Friday, November 30, 2012

చంద్రబాబు "ఫస్ట్" అంట! కిరణ్ కుమార్ "నిల్" అంట



నేను వారం రొజుల క్రితం 

"ఆంద్ర ప్రదేశ్ కి సుపరిపాలన ఇవ్వగల నాయకుడు?"

అని ఒక సర్వే పోల్ పెట్టడం జరిగింది. అది నిన్నటితో ముగిసింది. ఇందులో ఇంచుమించు చంద్రబబు నాయుడు గారికి, జయప్రకాష్ నారాయణ్ గారికి ఒక వోట్ తేదాతో సమానంగా పలితాన్ని సాదించారు. జగన్ గారికి పద్నాలుగు శాతం వోట్లు పోలవ్వగా,కొత్త నాయకత్వం కావాలని  13శాతం వీక్షకులు అభిప్రాయపద్డారు.విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రస్తుత అధికార పక్ష నేత అయిన కిరణ్ గారికి అసలు ఎవరూ ఓట్ చెయ్యక పోవడం గమనార్హం.

  కాబట్టి దీని వలన మన కర్థమయ్యేది 2 రకాలుగా చెప్పొచ్చు,.(1). ప్రజలను ఎన్నికల విషయంలో అనేక అంశాలు ప్రభావ పరుస్తాయి. సాదర్ణంగా ఏ పక్షపాతం లేకుండా, దేనికి ప్రబావితం కాకుండ ఓట్లు వేసే పరిస్తితి ఈ నాడు లేదు. ఒకవేళ ఉండి ఉన్నట్లైతే, కచ్చితంగా మంచి నాయకత్వమే ప్రజలకు లబిస్తుంది.

 డప్పులు,డొలీలు, పల్లకిలు, ప్రచారహోరు,కులాలజోరు, డబ్బుప్రవాహం,మద్యపుటేర్లు,బూతుల షేర్, బెదిరింపులు,వీటణ్ణింటిని ఆపి ప్రజలకు స్వేచ్చా వాతావరణం కల్పించగలిగితే తప్పా, ప్రజలు ఇచ్చే తీర్పును  ప్రజాస్వామ్యంలో బాగంగా పరిగణించవలసిన అవసరం లేదనుకుంటా!

 ఇకపోతే రెండవకోణం "ఆస్తిక ద్రుష్టి". "శివుని ఆజ్ణ  లేనిదే చీమైనా కుట్టదు" అని. దీన్కి నేను గతంలో

("’ " బుద్ది భూములు" ఏలుదాం అంటే,రాత "గాడిదలు" కాద్దాం అందట!"!http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7924.html)అనే టపా

 పెట్టడం జరిగింది. లంకె మీద క్లిక్ చెయ్యగలరు.ఇక వివిద నాయకులకు సర్వే పోల్ లో వచ్చిన వోట్ల శాతం:---

చంద్ర బాబు నాయుడు
   36%
కిరణ్ కుమార్ రెడ్డి
  0%
జగన్
  14%
జయ ప్రకాష్ నారాయణ్
  35%
కొత్త నాయకుడు రావాలి
  13 14%


పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును,శూద్రులు చెప్పిందే నిజమై నిలుచు!

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_5782.html
(పై లంకె మీద క్లిక్ చెయ్యండి}

Thursday, November 29, 2012

పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును,శూద్రులు చెప్పిందే నిజమై నిలుచు!

                                                                       

 ఈ మాట బ్రహ్మం గారు తన కాలజ్ణానం లో చెప్పిన మాట. ఇది చాల కరెక్ట్ అనిపిస్తుంది. లేకపోతే ఏమిటి చెప్పండి.మన్వంతరం అంటే కోట్ల సంవత్సరాలు అంట! అటువంటివి ఆరు గడచిపోయినవంట! ఏడోది ఒక పాదమే అయిందట. అలాగే కలియుగం లక్షల సంవత్సరాలంట! ఆ కల్కి పుట్టేది లక్షల సంవత్సరాల తరవాతే నంట!అప్పటిదాక ఈ పాపాలు ఇల కొనసాగాల్శిందేనంట.అసలు వీటిలో ఒక్కట్టైన నమ్మదగిన కనీసం నమ్మొచ్చు అనే అవకాశం ఉందా?

  అదే మయన్లు చూడండి వారి పంచాంగం (కాలెండర్) కి ఒక ప్రామాణికత ఉన్నట్టు తోస్తుంది.ఖచ్చితంగా ఇక్కడితో ఈ కాలెండర్ పూర్తి అయి తిరిగి కొత్తది మొదలవుతుంది అనేది రాశారు . మరి ఈ హిందూ పండితులు ఎందుకు ఇలా లక్షలు, కోట్లు సంవత్సరాలు ఈ లెఖ్కల్ని పొడిగించారు అంటె భయంతో కూడిన స్వార్దం. అవును అందుకే వీరు అలా చేసారు అనిపిస్తుంది. ఎలాగంటే:-

  "విష్ను పురాణంలో రాబోయే మన్వంతరం శూద్రులుకు(కొంత మంది ద్రుష్టిలో రాక్షసులు),సంబందించింది. ఈ మన్వంతరంలో,పరమాత్ముడు శూద్ర జన్మ ఎత్తాలి,ఇంద్ర పదవి శూద్రుడిదే, మహరుషులు కూడ వారే కాబట్టి ఈ  మన్వంతరం రావడానికి ఒప్పుకోని "పండిత పుత్రులు" బవిష్యగ్రంథాలలో సున్నాలు చొప్పించి ప్రక్షిప్తం చేసారు. కాని మూర్కులు కాలాన్ని ,దైవ నిర్ణయాన్ని ఆపగలరా? అది శూద్రులయిన మయన్ల రూపంలో ప్రపంచానికి తెలుస్తుండి.

  ఈ విదంగా బ్రహ్మం గారి జ్యొస్యం నిజమవుతుంది> శూద్రుడు ఇంద్రపదవి పొందడం గురించి తెలుసుకోవాలంటే లంకె మీద క్లిక్ చెయ్యగలరు  http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_1640.html

కాబోయే"ఇంద్రుడు" శూద్రుడైన "బలి చక్రవర్తి" అంట!

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_1640.html
పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

Wednesday, November 28, 2012

కాబోయే"ఇంద్రుడు" శూద్రుడైన "బలి చక్రవర్తి" అంట!

                                                                         
ఇన్నాళ్లు ఈ దేశంలో దళితులు, తమను అగ్ర వర్ణాలవారు అణగద్రొక్కారని,బ్రాహ్మణ పక్షపాతి అయిన "మనువు" రాసిన "మనుస్మ్రుతి" మరియు ఇతర హిందూ మత గ్రంథాలు అన్ని కూడ అగ్రవర్ణాలకే పెద్దపీట వెయ్యడం వల్ల తాము నిమ్న కులాలుగా హీనస్తితిలో ఉండాల్శి వచ్చిందని బాదపడుతున్నారు కదా. వారికి ఒక శుభ వార్త. రాబోయే కాలంలో" ఇంద్ర పదవి" ని శూద్రుడైన "బలిచక్రవర్తి" అదిరోహిస్తాడటా! ఇది ఏ బౌద్ద గ్రంథమో, దళిత సాహిత్య గ్రంథాలో చెప్పింది కాదు. సాక్షాతు, హిందూ పవిత్ర గ్రంధమైన "విష్ణు పురాణంలోనే చెప్పబడిందట!కావాలంటే క్రింది రిఫరెన్స్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

  హిందూ బవిష్యపురాణం, విష్ణు పురాణం ప్రకారం మనకు 14 మంది "మనువులు" ఉంటారట. ఒక్కొక్క మనవు కాలాన్ని "మన్వంతరం" అంటారట.అలా 14మన్వంతరాలకు, 14 మంది మనువులే కాక, 14 మంది ఇంద్రులు కూడ ఉంటారట. ప్రతి  మన్వంతరంలో ఆ దేవదేవుడైన పరమాత్మ కూడ జన్మించి,తన దర్మాన్ని నెరవేర్చుతాడట. అలాగే ప్రతి మన్వంతరానికి"సప్తరుషులుగా" ఎవరు ఉంటారో కూడ నిర్ణయించబడింది. ఇలా ప్రతి మన్వంతారానికి వచ్చే మనువు పేరు,ఇంద్రుడి పేరు,పరమాత్మ పేరు,సప్తరుషుల పేర్లు, స్పష్టం గా తెలుపబడ్డాయి.ref:-http://en.wikipedia.org/wiki/Manvantara

  ఉదాహరణకి, ఇప్పుడు నదుస్తున్నది ఏడవ మన్వంతరం అయిన "వైవస్వత మన్వంతరం".ప్రస్తుత మనువు పేరు "వైవస్వతూడు". పరమాత్మ పేరు"వామనుడు".సప్త రుషులు "కశ్యపాది సప్త మునులు".ఇంద్రుడి పేరు "పురందరుడు"’పరమాత్మ అయిన వామనుడి తల్లితండ్రులు"కశ్యప,అదితి" దంపతులు.

  అలాగే రాబోయే 8 వ మన్వంతరం""సావర్ణి మన్వంతరం"లో కూడ ఎవరి పేర్లు ఏమిటొ స్పష్టం గా తెలుపబడ్డాయి.ఈ కాలంలో మనువు పేరు"సావర్ణి".ఇతడు సూర్యుని పోలికతో ఉంటాడని "సూర్య సావర్ణిక" అని కూడ అంటారు.పరమాత్మ పేరు "సార్వబౌమ".సప్తరుషులు "గాలవాది మహామునులు".ఇకపోతే ఇంద్రుడు"బలి చక్రవర్తి". ఇతనినే వామనావతారంలో విష్ణువు పాతాళానికి త్రొక్కివేసింది. పరమాత్మ అయిన "సార్వబౌమ" తల్లి తండ్రులు పేర్లు,"దేవగుహ్యుడు" మరియు"సరస్వతి".ref:http://en.wikipedia.org/wiki/Savarni_Manu

 కాబట్టి 8వ మనువు కాలంలో పాతాలానికి త్రొక్కివేసిన బలి చక్రవర్తే "ఇంద్ర" పదవి అలంకరిస్తున్నడంటే అంతకంటే కావాల్సిందేముంది మన దళితులకి. కాకపోతే బలిచక్రవర్తి ఎక్కడ వచ్చేస్తాడొనని కోంతమంది మూడ పంచాంగ గణికులు మన్వంతర కాలాన్ని,4320 సంవత్సరాలుకు కొన్ని సున్నాలు కలిపి లక్షల యేండ్లు చేసారు.ఎలాగు శూద్రులు ఈ పురాణాలు పట్టించుకోరు కాబట్టి వారు ఆ విదంగా చేయగలిగారు. కాని ఒక అంచనా ప్రకారాం ౭ వ మన్వంతరం కూడ  వచ్చే సంవత్సరం "రఠసప్తమి" నాటికి పూర్తి కావాలి. దీనికి "మాయా  యుగాంతానికి" చాల దగ్గరి సంబందం ఉండటం గమనార్హం.

 కాబట్టి "ఉందిలే మంచి కాలం ముందు,ముందునా,"శూద్రుడే దేవుడంట" నంద నందనా" అనుకుంటూ హాపీగా ఉందామా!    http://www.newworldencyclopedia.org/entry/Rakshasa 

కిరణ్ కుమార్ రెడ్డీ గారిని సి.యం. చేసింది ప్రజలా?పరమాత్ముడా?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7924.html
పై లంకె మీద క్లిక్ చెయ్యండి

"’ " బుద్ది భూములు" ఏలుదాం అంటే,రాత "గాడిదలు" కాద్దాం అందట!"!

                                                                                                                                                                                                                      
నేను "ఈ రాష్ట్రంలో ఎవరు సు పరిపాలన" ఇవ్వ గల నాయకుడు అని "సర్వె పోల్" పెడితే ’జయ  ఫ్రకాష్ నారాయణ్’,"చంద్ర బాబు నాయిడు"  వైపు ప్రజలు మొగ్గు చూపారు కాని, ఎవరూ కిరణ్ కుమార్ వైపు తల తిప్పి చూడలేదు.విచిత్రమైన అంశం ఏమిటంటే ,ఆయన మన సి.ఎమ్.అయినా ఒక్కడు కూడా ఆయనికి వోట్ వెయ్యలేదు.

.దీనివల్ల మనమొక విషయం అర్థం చేసుకోవాలి,"కిరణ్ కుమార్ రెడ్డి "గారికి ప్రజలలో "చరిష్మా" లేదు. అయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించని విషయం.అయినా ఆయన సి.యం అయ్యారు అంటే ఏమిటి కారణం. పైనున్న"అదిష్టాన దేవత" అని దేవున్ని నమ్మన్ని వారు సింపుల్  గా తీసి పారెయ్యొచ్చు. కాని" ప్రజా చరిష్మా" గలిగిన నాయకుల్ని కాదని కిరణ్ గారినే ఆమే ఎందుకు నియమించింది? ఏ సమాదానం చెప్పిన సంత్రుప్తికరంగా ఉండకపోవచ్చు.

 కాని "కిరణ్ కుమార్" గారి జాతక చక్ర ఫలం వల్ల అయన మీద దైవానుగ్ర్హం ఉండటం వలనే ఆయన ఇంత వొడిదుడుకుల్లో కూడ విజయవంతమైన పాలన చేస్తున్నాడు, అని మా బోటి ఆస్తికులు చెప్పేది మాత్రం చాలా మందిని సాటిస్పై చేసే  జవాబు కావచ్చనుకుంతా!

 అందుకే మేమనేది ,ప్రజా సమ్మత్తి ఉండని ఉండకపోని, ప్రజలంతా "సైతాన్" ల మాయలకు బ్రమసి,వెర్రివారై వారి చుట్టే తిరుగుతూ వారే తమ కాబోయే నాయకుడు అనుకోని గాక ఇవ్వన్నీ దేవుడి ముందు ఎందుకు కొరగావు.’బుద్ది బూములేలాదామంటే, రాత గాడుదులు కాద్దామందట! అనే సామెత ఊరికే రాలేదు నాయనలారా! తప్పకుండ మనకు మంచి రోజులు రాబోతున్నాయి! "కల్కి అవతారుడు" వస్తాడు, ఈ "కల్ నాయక్" లందరిని చెండాడుతాడు. ఇది ఆ బగవత్ నిర్ణయం .దీనిని ఎవరూ తప్పించలేరు.

 రోజు రోజుకు మారుతున్న పరిణామాలు చూసి అయినా ఇంకా ప్రజల ఆలోచనలో మార్పు రాక పోతే ఎలా? కోట్లు కుమ్మరించే దమ్మున్న వారిని సైతం "కటకటాల" వెనక్కి పంపించింది ప్రజా చైతన్యమా? వారిని అరెస్ట్ చెయ్యాలని ఎవరైనా ఉద్యమాలు చేసారా? లేదే! కేవలం రాతండి, రాత! అదే వారిని జైలుపాలు చేసింది! పొద్దున్న ఆరు గంటలకు ఇంట్లో ’కోట్లు" విలువ చేసే కుర్చీ లో కూర్చుని రాజసం వెలగబెట్టే వారిని సాయంత్రం ఆరు గంటలకు చిప్పకూడు తినే చెర సాలలో ఉంచింది ఏది> రాత బాబూ రాత!

  ప్రజలు, చైతన్యం, కోర్ట్లు, కేసులు ఇవన్న పైకి కనపడే కారణాలు కావచ్చు, కాని వాటిని నిర్ణయించిన ఆ దేవుడ్ని,లేక ఆ మహా శక్తిని మరిస్తే ఎలా?   ఆ బగవంతుడిని రమ్మని అందరూ ఆహ్వానిదాం  జై కల్కి! జై జై కల్కి.   

Tuesday, November 27, 2012

త్వరగా అవినీతిని త్రుంచడమో, పెంచడమో చెయ్యండి.!

                                                               
మన డెశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య అవినీతి. మన ఆదర్శమేమో అవునీతి నిర్మూలించి "దర్మ రాజ్యం" తెమ్మాంటుంటే, ఆచరణలో మాత్రం అది సాద్యమయ్యేపని కాదు అని చిన్నోళ్ల దగ్గర్నుంచి పెద్దోళ్లదాక ఒకటే నమ్మక్కం.ఈ మద్య అవినీతి నిర్మూలిస్తామని ఎవరైనా చెపితే వాడినో "వెర్రి వెంగళప్ప" ని చూసినట్టు చూస్తున్నారు.వీళ్ళ వల్ల కాడు వీళ్లను పుట్టించోడి వల్ల కూడ కాదు అనేది సామాన్య అభిప్రాయం.

  కాబట్టి ప్రజలారా దీనికొకటే విరుగుడు. ప్రభుత్వానికి ఒక "చివరాకరి" అవకాశం ఇచ్చేద్దాం. ఆ లోపు దేశమ్ లో అవినీతిని నిర్మూలించారా వెల్ అండ్ గుడ్. లెదా మనమే దానిని నిర్మూలిద్దాం. ఎలాగంటే అవినీతిని బాగా ప్రోత్సాహించేసి అవినీతి పరులను గడ గడ లాడిద్దాం!  ఈదేమి పిచ్చి సలహా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మనకో సామెతుంది "పెరుగుట విరుగుట కొరకే" అని . అందులో గొప్ప లాజిక్   తో కూడిన సత్యం ఉంది. కొంత మంది అవినీతి వలన ఎక్కువమంది బాదపడుతున్నాం. కాని అవినీతిని చట్టబద్దం చేసేసి(మనమే చెయ్యడం), అందరు విచ్చల విడిగా అవినీతిని ప్రోత్సహిస్తే దాని పలితం అతి త్వరలో ప్రజలకు కనపడి చివరకు "పాస్ పొయ్యడానికూడా"  పదిరూపాయలు ఇస్తే కాని పనికాని పరిస్తితులు వస్తాయి. అప్పుడు నా సామి రంగా ఈ అవినీతి ని ప్రజలు "నీతిగా" తరిమేస్తారు. మా "కల్కి" గారు అప్పుడు అందరికి దర్శనమిస్తాడు. కాబట్టి మనం ఎలాగు త్రుంచలేము. మన నాయకులకు,అదికారులకు సహాయపడి కనీసం దానిని పెంచుదాం. వాట్ డు యు సే?  

Monday, November 26, 2012

శివుని ఆజ్ణ లేనిదే సి.యం. కాలేడు,ఎవరైనా!


నేను "ఈ రాష్ట్రంలో ఎవరు సు పరిపాలన" ఇవ్వ గల నాయకుడు అని "సర్వె పోల్" పెడితే ’జయ  ఫ్రకాష్ నారాయణ్’,"చంద్ర బాబు నాయిడు"  వైపు ప్రజలు మొగ్గు చూపారు కాని, ఎవరూ కిరణ్ కుమార్ వైపు తల తిప్పి చూడలేదు.విచిత్రమైన అంశం ఏమిటంటే ,ఆయన మన సి.ఎమ్.అయినా ఒక్కడు కూడా ఆయనికి వోట్ వెయ్యలేదు.

 దీని వల్ల మనకి అర్థమయ్యేది ఒక్కటే,దేవుడు తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు! ఎవరు అవునన్నా, కాదన్నా,అందలమెక్కించగలడు, దించనూ గలడు.కాబట్టి దేవుడితో గేమ్స్ వద్దు.

Sunday, November 25, 2012

మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే




మొన్న తెలంగాణా ప్రాంతంలొకి  "షర్మిల" ప్రవేశించినపుడు అక్కడ ఆమెకు స్వాగతం పలికిన జన  ప్రభంజనం చూసిన ఏ.బి.యన్. చానల్. వారు అయోమయంలో,పడ్డట్టుంది. వెంటనే అదే రోజు తమ చానల్ లో కామెంటోపనిషత్ ప్రసారం చేసారు. ఇక రానుంది ’అన్యమత రాజ్యమే’ అని ఒక సందేశం ప్రజలకు ఇచ్చినట్లుంది.

అయ్యా "దమ్మున్న చానల్, దుమ్ము రేపే చానల్" గారు మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే. మా హీందూ మతం గురించి మాకు భయం లేదు. మాకు "కల్కి" వస్తాడు."ధర్మాని రక్షిస్తాడు.ఇది హిందువుల అచంచల నమ్మకం.