కం కలిగించాలి. అంతే కాని ఆచరణీయం కాని శొల్లు సిదాంతాలు వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదు. నేతి బీరకాయలో నేయి యెంత ఉంటుందో ఈ సో కాల్డ్ అబ్యుదయ సిదాంత వాదుల్లో చిత్త శుద్ది అంతే ఉంటుంది. హిందూ మతం అంటే అబిరుద్ది నిరొదకం కాదు. ఇతర మతాలతో దీన్ని పోల్చి అజ్ణాన్ని చాటుకునే వారు, కుహానా లౌకిక వాదులు. హీ0దూ మతాన్ని మించిన లౌకిక తత్వం ఆచరించే మతం ఏది ఈ ప్రపంచంలో లేదు అని నా ద్రుడ విశ్వాసం. మత వాదం అంటే మూర్ఖమయినది అని, అబిరుద్ది నిరోదకమని, హిందూ వాదుల పాలనలో మైనార్టీ మతాల  ప్రజలకు రక్షణ ఉండదని ఇన్నాళ్ళు కుహానా లౌకిక వాదుల పార్టీలు చేసిన వాదనలు కల్లలని తేలాయి. నిజమయిన అభిరుద్ది కాంక్షించే వారు, కులు మత బేదాలు లేకుండానే పాలన సాగిస్తారని, హిందూ మత వాదులు కు ఉన్న లౌకిక ద్రుక్పదం కుహానా వాదులకు కూడా ఉండక పోవచ్చని శ్రీ మోడీ నిరూపించారు. నిరంతరం సొల్లు సిద్దాంతాలు వల్లె వెయ్యడం కాదు తమకు ఆచరణలో చూపించగల దమ్మున్న నాయకుడు కావాలని, వారికే కుల మతాల కతీతంగా తమ మద్స్దతు ఉంటుందని గుజరాత్ ప్రజలు నిరూపించారు. ఇప్పటికయిన పార్టీలు హిందూ మతాన్ని, ఇతర మతాల వలె చూడక అది ఒక విశిష్ట జీవన విదానమని గుర్తిస్తే మంచిది.      

"బ్లాగు రాక్షసులు" అంటే ఎవరో తెలుసా?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_22.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి.
http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html