మన రాష్ట్రం లో కొంత మంది మేదావులకి జనం సైకాలజీ అస్సలు అర్దం కాదు. ఆ ఒక్క కారణం చేతనే అరవై ఏండ్లుగా కమ్మ్యునిస్ట్ మేదావులు అధికార పీఠం సాదించ లేక పోయారు , ఇక ఇప్పుడైతే కనీసం ప్రతిపక్ష పీఠం ని కూడా సాదించలేక , ఉన్న స్తానాలు ఎలా నిలబెట్టుకోవాలిరా "మార్క్స్" దేవుడా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.కొందరేమో రష్యన్ల రాజకీయ పరిస్తితిలోనూ , మరి కొందరేమో చైనా రాజకీయ పరిస్తితిలోనూ ఇండియా రాజకీయ పరిస్తితులను పోల్చి , పోల్చి 'ఇదిగో సోషలిజం తేవడానికి ఇవే అనువైన పరిస్తితులు' అంటూ పాడిందే పాడి , పాడిందే పాడి జనాలకు విసుగు వచ్చేలా చేసారు . చివరకు ఆ దేశాలలో ప్రజలు తమ మైండ్ సెట్ మార్చుకుని ప్రపంచం తో అభివృద్దిలో పోటీ పడటానికి అనువైన మార్గాలు ఎంచుకుని ఆ దారిలో నడవడం ప్రారంబించేసరికి ఇక్కడ మన మేదావులకి మేటర్ లేకుండా పోయింది. అలా తిరోగమనం లోకి నెట్టబడ్డారు. దీనంతటికి కారణం " ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలన్న " ఇంగిత జ్ఞానం లేక పోవడం. ప్రజలలో తమ పట్ల ఎమోషనల్ పీలింగ్ ఉన్నప్పుడే సఖ్యతతో అధికారాన్నిచేపట్టి , ఆ తర్వాత ప్రజా అనుకూలంగా పాలన సాగించి ఉంటే కొంత అయినా సక్సెస్ అయి ఉండే వారు. ఒక్క పశ్చిమ బెంగాల్ వారు ఆ పని చేసారు. అదిగో అప్పుడు కమ్మ్యూనిశ్ట్ మేదావులు చేసిన తప్పులనే ఇప్పుడు లోక్ సత్తా అది నేత జయ ప్రకాశ్ నారాయణ్ గారు చెయ్యడానికి సిద్ద పడుతున్నారు.
ఈ మద్య ఆయనొక వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. అవినీతిని అంతమొందించడానికి డిల్లీ ప్రజలు చూపిన పట్టుదల, విజ్ఞత తెలుగు ప్రజలు చూపలేరా? అని అయన గారి ప్రశ్న. డిల్లీలో ఆం ఆద్మీ పార్టీకి ప్రజలు అదికారం కట్టబెట్టడానికి లేక అత్యదిక సీట్లు ఇవ్వడానికి కారణం అవినీతి మీద కేజ్రీవాల్ గారు సందించిన పోరాట అస్త్రమే అని అంటున్న జయప్రకాష్ గారి మాటల్లో నిజం ఉన్నప్పటికి , అది మాత్రమే కేజ్రీ వాల్ కు సీట్లు కట్ట బెట్టింది అనుకోవడం పొరపాటే అవుతుంది. కాంగ్రెస్ కి ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఆటు B.J.P కి కానీ , ఇటు ఆం ఆద్మీకి కానీ సీట్లు కట్ట బెట్టింది. అన్నా హాజారే మీద ప్రజకు ఉన్న ఎమోషనల్ టచ్ ని తెలివిగా కేజ్రీవాల్ రాజకీయ శక్తిగా మార్ఛాదు. అలాగే నిర్భయ ఉదంతం కూడా ప్రజల ఎమోషనల్ ఫిలీంగ్ ని B.J.P , ఆం ఆద్మీ పార్టీల వైపు మరల్చేలా చేసింది. అంటే కాలం ఖర్మం అన్నీ కలసి వచ్చాయి. కాబట్టే కేజ్రీవాల్ ఈ రోజు డిల్లీ గద్దె ఎక్కుతున్నాడు.
మరి తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు ప్రస్తుతం రెండు బలమైన ఎమోషనల్ గ్రూపులుగా విడి పోయి ఉన్నారు. ఒకటి తెలంగాణా వాదులుగా కాగా , రెండవది సమైఖ్య వాదులు గా . మరి ఇటువంటి పరిస్తితుల్లో అవినీతి , చీపురు కట్ట అంటే ప్రజలు పట్టించుకుంటారా అనేది ప్రశ్న . ప్రజల ఎమోషనల్ ఫిలింగ్ ని అర్దం చేసుకోకుండా , కేవలం తన ఎమోషనల్ ఫీలింగ్ ని ప్రజలు అర్దం చేసుకోవాలి అని ఆశించే జయ ప్రకాశ్ గారు , ఆం ఆద్మీ తరహాలో లోక్ సత్తాకు ప్రజలు చేరువ అవుతారు అని అంచనా వెయ్యడం లో వింతేమి లేదు. కానీ అయన ఆలోచన సక్సెస్ అవ్వడమే వింత అవుతుంది . ఈ మద్య ఒక చానల్ చర్చలో ఒకరు విశ్లేషకులు మాట్లాడుతూ అసలు ఈ సారీ జయ ప్రకాశ్ గారు కూకట్ పల్లీ స్తానాన్ని నిల బెట్టుకుంటారా? అని సందేహం వెలిబుచ్చారు. అదీ వాస్తవ అంచనా అంటే. అంతే కానీ ఎక్కడో డిల్లీలో ఆంఆద్మీ కి ప్రజలు పట్టం కట్టారని ఇక్కడ లోక్ సత్తాకు పట్టం కడతారా? నిజంగా ప్రజలకు అవినీతి మీద అంత ఏవగింపే ఉంటే అవినీతి సామ్రాట్టులు అధికార కలలు ఎందుకు కంటారు?
కాబట్టి జయ ప్రకాశ్ గారు అధికారం లోకి రావాలంటే , సమైక్యతా వాదం బుజాన వేసుకుని 294 సీట్లకు పోటీ చెయ్య గల సత్తా ఉండాలి . అప్పుడే లోక్ సత్తా గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఒక వేళ ఎన్నికల లోపు రాష్ట్రం విడి పోతే దానికి ప్లాన్ వేరే ఉంటుంది. ఇవ్వన్నీ లేకుండా ప్రజలని చీపురు కట్ట ఇవ్వమంటే ఇవ్వడం కష్టం. మరి ఎప్పటికీ ఇంతేనా ? జయప్రకాశ్ లాంటి వారు ఏమి చెయ్యాలి అని అంటే టైం వచ్చేదాక ఇదిగో ఈ క్రింది వీడియో లింక్ లో ఉన్న పాటలు మాదిరి పాటలు వినుకుంటూ ఎమోషనల్ గా పోరాటం చేస్తూ ఉండడమే.
"సమైక్యతా వాదం బుజాన వేసుకుని 294 సీట్లకు పోటీ చెయ్య గల సత్తా ఉండాలి"
ReplyDeleteఆయనకే కాదు, ఎవరికీ ఆ సత్తా లేదు. జగన్ కూడా తెలంగాణాను వదిలేసుకున్నాకే సమైక్యరాగం ఎత్తుకున్నాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్తితుల ప్రకారం మీరు చెప్పింది కరెక్ట్. ఈ రోజు తన ప్రమాణ స్వీకారం సందర్బంగా కేజ్రీ వాల్ గారు అనేక సార్లు భగవంతుని గుర్తుకు తెచ్చుకున్నారు. రెండేళ్ళ క్రితం తాము కలలో కూడా ఊహించని సామాన్యుడి విజయం కేవళం పైనున్న ఆ దేవుడి మహిమ వల్లే సాద్యపడిందని , అంతే కాదు భారత దేశానికి ఏవో మంచి రోజులు రాబట్టే ప్రజలలో చైతన్య బావనలు కలుగుతున్నాయని, అది ఆ దేవుడి మహిమ తప్పా వేరేమి కాదని చెప్పారు.
Deleteఆయన చెపుతున్నది నిజమే. ఆయన మటల్లోనే డిల్లీలో ఏన్నో రేప్ లు జరిగాయి, కానీ నిర్భయకు వచ్చిన ప్రజా స్పందన దేనికీ రాలేదు. షీలా దీక్షిత్ గారిని నిర్భయ గద్దె దించింది అనటం లో అతిశయోక్తి లేదు. అలాగే ఒక సమర్దుడైన నాయకుడి ఆవిర్బావం కోసమే "తెలంగాణ" రాష్ట్ర అంశం తెరమీదకి వచ్చి ఉండొచ్చు కదా ! ఏమో ఎవరు చెప్పగలరు? ఈ నాలుగు నెల్లలో ఎన్ని అద్బుతలు జరుగనున్నాయో! వేయిట్ అండ్ సీ
"అలాగే ఒక సమర్దుడైన నాయకుడి ఆవిర్బావం కోసమే "తెలంగాణ" రాష్ట్ర అంశం తెరమీదకి వచ్చి ఉండొచ్చు కదా"
DeleteKCR: maybe?
Kodandaram: maybe?
Jagan: maybe?
Ashok Babu: maybe?
Kiran Reddy: 0% chance
Chiranjeevi: 0% chance
Dr. JP Narayan: 0% chance
ఏం పాపం ? ఆ చివరి ముగ్గురు ఏం పాపం చేసుకున్నారు!?
DeleteMy assessment of their leadership qualities, maybe I am wrong:)
Deletevery nice one
ReplyDelete