Friday, December 20, 2013

B.C కులంలో పుట్టినంత మాత్రానా B.C. నాయకులు కాలేరు, B.C ల అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి నాయకుడు B.C యే !.


                                                        

మన రాజకీయాలలో ఒక తప్పుడు అభిప్ర్రాయం  ఉంది . అదేమిటంటే B.C   కులం కి సంబందించిన రాజకీయ నాయకులు B.C  ల అభిరుద్ది కోసం తెగ ఆలోచిస్తారని, తక్కిన కులాల వారు ఎవ్వరూ B.C  ల సంక్షేమాన్ని పట్టించుకోరని. నిజమైన ప్రజా  నాయకుదు కి కుల మతాల వివక్షత లేకుండా ప్రలందరి సంక్షేమం గురించి ఆలోచిస్తాడు.

   అయితే మన దేశం లో ఉన్న ప్రత్యేక పరిస్తితుల వలన అంటే కొన్నీ యేండ్లుగా కుల వ్యవస్త మాటున కొన్ని వర్గాల ప్రజలు సామాజికంగా అణచి వేయబడ్డారు. వారిని ఇతర వర్గాల ప్రజలతో సమానం గా ఎదగడానికి కొన్న ప్రత్యెక రాయితీలు రిజర్వేషన్ ల రూపం లో ఇవ్వడం తప్పనిసరి అయింది. అలా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వర్గాలను ఎంపిక చెయ్యడానికి "కులం" ప్రాతిపదిక తప్పా , మరేది మెరుగైనడిగా కనపడ లేదు. అందుకే   షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులుగా ప్రజలను కుల ప్రాతిపదిక పరంగా గుర్తించి , వారికి రిజర్వేషన్ లు కలుగ చేసారు. కాబట్టి ఈ  వర్గాలుకు చెందిన ప్రజలు రాజ్యంగ పరంగా ప్రబుత్వ రాయితీలు  పొందడానికి అర్హులు.

   వీరు సంఘాలు పెట్టుకోవటానికి, తమ కోరికలు ప్రభుత్వాలకు చెప్పుకుని , తమ హక్కులు సాదించుకోవటానికి అర్హత కలిగిన వారు. వీరు నిర్వహింవ్చే సభలకు, సమావేశాలకు రాష్ట్రపతిని పిలిచినా , రావాల్సిన అవసరం ఉంది. అదే ఏ అగ్ర వర్ణం వారో సభ పెడితే అది "కుల సంఘ సభ" అవుతుంది. కానీ రాజ్యాంగం గుర్తించిన పై వర్గాల వారు ఎవరు సభ పెట్టినా అది కుల సంఘ సభ గ బావించి రావడానికి  ఏ అధికారి నిరాకరించరాదు. అది ఆ యా వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నిరాకరిస్తున్నట్లు బావించవచ్చు.

    ఇక పోతే B.C  కులంలో పుట్టినంత మాత్రానా B.C.  నాయకులు కాలేరు, B.C  ల అభివృద్ధి  కోసం ఆలోచించే ప్రతి నాయకుడు B.C  యే అని నా అభిప్రాయం. ఈ  ప్రస్తావన ఎందుకంటే , మొన్న హైదరాబాద్ లో B.C ల హక్కులు గురించి  "బి.సి ల సింహ గర్జన " అనే పేరుతో , B.C లు కొంతమంది ఒక సభ నిర్వహించారు. దానికి B.C  నాయకులతో పాటు, పార్టి పరంగా 100 సీట్లు B.C  లకు కేటాయిస్తాను అని ప్రకటించిన , తెలుగుదేశం అదినేత నారా చంద్ర బాబు నాయుడు గారిని కూడా  వేదిక మీదకు ఆహ్వానించారట! దానితో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు కోపం వచ్చిన B.C  ల సభలో B.C  యేతరుడు ఎలా అని చిందులేస్తో , సభను వీడి వెళ్లి పోయారట! B.C  సభకు అన్నీ పార్టీల అద్యక్షులను పిలచి తమకు ఎన్నికలలో సగం సీట్లు కావాలని కోరితే బాగుండేది. కానీ అలా పిలవనంత మాత్రానా చంద్రబాబు గారు B.C  ల సభలో పాల్గొనే అర్హత లేదనడం "కొంచపు తనం" అవుతుంది తప్పా , అది B.C  లకు ఏ మాత్రం మేలు చేసే ఆలోచన కాదు.ఇదే సందు అని చెప్పి కొన్నీ చానళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూసాయి . అటువంటి దానిని ఈ  క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ లో చూడండి. 

          
            

No comments:

Post a Comment