సాదారణంగా ఎవరైనా పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటుంటే వారి ప్రేమ వ్యవహారాలు తాలూకు పొటో లు తీసి ,అవి వారి పెద్దలకు చూపిస్తాం అని బ్లాక్మెయిల్ చేసి , అలా చెయ్యకుండా ఉండగలందులకు అంతో ఇంతో డిమాండ్ చేసే బ్లాక్ మైలర్ లు గురించి విన్నాం కానీ, పాపం అభం శుభం తెలియని అమాయకపు ప్రేమికులను తమ ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయించి వాటిని సామాజిక సైటుల్లో పెట్టడమే కాక , వారి తల్లితండ్రులకు , స్నేహితులకు పంచుతామని బెదిరించి 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న బ్లాక్ మైలింగ్ ఉదంతం వింటుంటే కొంచం ఆశ్చర్యం వేయక తప్పదు. వివరాలు లోకి వెళితే....
ఒక అమాయి, ఒక అబ్బాయి . ఇద్దరూ మెడికల్ స్టూడెంట్ లు. వీరు మంగలోర్ లోని దార్లకట్టే లోని ఒక ప్రైవేట్ కాలేజిలో చదువుకుంటున్నరు. మొన్న 18 వ తారికున ఇద్దరూ సరిగ్గా రాత్రి 11 గంటలకు ఒక రెస్టారెంట్ బయట తమ కారులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే , దార్లకట్టె కు చెందిన రౌడి షీటర్ లు 8 మంది వచి వీరిద్దరిని కిడ్నాప్ చేసి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్లరట. అక్కడ ఆ అమ్మాయి ,అబ్బాయిని సెక్స్ లో పాల్గొనమని బలవంతం చేసారట . దానికి ఆ అమ్మాయి, అబ్బాయి , రామ ! రామ . అటువంటి పాడు పనులు మేము చేయమన్నారట! చేయకపోతే చంపేస్తామని బెదిరించారు అట! దానితో గత్యంతరం లేక సెక్స్ లో పాల్గొంటే ఆ రౌడీలు ఆ దృశ్యాలను సెల్ లో బందించి , 25 లక్షలు ఇవ్వమని, లేకుంటే వాటిని పేస్ బుక్ లో పెడతామని బెదిరించారు అట! చివరకు ప్రేమికులు బ్రతిమాలితే 3 లక్షలకు O.K అన్నారట. ఆ అబ్బాయిని తమవద్ద బందీగా ఉంచుకుని , అమయిని డబ్బు తెమ్మని పంపితే ఆ అమ్మాయి దైర్యం చేసి , ఒక న్యాయవాది ద్వారా పోలిస్ కంప్లైంట్ ఇచ్చి వారి నందరిని పట్టించింది అట. హేట్సాప్ టు అమాయి!
ఈ ఉదంతం లో అంతా నమ్మబుల్ గానే ఉంది కానీ , బ్లాక్మెయిలింగ్ కోసం అన్నెం పున్నెం ఎరుగని అబ్బాయి, అమ్మాయిని బలవంతంగా కాని పని చేయించాల్సిన అవసరం ఏమిటి అనేదే డౌట్ గా ఉంది. పై పెచ్చు ఆ వీడియో ను వారి తల్లి తండ్రులకు చూపిస్తాం అని బెదిరించడం చూస్తుంటే ఎదో తేడా ఉంది కహానిలో అనిపిస్తుంది. ఏదో చదువుకుని వంశాన్ని ఉద్దరిస్తారు అనుకుంటే రాత్రి 11 గంటల వరకు షికారు చేసే బాయి ప్రెండ్ గర్ల్ ప్రెండ్ లను చూస్తె రౌడి షీటర్ లకు మంఛి ఆలోచనలు ఎందుకు వస్తాయి ? ఇంకా నయం, అమాయిని వారు ఏమి చేయలేదు. లేకుంటే , మరో నిర్బయ ఉదంతం తో మంగలోర్ మార్మోగేది! దాంక్ గాడ్.
No comments:
Post a Comment